Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) ఈ ఏడాది పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దళపతిగా సినీరంగంలో ఆయన చెరగని ముద్ర వేశారు. ఆయన పార్టీ పేరు ‘తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam)’గా పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించి జెండాను ఆవిష్కరణ చేశారు విజయ్. చెన్నైలో తన పార్టీ కార్యాలయంలో విజయ్ ఈ జెండాను ఇవాళ ఎగురవేశారు. ఎరుపు, పసుపు కలర్స్‌లో ఉన్న ఆ జెండా మధ్యలో పువ్వు ఉంది. ఇరువైపులా రెండు ఏనుగులు ఉన్నాయి. తమిళ సంప్రదాయం ప్రకారం ఈ పువ్వును విక్టరీకి గుర్తుగా చెబుతారు.
పార్టీ జెండాతో పాటు సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ పేరెంట్స్ తో పాటు సపోర్టర్స్, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ‘‘మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులను, తమిళ నేల నుంచి వెళ్లి మన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన అసంఖ్యాక సైనికులను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం.
కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను మేం తొలగిస్తాం. ప్రజలకు అవగాహన కల్పించి అందరికీ సమానహక్కులు, అవకాశాల కోసం కృషి చేస్తాం. సమానత్వం అనే సూత్రాన్ని బలంగా సమర్థిస్తాం’’ అని విజయ్ ప్రతినబూనారు. మరో రెండేళ్లలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు (Tamil Nadu Assembly Elections) జరగనున్న సంగతి తెలిసిందే. విజయ్ పార్టీ ప్రకటనతో తమిళనాట ఈ పరిణామాలు కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విజయ్ (Actor Vijay) రాజకీయ పార్టీని ప్రారంభించాక లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇతర ఏ పానర్టీకి కూడా ఆయన మద్దతు పలకలేదు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని విజయ్ తెలిపారు.
ఇవీ చదవండి: National Film Awards: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. ఉత్తమ నటుడు రిషభ్
Mister Bachchan Review: మిస్టర్ బచ్చన్ రివ్యూ.. 2011-12 తర్వాత సినిమాలు రాలేదా?
YS Jagan: మరో మూడు నెలల్లోనే చంద్రబాబు…. వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు
YS Sharmila Reddy: అన్నపై షర్మిల మరోసారి ఆక్రందన.. విలీనం, జగన్ మళ్లీ రాడంటూ…
Paraguay Swimmer Luana: అందం తెచ్చిన తంటా.. ఒలింపిక్స్ నుంచి పంపేశారు!
