Tax: గ్రామంలో ఎవరైనా ఒకరు కోటీశ్వరులు ఉండటం కామన్. కానీ గ్రామం మొత్తం శ్రీమంతులే ఉంటే.. ఆ విలేజ్ ఎంతో ప్రత్యేకం. సరిగ్గా ఇలాంటి గ్రామం గురించే ఈ కథనంలో తెలుసుకుందాం. రాజస్తాన్ లోని ఓ గ్రామంలో అందరూ ధనవంతులే ఉన్నారు. ఏటా కోట్లాది రూపాయలు కేవలం పన్నుల రూపంలోనే కడతారట. ఆ గ్రామం పేరు రాసిసర్. బికనీర్‌లోని నోఖా సబ్ డివిజన్ ప్రాంతంలో ఉంది.
రాజస్తాన్ రాష్ట్రంలోని అనేక జిల్లాలకంటే ఈ ఒక్క గ్రామం మాత్రమే ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తోందట. నోఖా గ్రామ ఆర్థిక వ్యవస్థ కేవలం చక్రాలపైనే తిరుగుతుందంటే నమ్మగలరా? ఇక్కడ నివసించే ప్రజలు ఏటా రూ.5 కోట్ల ట్యాక్స్ చెల్లిస్తున్నారంటే వారి ఆర్థిక స్థితి ఎంత మెరుగ్గా ఉందో ఇట్టే అంచనా వేయవచ్చు.
1,500కు పైగా ట్రక్కులు, ట్రాలీలు
రాసిసర్ విలేజ్ జనాభా 15,000. రూ.కోట్ల విలువైన 1,500కు పైగా ట్రక్కులు, ట్రాలీలు, వందలాది బస్సుల యజమానులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. గ్రామంలో ఉన్న ట్రక్కులు, బస్సులు, వాటి ద్వారా వచ్చే ఆదాయం దృష్ట్యా పాలనా యంత్రాంగం నోఖాలో ప్రత్యేక డీటీఓ కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం విశేషం. ప్రస్తుతం నోఖా డీటీఓ కార్యాలయం ఏటా ఆదాయ వసూళ్ల లక్ష్యం రూ.46.53 కోట్లుగా ఉందట. ఊరి వీధుల్లో, పొలాల్లో బస్సులు, ట్రక్కులు మాత్రమే దర్శనమిస్తాయి. రాజస్తాన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని ట్రక్కులు, బస్సులు ఉన్నది ఈ గ్రామంలోనే.
ఇదో బ్రాండ్ విలేజ్
గ్రామంలో చిన్న, పెద్ద వాహనాలు మొత్తం కలిపి 5,000కు పైగా ఉయట. గ్రామంలో సుమారు 1,500 ట్రక్కులు, ట్రైలర్లు, డంపర్లు, 125 చిన్న, పెద్ద బస్సులు, 728 పికప్ క్యాంప్‌లు, 806 లగ్జరీ కార్లు, ఆటోలతో సహా అనేక వాహనాలు తిరుగుతున్నాయి. గ్రామంలో 2,000కు పైగా బైకులు ఉన్నాయి. గ్రామంలోని అన్ని వాహనాలపై రాసిసర్ అనే పేరు కనిపిస్తుంది. శ్రీమంతులున్న ఈ విలేజ్ లో రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ విద్యుత్, నీరు, వైద్యం, రహదారులు సహా అన్ని మౌలిక సదుపాయాలు కూడా టాప్ క్లాస్ లో ఉంటాయి. 5 ప్రభుత్వ స్కూళ్లు, సీహెచ్‌సీ, ఆయుర్వేద ఆస్పత్రి, పశువైద్యశాల ఉన్నాయి.
ఇవీ చదవండి: BP Control: ఈ రెండు చిట్కాలతో మాత్రలు వేసుకోకుండా బీపీ నియంత్రణ!
Puja Khedkar Controversy: పూజా ఖేడ్కర్ కాంట్రవర్సీ ఏంటి? సివిల్ సర్వెంట్లను నియంత్రించే నియమాలు ఎలా ఉంటాయంటే..
Stress: అధిక ఒత్తిడిని జయించాలంటే ఏం చేయాలి?
Idiot Syndrome: సొంత వైద్యం కోసం ఇంటర్నెట్లో వెతుకుతున్నారా? ఇడియట్ సిండ్రోమ్ గురించి తెలుసా?
YouTube: మీ యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్ ఎగిరిపోయిందా? రిక్వెస్ట్ ఇలా పంపండి..!
