Indian 2: లోక నాయకుడు.. కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం భారతీయుడు 2. (Indian 2). భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం.. ఈనెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే, మొదటి రోజే ఈ చిత్రానికి మిక్స్ టాక్, నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది. తొలి రెండు రోజులు వసూళ్లు ఫర్వాలేదనిపించినా అనంతరం దారుణంగా పతనమయ్యాయి.
వీక్ డేస్‌లో ఊహించిన వసూళ్లు రాబట్టలేకపోయింది. తాజాగా వారం రోజుల్లో ఇండియన్-2 మూవీకి మనదేశ వ్యాప్తంగా వ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఇండియన్ 2 మూవీ అభిమానులకు నిరాశనే మిగిల్చింది. ముఖ్యంగా కమల్ స్థాయికి, నటనకు తగ్గట్టుగా ఈ చిత్రం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక 7వ రోజు భారత్ లో కేవలం రూ. 2 కోట్ల నెట్ వసూళ్లే వచ్చాయట. ఇండియన్ 2 మూవీపై మొదటి రోజు నుంచే సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ ను విస్తృతంగా చేశారు.. ఈ నేపథ్యంలోనే కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే వారం రోజుల్లో రూ.121.65 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
ఇలాగే కొనసాగితే ఇండియాలో రూ.100 కోట్ల మార్క్‌ను కూడా దాటడం గగనం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా.. ఇండియన్ 2 సినిమాకు మొదటి రోజు రూ. 25.6 కోట్లు కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో మరోసారి మెప్పించారు. ఇందులో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇవీ చదవండి: Tax: ఆ గ్రామంలో అందరూ శ్రీమంతులే.. ఏటా రూ.5 కోట్ల ట్యాక్స్ కడతారట!
Kalki Trailer: కల్కి ట్రైలర్ ఆగయా.. రికార్డ్స్ చెక్ చేసుకోమంటున్న ప్రభాస్
Kalki 2898 AD: కల్కి 2898AD ప్రత్యేకం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే!
Nandamuri Balakrishna: బాలయ్య కెరీర్‌లో డిజాస్టర్లు ఎన్ని?
Smoking: పొగతాగడం వల్ల ఎన్ని దుష్పరిణామాలో తెలుసా? పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం!
