HomeAndhra PradeshYS Jagan: వక్ఫ్ బిల్లుకు మేం వ్యతిరేకం.. వైయస్ జగన్ క్లారిటీ

YS Jagan: వక్ఫ్ బిల్లుకు మేం వ్యతిరేకం.. వైయస్ జగన్ క్లారిటీ

YS Jagan: ముస్లిం మైనారిటీల సమస్యలపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎల్లవేళలా ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామన్నారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పునరుద్ఘాటించారు. తాడేపల్లిలోని ఆయన క్యాంపు ఆఫీసులో ఇవాళ ముస్లిం మైనార్టీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు జగన్.

ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ప్రతి అంశంపై తమ పార్టీ తొలి నుంచి అండగా నిలిచిందన్నారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తప్పకుండా మీ వెంట నడుస్తుందని భరోసా ఇచ్చారు. వక్ఫ్‌ బిల్లుపై మీరు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తుతారన్నారు. ఇంకా పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ)లో సభ్యుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని, అన్ని అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారని భరోసా ఇచ్చారు.

ముస్లిం సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. వక్ఫ్‌ భూముల్లో దాదాపు 70 శాతానికి పైగా కబ్జాలో ఉన్నాయని, కొత్తగా ప్రతిపాదించిన వక్ఫ్‌ చట్టంలో రూపొందించిన నిబంధనల ద్వారా తమ (వక్ఫ్‌) భూములు తమకు దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కొత్త వక్ఫ్‌ బిల్లును మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందన్నారు. ఆ బిల్లును వైయస్సార్‌సీపీ వ్యతిరేకించడంపై హర్ష్యం వ్యక్తం చేశారు. బిల్లును వైయస్సార్‌సీపీ వ్యతిరేకించడం వల్లనే, కేంద్రం దాన్ని జేపీసీకి పంపిందని గుర్తు చేశారు.

కాగా, వక్ఫ్‌ భూముల పరిరక్షణకు గతంలో వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ గుర్తు చేశారు. వక్ఫ్‌ బోర్డును బలోపేతం చేయడంతో పాటు, ఆ భూముల వివరాలన్నీ ఆన్‌లైన్‌ ఒక గొప్ప పరిణామం అన్నారు. ముస్లింలకు జగన్‌ చేసిన మేలు, దేశ చరిత్రలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకు చేయలేదన్నారు. వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా జీవో 60 జారీ చేసిన విషయాన్ని మర్చిపోరాదన్నారు.

ఇవీ చదవండి: YS Jagan: మరో మూడు నెలల్లోనే చంద్రబాబు…. వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు
YS Sharmila Reddy: అన్నపై షర్మిల మరోసారి ఆక్రందన.. విలీనం, జగన్ మళ్లీ రాడంటూ…
YS Jagan: ఢిల్లీలో ధర్నాపై వైయస్సార్‌సీపీ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు
YS Jagan in Nellore: దాడులు ఆపాలి.. చంద్రబాబుకు వైయస్ జగన్ హెచ్చరిక
Reddy Community: సొంత సామాజికవర్గమే జగన్‌ను ముంచేసిందా? అంత వ్యతిరేకతకు కారణాలేంటి?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు