Education: విద్యార్థుల్లో వృత్తి విద్యా కోర్సుపై ఆసక్తి పెంపొందించేలా, ఆలోచనాత్మకంగా, సరళ శైలిలో, ప్రస్తుత కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాలు రూపొందించాలని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు సూచించారు. విజయవాడలో పాఠశాల విద్యా శాఖ- సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో జరుగుతున్న ‘వృత్తి విద్యా కోర్సు పాఠ్యపుస్తకాల రూపకల్పన’ వర్క్ షాపునకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘పిల్లలను బడివైపు మళ్లించే మంత్రం వృత్తి విద్యా కోర్సు’ అని చెప్పారు. ఈ కోర్సులు జీవన నైపుణ్యాలు పెంపొందించడమే కాకుండా విద్యార్థులకు శారీరక, మానసిక అభివృద్ధికి కూడా ఉపయోగపడతాయన్నారు. పాఠశాలల్లో వృత్తి విద్యను బలోపేతం చేయడానికి ఒకేషనల్ ట్రైనర్స్, ఒకేషనల్ కోఆర్డినేటర్లు అంకిత భావంతో పని చేయాలని కోరారు.
వృత్తి విద్యాకోర్సుకు సంబంధించిన మెటీరియల్ , టూల్స్, బుక్స్ ఇప్పటికే పంపడమైందని అన్నారు. ప్రతి విద్యార్థితో నెలకు ఒక ప్రాజెక్ట్ తయారు చేయించి తల్లిదండ్రుల కమిటీ సమావేశాల్లో వారి తల్లిదండ్రులకే బహుమతి ఇచ్చేలా తర్పీదునివ్వమన్నారు. వృత్తి విద్యాపట్ల విద్యార్థులకు స్వతంత్రంగా ఆసక్తి కలిగేలా అవగాహన పరచాలన్నారు.
ఈ సమావేశానికి సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి, జీసీడీవో ఏడీ అబ్దుల్ రవూఫ్ సయ్యద్, సూపరింటెండెంట్ ఎస్.శ్రీనివాసులు, ఒకేషనల్ కోర్సు స్టేట్ కో ఆర్డినేటర్ బి.భారతి, కన్సల్టెంట్ రాజశేఖరరెడ్డి, విషయ నిపుణులు, జిల్లాల నుంచి ఒకేషనల్ కోఆర్డినేటర్లు, ఎస్సీఈఆర్టీ, ఇంటర్మీడియట్ బోర్డు, సాంకేతిక విద్యా విభాగం, పాలిటెక్నిక్ విభాగాల నుంచి లెక్చరర్లు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: Indian Students in US: అగ్రరాజ్యంలో ఉన్న మన విద్యార్థులు 2,69,000 మంది
Vice President: సంస్కృతం విద్య మాత్రమే కాదు.. ఉన్నతికి మార్గం
2024-25 Books: ఈ విద్యా సంవత్సరానికి సరికొత్తగా పాఠ్యపుస్తక ముఖచిత్రాలు
TOEFL Exam: టోఫెల్ పరీక్ష రాసిన 4,53,265 మంది 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు
Electricity supply: మెరుగైన రీతిలో విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలి
Kerala Schools: స్కూలు విద్యార్థులకు నీళ్ల విరామం.. కేరళ సర్కారు వినూత్న ఆలోచన!
