HomeTelanganaHyderabad: కక్కుర్తి పడ్డారో ఖతమైపోతరు.. హైదరాబాద్‌లో డేటింగ్ స్కామ్!

Hyderabad: కక్కుర్తి పడ్డారో ఖతమైపోతరు.. హైదరాబాద్‌లో డేటింగ్ స్కామ్!

Hyderabad: డేటింగ్‌ యాప్‌లను తెగ వాడేస్తున్నారా? తెలియని వారితో పరిచయం పేరుతో మోసపోగలరు జాగ్రత్త! ఇందుకు హైదరాబాద్‌ నగరమే వేదిక అవుతోందంటే నమ్మగలరా? యస్.. నగరంలో కొత్తగా డేటింగ్ కుంభకోణం వెలుగు చూసింది. డేటింగ్ యాప్‌ ద్వారా పరిచయం అవుతున్న యువతులు.. యువకులను హైటెక్ సిటీలోని ఓ పబ్‌కి తరలిస్తున్నట్లు తేలింది. అక్కడ ఖరీదైన మద్యం, ఇతర ఆహార పదార్థాలు ఆర్డర్ చేసి యువతులు ఎస్కేప్‌ అవుతున్నారు. ఇప్పటి వరకు 8 మంది బాధితులుగా మారారని తెలుస్తోంది.

టిండర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్‌లలో మ్యాచ్‌ అయిన యువతులు.. వెంటనే వాట్సాప్ ద్వారా కలుద్దామని మెసేజులు చేస్తారు. అబ్బాయిలను మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న పబ్‌లోకి తీసుకెళ్తారు. గంటలో రూ.40 వేల వరకు బిల్లు చేస్తారు. ఆ తర్వాత ఎస్కేప్ అయిపోతారు. ఇక ఈ విషయం పసిగట్టేలోపే బిల్లు చెల్లించాలంటూ పబ్బుల యాజమాన్యం ఒత్తిడి తీసుకొస్తుంది. పబ్‌ నిర్వాహకులు, యువతులు కలిసి ఈ పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తాము కూడా బాధితులమేనంటూ పలువురు యువకులు తాజాగా ముందుకు వస్తున్నారట. అయితే.. దీనిపై ఇప్పటి వరకూ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని తెలుస్తోంది.

ఇవీ చదవండి: Akira nandhan: పవన్‌తో కలిసి అకీరా నందన్ మోదీని కలవడంపై రేణు ఎమోషనల్‌
Chandrababu: దూరదృష్టి కలిగిన ప్రధాని మోదీ: ఎన్డీఏ భేటీలో చంద్రబాబు
Stock Market: కొనసాగిన స్టాక్ మార్కెట్‌ లాభాల జోరు.. సెన్సెక్స్ 1,600 పాయింట్లు లాభం
Dating Apps: మహిళలు డేటింగ్ యాప్స్‌ను ఇలా వాడుతున్నారట..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు