HomeAndhra PradeshAP BJP: నామినేటెడ్ పదవులపై టీడీపీ-బీజేపీ మధ్య పేచీ

AP BJP: నామినేటెడ్ పదవులపై టీడీపీ-బీజేపీ మధ్య పేచీ

AP BJP: ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై తర్జనభర్జన కొనసాగుతోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తుండటంతో ఐదేళ్లపాటు పార్టీల కోసం కష్టపడ్డ వారు ఇప్పుడు పదవుల రేసులోకి వస్తున్నారు. అత్యధిక శాతం టీడీపీ నుంచి ఆశావహులు ఉండగా, అటు వైపు జనసేన, బీజేపీ నేతలు సైతం పదవులు ఆశిస్తున్నారు.

ఈ క్రమంలో మూడు పార్టీల మధ్య సఖ్యత లోపించినట్లు తెలుస్తోంది. ఏ పార్టీకి ఎంత శాతం పదవులు కట్టబెట్టాలన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. తాజాగా నామినేటెడ్ పదవులు, పోస్టులపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారట సీఎం. ఇదే అంశంపై జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో ఇప్పటికే పలుమార్లు డిస్కషన్ చేసినట్లు ఆయా పార్టీల శ్రేణులు చెబుతున్నాయి.

తాజాగా ఇవాళ ఉండవల్లి నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీ శివప్రకాశ్ సీఎం చంద్రబాబును కలిశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై వీరి ముగ్గురి నడుమ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నామినేటెడ్ పోస్టులపై టీడీపీ, బీజేపీ మధ్య పేచీ నెలకొన్న నేపథ్యంలో వీరి చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది.

బీజేపీకి కేవలం 10 శాతం నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని టీడీపీ నిర్ణయించడంతో దీన్ని రాష్ట్ర బీజేపీ శాఖ తీవ్రంగా వ్యతిరేకించినట్లు వార్తలు వస్తున్నాయి. నామి‌నేటేడ్ పోస్టులలో బీజేపీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర బీజేపీ పెద్దలు చంద్రబాబుకు సూచించారట. ఇదే అంశాన్ని గత వారమే చంద్రబాబుకు పురందేశ్వరి తెలిపారట. తాజాగా ఇవాళ మరోసారి ఇదే అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పదవుల భర్తీ త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కూటమి వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి: Galla Madhavi: గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే భర్తపై అట్రాసిటీ కేసు!
Blood Tests: మీకు 25 ఏళ్లు దాటాయా? అయితే ఈ 6 టెస్టులు తప్పనిసరి!
Andhra Pradesh BJP: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ’మెగా‘ ‘పవర్?’
BJP – AAP: బీజేపీ కార్యాలయం వద్ద ఆప్ నిరసన.. ఢిల్లీలో ఉద్రిక్తత

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు