HomeAndhra PradeshNTR Bharosa Pension: ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కు ఎలా అప్లయ్ చేయాలి?

NTR Bharosa Pension: ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కు ఎలా అప్లయ్ చేయాలి?

NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద అర్హులైన వారందరికీ వివిధ రకాల పెన్షన్లను ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటికే 65 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు. ఇంకా చాలా మంది అర్హత ఉండి కూడా పెన్షన్ అందుకోలేకపోతున్నారు. అయితే, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు ఎవరు అర్హులు? అర్హతలున్న వారు ఆఫ్ లైన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎక్కడ ఇవ్వాలి? ఆన్ లైన్ లో అయితే ఎలా అప్లయ్ చేసుకోవాలి? ఏయే డాక్యుమెంట్లు అవసరం అవుతాయి? అలాగే ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ ఇస్తారు? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అర్హులు ఎవరంటే..
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లు నిండి ఉండాలి. మిగిలిన వారికి 60 ఏళ్లు నిండి ఉండాలి. దివ్యాంగులు, వితంతువులు, నేత కార్మికులు, తోలు కార్మికులు, చెప్పులు కుట్టేవారు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, హిజ్రాలు (లింగమార్పిడి వ్యక్తులు), హెచ్‌ఐవీ బాధితులు, డ్రమ్మర్లు, చేతివృత్తులవారు అర్హులు.

ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ ఇస్తారంటే..
* వృద్ధులు, వితంతువులు, నేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చేతివృత్తుల వారు, హిజ్రాలు, హెచ్ఐవీ బాధితులు, డప్పు కళాకారులు.. వీరందరికీ రూ.4 వేలు (గతంలో ఇది రూ.3 వేలు ఉండేది)
* దివ్యాంగులకు రూ.6 వేలు (గతంలో రూ.3 వేలు ఉండేది)
* పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి రూ.15,000
* దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి (కిడ్నీ, థలసేమియా మొదలైనవి) రూ.10,000

ఆఫ్ లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలంటే..
* ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి ప్రభుత్వ అధికారిక పోర్టల్‌ https://sspensions.ap.gov.in/SSP/Home/Index కు వెళ్లాలి.
* సదరు పోర్టల్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యోజన అప్లికేషన్ ఫాం సెలెక్ట్ చేసుకోవాలి.
* ఆ ఫారమ్‌నుని ప్రింటు తీసుకుని లబ్ధిదారుడి పూర్తి వివరాలు నింపాలి.
* పేరు, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ లాంటి అన్ని అవసరమైన వివరాలు ఫిల్ చేయాలి.

ఏమేం ఫ్రూఫ్స్ కావాలంటే..
* ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవడానికి అడ్రస్ ఫ్రూఫ్ గా ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో కావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా అవసరం అవుతుంది.
* అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత ఫామ్, పత్రాలను మీ దగ్గర్లోని సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్ కు ఇవ్వాలి.

ఆన్ లైన్ లో ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
* ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు సంబంధించి అధికారిక పోర్టల్ https://sspensions.ap.gov.in/SSP/Home/Index ను సందర్శించాలి.
* స్క్రీన్ రైట్ సైడ్ టాప్ లో ఉన్న లాగిన్ ఎంపికను సెలెక్ట్ చేయాలి.
* క్రెడెన్షియల్స్ ను నమోదు చేయాలి. లబ్ధిదారుల పేరు, పాస్‌వర్డ్‌ను అందించాలి.
* అనంతరం గెట్ ఓటీపీని క్లిక్ చేయాలి. అటుపై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. అది ఎంటర్ చేయాలి.
* తర్వాత వచ్చిన పేజీలో మీ దరఖాస్తును పూర్తి చేయడానికి పోర్టల్‌లోని కొన్ని సలహాలు అనుసరించాలి.

మరిన్ని వివరాల కోసం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ రెండో అంతస్తులో ఉన్న Society for Eradication of Rural Poverty కార్యాలయంలో కాంటాక్ట్ అవ్వొచ్చు.

ఇవీ చదవండి: YSR Pension Kanuka: ఏపీలో రూ.3,000కు పెరిగిన పింఛన్‌.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న జగన్‌ సర్కార్
AP New DGP: ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతల స్వీకరణ
Pensions AP: తొలిరోజు 25.66 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ
CBN vs YS Jagan: తగ్గేదే లేదు.. ఏపీలో హై వోల్టేజ్ రాజకీయం!
Women Food: 30 ఏళ్ల మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు