HomeAndhra PradeshChandrababu Food: చంద్రబాబు బతకడానికి ఏం తింటారో తెలుసా? ఫుడ్ డైట్ ఇదీ..

Chandrababu Food: చంద్రబాబు బతకడానికి ఏం తింటారో తెలుసా? ఫుడ్ డైట్ ఇదీ..

Chandrababu Food: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu Naidu) పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గత ఐదేళ్లూ ఎంతో కష్టపడి పార్టీని, కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చొరవ తీసుకుని బీజేపీని (BJP) సైతం కలుపుకొని వెళ్లారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబు వ్యక్తిగత జీవితం గురించి ఓ ఆసక్తికర విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.

చంద్రబాబు ఇంత వయసు వచ్చినా సరే ఉత్సాహంగా యాక్టివ్ గా పని చేయడానికి కారణం ఆయన తీసుకునే ఆహారమే. ఇంతకీ ఆయన ఏ ఫుడ్ తీసుకుంటారన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. చాలా మంది తిండికి ప్రాధాన్యం ఇస్తుంటారు. భోజన ప్రియులు అనేక మంది ఉంటారు. ఇంత కష్టపడేది కడుపునిండా తినడానికే కదా అన్నట్లు కొందరు చెబుతుంటారు. కానీ బతకడానికి మాత్రమే తాను తింటానంటారు చంద్రబాబు.

చంద్రబాబు ఫుడ్ విషయానికి వస్తే…

ఉదయం:
ఉదయాన్నే టిఫిన్ చేస్తారు. ఏదైనా ఒక ఐటమ్ గానీ, ఇడ్లీ అయితే జొన్న ఇడ్లీ, ఓట్ ఉప్మా, దోశ అయితే ఒకటి లేదా రెండు, అందులోకి లైట్ గా చట్నీ తర్వాత ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకుంటారు.

మధ్యాహ్నం:
రాగి, జొన్న, సజ్జలతో చేసిన పదార్థాలు తీసుకుంటారు. దాంతోపాటు ఒక రెండు లేదా మూడు వెజిటబుల్స్ తీసుకుంటారు. తర్వాత కొద్దిగా పెరుగు తీసుకుంటారు. అలాగే ఒక డ్రై ఫ్రూట్ ను తింటారు.

సాయంత్రం:
6.30 గంటల నుంచి 7 గంటల మధ్య ఏదైనా ఒక సూప్ తీసుకుంటారు చంద్రబాబు. లేదా లైట్ గా ఏదైనా ఒక ఐటమ్ అంటే చిక్కీ లాంటిది స్నాక్ రూపంలో తీసుకుంటారు. దాంతోపాటు ఒక ఉడికించిన ఎగ్ తింటారు. అందులో వైట్ ఎగ్ మాత్రమే చంద్రబాబు తింటారు.

రాత్రి:
రాత్రి పూట ప్రత్యేకంగా చంద్రబాబు ఆహారం ఏమీ తీసుకోరు. నైట్ ఓ గ్లాసు పాలు తాగేసి పండుకుంటారు.

ఇలా రోజువారీ ఫుడ్ తీసుకుంటారు చంద్రబాబు. చాలా సంవత్సరాలుగా ఇదే డైట్ మెంటైన్ చేస్తూ వస్తున్నారట. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పలు కార్యక్రమాలు, పార్టీ పటిష్టత కోసం ఎంత తీరిక లేకుండా గడిపినా ఆయన సతీమణి ఎప్పటికప్పుడు ఫుడ్ విషయంలో టైమింగ్ మెయిన్ టైన్ చేసేవారట. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో కూడా ఫుడ్ మెనూ మాత్రం సమయానికే అందించేలా ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారట.

https://www.facebook.com/reel/1109784793471133

ఇవీ చదవండి: Lok Sabha Elections: 140 లోక్ సభ నియోజకవర్గాల్లో ఓట్లు ఎక్కువ లెక్కించారా?
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభంజనం.. ల్యాండ్‌ స్లైడ్‌ విక్టరీతో చంద్రబాబు హవా
Lavangam: రోజుకో లవంగం తింటే ఏమవుతుందో తెలుసా?
PM Modi: ఈనెల 12న ఏపీకి ప్రధాని మోదీ రాక.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు