HomeAndhra Pradesh2024-25 Books: ఈ విద్యా సంవత్సరానికి సరికొత్తగా పాఠ్యపుస్తక ముఖచిత్రాలు

2024-25 Books: ఈ విద్యా సంవత్సరానికి సరికొత్తగా పాఠ్యపుస్తక ముఖచిత్రాలు

2024-25 Books: ఈ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు cse.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. 2024-25 విద్యా సంవత్సరానికి 1, 2 తరగతులు మినహా మిగతా అన్ని తరగతుల పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మారనున్నాయని తెలిపింది. ఆయా తరగతుల పుస్తకాల ముఖ చిత్రాలు సులభంగా గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

పాఠ్యాంశాలపై మరింత పట్టు సాధించేలా వేసవి సెలవుల్లో విద్యార్థులను చదివేలా ప్రోత్సహించాలని డీఈవోలకు ప్రవీణ్‌ ప్రకాశ్‌ సూచించారు. ద్విభాషా పాఠ్యపుస్తకాల రూపంలో ఉన్న సైన్స్ మరియు సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకాలను కథలుగా చదవడం ద్వారా సంబంధింత సబ్జెక్ట్ ల పై మరింత అవగాహన పెరగడమేగాక, ఆంగ్ల భాషా నైపుణ్యాలు సైతం మరింత మెరుగుపడతాయన్నారు. కేవలం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కాకుండా, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నానన్నారు.

విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పుల ద్వారా మన విద్యార్ధులను గ్లోబల్ సిటిజన్ గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. మన పిల్లల భవిష్యత్ కోసమే విద్యారంగంలో వినూత్నమైన మార్పులని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి: 100 percent GER: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం జీఈఆర్
TOEFL Exam: టోఫెల్‌ పరీక్ష రాసిన 4,53,265 మంది 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు
Electricity supply: మెరుగైన రీతిలో విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలి
Kerala Schools: స్కూలు విద్యార్థులకు నీళ్ల విరామం.. కేరళ సర్కారు వినూత్న ఆలోచన!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు