HomeNationalPuja Khedkar Controversy: పూజా ఖేడ్కర్ కాంట్రవర్సీ ఏంటి? సివిల్ సర్వెంట్లను నియంత్రించే నియమాలు ఎలా...

Puja Khedkar Controversy: పూజా ఖేడ్కర్ కాంట్రవర్సీ ఏంటి? సివిల్ సర్వెంట్లను నియంత్రించే నియమాలు ఎలా ఉంటాయంటే..

Puja Khedkar Controversy: ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. తప్పుడు అఫిడవిట్లు సమర్పించడం, నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ల దుర్వినియోగం ఎంబీబీఎస్ లో చేరేందుకు తప్పుడు పత్రాలు సృష్టించడం సహా ట్రైనీ పీరియడ్ లో అదనపు సౌకర్యాలు డిమాండ్ చేయడం లాంటి అనేక కాంట్రవర్సీల్లో ఇరుక్కుని ఆమె ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఆమెపై వచ్చిన అలిగేషన్స్ ఏమిటి? అసలు సివిల్ సర్వెంట్లను నియంత్రించే నియమాలు ఏమిటి? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పూజా ఖేడ్కర్‌పై వివాదం ఎక్కడ మొదలైంది?
2023 బ్యాచ్‌ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా మనోరమ దిలీప్‌ ఖేడ్కర్‌. ట్రైనీ అయినప్పటికీ జిల్లా కలెక్టర్‌ స్థాయిలో తనకు కూడా అధికారిక సౌకర్యాలు, వసతులు కావాలంటూ పూజా ఖేడ్కర్ డిమాండ్ చేయడంతో అసలు వివాదం మొదలైంది. తనకు స్పెషల్ గా కార్యాలయం కావాలని, అఫిషియల్ కారు కావాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేనా.. ఖరీదైన తన సొంత కారుపై ఎర్ర బుగ్గను తగిలించుకుని హల్ చల్ చేశారు. ఈ నేపథ్యంలోనే పుణె అసిస్టెంట్‌ కలెక్టర్‌ హోదా నుంచి ఆమెను వాసిమ్‌ జిల్లాలో సూపర్‌ న్యూమరరీ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా అక్కడి సర్కార్ ట్రాన్స్ ఫర్ చేయడంతో వివాదం మరింత ముదిరింది.

పూజా చేసిన తప్పులేంటి?
* తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించడం ద్వారా పూజా ఖేడ్కర్ అఖిల భారత స్థాయిలో 821వ ర్యాంకు సాధించారని ఆరోపణలు వచ్చాయి. తప్పుడు పత్రాలతో ఎంబీబీఎస్ సీటు సాధించారని పూజాపై ఆరోపణలున్నాయి.
* యూపీఎస్సీకి పూజా సమర్పించిన వైకల్యం సర్టిఫికెట్లు, అఫిడవిట్లకు విశ్వసనీయత లేదని ఆరోపణలున్నాయి.
* 2022 ఆగస్ట్‌లో పుణె జిల్లా పింప్రి ఆస్పత్రిలో ఎడమ మోకాలికి వైకల్యం ఉందని ఆమె వికలాంగ సర్టిఫికెట్‌ పొందారని యశ్వంత్‌రావ్‌ చవాన్‌ స్మారక ప్రభుత్వాసుపత్రి డీన్‌ రాజేంద్ర వాబ్లే తెలిపారు.

* అదే నెలలో ఔధ్‌ ప్రభుత్వాసుపత్రిలో వైకల్య సరిఫికెట్‌ కోసం పెట్టుకున్న ఆమె దరఖాస్తు రిజెక్ట్ అయ్యిందని తేలింది.
* కమిషనర్‌ ఫర్‌ పర్సన్స్‌ విత్‌ డిజెబిలిటీ ఆదేశాల మేరకు పూజ గతంలో సమర్పించిన వైకల్య సర్టిఫికెట్లంన్నింటినీ పరిశీలిస్తామని పుణె పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు.
* పూజా కంటి, మానసిక, అంగ వైకల్యం ఉందని ధ్రువపరిచిన ఆస్పత్రులు, వైద్యులు ఎవరు, వారు విధి నిర్వహణలో కచ్చితంగా ప్రమాణాలు పాటించారా లేదా అన్న దానిపై కూడా విచారణ మొదలైంది.
* పూజా వ్యవహారంపై నిజానిజాలు తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఏక సభ్య కమిటీని నియమించింది. 14 రోజుల్లోగా నివేదిక సిద్ధం చేయనున్నారు.
* ఇప్పటికే పూజా లగ్జరీ కారును పుణె పోలీసులు సీజ్‌ చేశారు.

కేంద్రం సీరియస్.. చర్యలు షురూ..
పూజా ఖేడ్కర్ వ్యవహారంపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆమెపై చర్యలు తీసుకుంది. తక్షణం మహారాష్ట్రలో ఆమెకు జిల్లా శిక్షణను ఆపేస్తూ ఆర్డర్స్ వెలువడ్డాయి. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో రిపోర్టు చేయాల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పూజాకు మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నితిన్‌ గాడ్రే రాసిన లేఖలో సూచించారు. 23వ తేదీలోపు ముస్సోరీ ఐఏఎస్‌ అకాడమీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. అకాడమీ తీసుకునే చర్యలకు రెడీగా ఉండాలని స్పష్టం చేశారు. కాగా, కేంద్రం ఓవైపు చర్యలు తీసుకోబోతున్న విషయం తెలిసినప్పటికీ పూజా ఏ మాత్రం బెరుకు లేకుండా వ్యవహరిస్తోంది. సోమవారం అర్ధరాత్రి కూడా కొందరు మహిళా పోలీసులను ఆమె తన ఇంటికి పిలిపించుకున్నారు. పుణె కలెక్టర్ సుహాస్ దవాసే తనను వేధిస్తున్నారంటూ కంప్లయింట్ చేసేందుకు వారిని పిలిపించుకున్నట్లు వార్తలు వచ్చాయి.

కోట్ల ఆస్తులు దాచిపెట్టి..
పూజా ఖేడ్కర్ తల్లిదండ్రుల తీరు కూడా గతంలో వివాదాస్పదమే. వారికి రూ.కోట్ల ఆస్తులున్న విషయాన్ని పూజా దాచిపెట్టింది. నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ సాధించేందుకు ఇలా బరితెగించిందని ఆరోపణలున్నాయి. పూజ తల్లిదండ్రుల వ్యవహారశైలి పై కూడా గతంలో అనేక వార్తలు వచ్చాయి. పూజా తల్లి మనోరమ గ్రామ సర్పంచిగా ఉంటూ ఒక భూవివాదంలో కొందరిని గన్‌తో బెదిరించారట. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలాగే పుణె లోని మెట్రో రైలు కార్మికులతో వాదులాడుతున్న వీడియో కూడా నెట్టింట వైరల్ మారింది. ప్రస్తుతం పూజా తల్లిదండ్రులు సెల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి పరారీలో ఉన్నారు. క్రిమినల్‌ కేసులో వారిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సివిల్ సర్వెంట్లను నియంత్రించే నియమాలు ఏంటి?
1. భారత రాజ్యాంగం: ఆర్టికల్ 311 సివిల్ సర్వెంట్ల తొలగింపు, తొలగింపు మరియు ర్యాంక్ తగ్గింపుతో వ్యవహరిస్తుంది.
2. ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్, 1951: ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్ల (IAS, IPS మరియు IFoS) రిక్రూట్‌మెంట్, ప్రమోషన్ మరియు క్రమశిక్షణా విషయాలను నియంత్రిస్తుంది.
3. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (కండక్ట్) రూల్స్, 1964: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిని నిర్దేశిస్తుంది.

4. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (వర్గీకరణ, నియంత్రణ మరియు అప్పీల్) నియమాలు, 1965: పోస్ట్‌ల వర్గీకరణ, క్రమశిక్షణా చర్యలు మరియు అప్పీళ్లతో వ్యవహరిస్తుంది.
5. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (కేడర్) రూల్స్, 1954: IAS అధికారుల కేడర్ నిర్వహణను నియంత్రిస్తుంది.
6. ఇండియన్ పోలీస్ సర్వీస్ (కేడర్) రూల్స్, 1954: IPS అధికారుల కేడర్ నిర్వహణను నియంత్రిస్తుంది.

7. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) నోటిఫికేషన్‌లు: పౌర సేవలకు సంబంధించిన వివిధ మార్గదర్శకాలు మరియు సూచనలను జారీ చేస్తుంది.
8. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (స్టాఫ్) నిబంధనలు, 1948: RBI ఉద్యోగులకు వర్తిస్తుంది.
9. రాష్ట్ర-నిర్దిష్ట నియమాలు మరియు నిబంధనలు: ప్రతి రాష్ట్రం పౌర సేవకులను నియంత్రించే దాని స్వంత నియమాలు మరియు నిబంధనలను కలిగి ఉంటుంది.

ఈ నియమాలు ఎలాంటి అంశాలను కవర్ చేస్తాయంటే..
* ప్రవర్తన మరియు క్రమశిక్షణ
* సెలవు మరియు హాజరు
* ప్రమోషన్ మరియు బదిలీ
* చెల్లింపు మరియు భత్యాలు
* పెన్షన్ మరియు గ్రాట్యుటీ
* క్రమశిక్షణా చర్యలు
* అప్పీల్ మరియు సమీక్ష

Note: ఈ నియమాలు సవరణలు మరియు అప్‌డేట్‌లకు లోబడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. తాజా వెర్షన్‌లు మరియు నోటిఫికేషన్‌లను గమనించడం అవసరం.

Read Also: Stress: అధిక ఒత్తిడిని జయించాలంటే ఏం చేయాలి?
Idiot Syndrome: సొంత వైద్యం కోసం ఇంటర్నెట్‌లో వెతుకుతున్నారా? ఇడియట్ సిండ్రోమ్ గురించి తెలుసా?
YouTube: మీ యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్ ఎగిరిపోయిందా? రిక్వెస్ట్ ఇలా పంపండి..!
Tea: భోజనం తినడానికి ముందు, ఆ తర్వాత టీ తాగుతున్నారా?
Chief Ministers: ముఖ్యమంత్రులంటే ఇంద్రభవనాల్లోనే ఉండాలా? సాధారణ జీవితం గడపలేరా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు