HomeAndhra PradeshAB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్.. అవినీతి కేసులో ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్!

AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్.. అవినీతి కేసులో ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్!

AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం షాక్‌ ఇచ్చింది. అవినీతి కేసులో విచారణకు అనుమతి ఇచ్చింది. ఏబీవీ అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం వివరాలు సమర్పించడంతో ఈ నిర్ణయం వెలువరించింది. సమూల పరిశీలన తర్వాత ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతి ఇచ్చింది. త్వరలో అవినీతి కేసులో ఏబీవీ ప్రాసిక్యూషన్ ఉంటుందని తెలుస్తోంది.

టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నప్పుడు, సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో అవినీతి చేశారంటూ ఆయనపై కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి కావడంతో ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతి తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాలు పరిశీలన తర్వాత అవినీతి కేసులో ఏబీవీ ప్రాసిక్యూషన్ కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సమ్మతించింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సిఫార్సు మేరకు హోంశాఖ అనుమతి ఇచ్చింది.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏబీవీ అక్రమాలు చేశారనే ఆరోపణలున్నాయి. నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసు ఉన్నతాధికారి కావడంతో విచారణకు ఏపీ ప్రభుత్వం కేంద్ర హోం శాఖ అనుమతిని కోరింది. ఏపీ ప్రభుత్వ ఫిర్యాదును సెంట్రల్ విజిలెన్స్ క్షుణ్ణంగా పరిశీలించింది. ఏబీవీ తన కొడుకు సంస్థ ద్వారా అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సెంట్రల్ విజిలెన్స్ నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఆకాశం అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ కంపెనీని ఏబీవీ తనయుడు ఏర్పాటు చేశారు. అదే సంస్థ ద్వారా నిఘా పరికరాలు చట్టవిరుద్ధంగా కొనుగోలు చేశారనే అభియోగాలు ఉన్నాయి. 2015 జులై నుంచి 2019 ఏప్రిల్ వరకు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏబీవీ పని చేశారు. చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా పనిచేసిన వ్యక్తిగా ఏబీ వెంకటేశ్వరరావు నిలిచారు.

2017 జూన్ 14న రూ.20 కోట్లతో నిఘా పరికరాల కొనుగోలుకు ప్రతిపాదన కాగా, రూ.25.50 కోట్లతో పరికరాలను ఏబీవీ కొనుగోలు చేయించినట్లు అభియోగాలు ఉన్నాయి. తన కుమారుడి సంస్థకు లబ్ది చేకూర్చేలా నిబంధనలు మార్పు చేశారనే ఆరోపణలున్నాయి. అవినీతి, అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయిన నేపథ్యంలో విచారణకు గత నెల 15న కేంద్ర హోంశాఖకు సీవీసీ సిఫార్సు చేసింది. సీవీసీ సిఫార్సుతో ఏబీవీ విచారణకు కేంద్ర హోంశాఖ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.

ఇవీ చదవండి: YS Jagan in Pithapuram: పిఠాపురంలో సీఎం జగన్ మాస్‌ స్పీచ్.. ఇక్కడ చదవండి
Food safety: ఆంధ్రప్రదేశ్‌లో ఆహార భద్రతకు రూ.80 కోట్లు
Andhra Pradesh Voters: ఆంధ్రప్రదేశ్‌లో మీ సామాజికవర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా?
Child labor: 2025 కల్లా బాలకార్మికులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌
AP High court: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తరలింపుపై కేంద్రం స్పష్టత

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు