YS Jagan in Hindupur: చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా ఇవాళ శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం అంబేద్కర్ సెంటర్‌లో సీఎం జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. బాలకృష్ణ నియోజకవర్గం కావడంతో జనం పెద్ద సంఖ్యలోతరలి వచ్చారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం జగన్ ఏమన్నారంటే…
“హిందూపురం సిద్ధమా? మరో 9 రోజుల్లోఎన్నికల కురుక్షేత్రం జరగబోతుంది. ఈ రోజు జరగబోతున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు కావు. ఇవి రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొండి. జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే… పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడం. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. కొండ చిలువ నోట్లో తలకాయపెట్టినట్లవుతుంది. పొరపాటున మళ్లీ చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేచి.. లకలకా అంటూ మీ దగ్గరకు వస్తుంది.
దేవుడి దయతో మీ చల్లని దీవెనలతో ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో మీ జగన్ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, ఇంతకముందెన్నడూ చూడని విధంగా ఈ 59 నెలల కాలంలో ప్రతి రంగంలోనూ కూడా మీ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. నేను అడుగుతున్నాను. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా మీ జగన్ బటన్లు నొ క్కడం అన్నది గతంలోఎప్పుడైనా జరిగిందా? గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ఈ రాష్ట్ర చరిత్రలో మీ బిడ్డ ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలు ఉంటే.. మీ బిడ్డ కాలంలో ఈ 59 నెలల కాలంలో ఏకంగా 2.31లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. చరిత్రలో ఇది ఎప్పుడైనా జరిగిందా?
రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా మేనిఫెస్టోలో చెప్పిన 99శాతం వాగ్దానాలు అమలు చేయడం ద్వారా ఈ 59 నెలల మీ బిడ్డ పాలన ఈ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని ఘట్టంగా నిల్చిపోయింది. గతంలో ఎప్పుడైనా ఎన్నికల సమయంలో మాత్రమే అబద్దాలు చెబుతూ మేనిపెస్టో ఇస్తారు .ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే కాలం. కానీ ఒక్క మీ బిడ్డ పాలనలో మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్ గా, ఒక ఖురాన్ గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం అమలు చేసి… మళ్లీ ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకుని పోయి ప్రజల ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే.. అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే.
మీ బిడ్డ గడ గడ మచ్చుకు కొన్ని పథకాలు చెపుతున్నాడు. మీరే ఆలోచన చేయండి. ఇవాళ మీ బిడ్డ చెబుతున్నఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా?, ఎప్పుడైనా చూశామా? అన్నది మీరే ఆలోచన చేయండి. మొట్టమొదటిసారిగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా గవర్నమెంటు బడి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తున్నాయి. బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యాకానుక అందుతుంది. బడులల్లో గోరుముద్ద అందుతుంది. పిల్లల చదువులకు అమ్మలను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి, వారి పూర్తి ఫీజులతో ఏ తల్లి,తండ్రీ ఇబ్బందిపడకూడని ఓ జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతదీవెన, అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీదవాళ్లను నిలబెట్టాలని వారికి సున్నావడ్డీ, ఆసరా, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వారి పేరిట గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలు అక్కచెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంతో పాటు 22 లక్షల ఇళ్లు కడుతున్నాం.
గతంలో ఎప్పుడైనా ఈ పథకాలను ఇవ్వడం కానీ, ఈ విధంగా ప్రతి పేదవాడిని ఆదుకోవడం కానీ జరిగిందా? గతంలో ఎప్పుడూ జరగని విధంగా అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేలు పెన్షన్ కానుక ఎప్పుడైనా గతంలో చూశామా? గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడి సాయంగా ఓ రైతుభరోసా, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే ఇన్ పుట్ సబ్సిడీ, పగటిపూటనే రైతన్నలకు పగటిపూటనే ఉచిత విద్యుత్ ఇవన్నీ రైతన్న కోసం వేసిన అడగులు.. గతంలో ఎప్పుడైనా జరిగాయా? ఓ వాహనమిత్ర, నేతన్నలకు నేతన్ననేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, చిరు వ్యాపారులకు, శ్రమజీవులకు ఓ తోడు, ఓ చేదోడు, లాయర్లకు లా నేస్తం ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశామా?
పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం బహుశా దేశచరిత్రలో ఎక్కడా ఉండదేమో? పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఏకంగా రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం. ఆరోగ్యశ్రీ మాత్రమే కాకుండా పేదవాడికి తోడుగా ఆరోగ్యఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్,ఇంటికే ఆరోగ్య సురక్షా ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఏ గ్రామానికి వెళ్లినా గ్రామంలో గ్రామ సచివాలయం అందులో ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడే అందుబాటులో కనిపిస్తాయి.
ప్రతి 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్ధ. మరో నాలుగు అడగులు ముందువేస్తే రైతన్నలను చేయిపట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్ధలు కనిపిస్తాయి. అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఇస్తూ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు ముందుకి వేస్తే నాడునేడుతో బాగుపడ్డ ఇంగ్లిషుమీడియం స్కూల్ కనిపిస్తుంది. అదే గ్రామంలోనే గ్రామానికే చేరిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తుంది. నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. గ్రామంలోనే మహిళా పోలీసు కనిపిస్తోంది. ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్ లోనే దిశ యాప్ కనిపిస్తోంది. ఇటువంటివి అనేకం ఇప్పుడు మీ కళ్లెదుటే కనిపిస్తున్న ఈ విప్లవాలు మీరు ఇంతకముందు ఎప్పుడైనా చూశారా? ఇవన్నీ కూడా కేవలం ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో జరిగినమాట వాస్తవం అవునా ? కాదా?
మరో వంక 75 ఏళ్ల ముసలాయన ఉన్నాడు. 14 ఏళ్లు పాటు 3 సార్లు సీఎం గా చేశానంటాడు. ఇదే చంద్రబాబును మీ సమక్షంలో అడుగుతున్నాను. ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్కటైనా ఆయన చేసిన మంచి ఏదైనా గుర్తుకు వస్తుందా? ఈ పెద్దమనిషి చంద్రబాబు ఎలాంటి వాడో అందరికీ అర్ధం అయ్యేలా నాలుగు మాటలు మీ బిడ్డ చెబుతాడు. పిండి కొద్దీ రొట్టె అనేది ఒక సామెత. దానర్ధం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు. పిండి తగ్గితే రొట్టెలు తగ్గుతాయి. ఇది మనందరికీ తెలిసిన సామెత, నానుడి. కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుది అయితే మాత్రం… ఆ పిండి, ఆ రొట్టె అన్నీ తాను, తనవారు తినేయడమే స్కీంగా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన.
చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి అంటే మీ ఖాతాల్లోకి, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్కరూపాయి అయినా వేశాడా? అదే మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే, వారి చేతికే మీ బిడ్డ ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తుంది. ఎక్కడా లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు. 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ నేరుగా మీబిడ్డ ఈ డబ్బులు పంపించాడు. మరి ఇదే డబ్బు చంద్రబాబు హయంలో ఎవరి జేబుల్లోకి పోయిందని మీరు అందరూ నిలదీయండి? చంద్రబాబుకి ఎంత పోయింది? దత్తపుత్రుడి ఎంతిచ్చారు? ఈనాడుకు ఎంత పోయింది ?ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది? టీవీ5 కి ఎంత పోయింది? వీరి జన్మభూమి కమిటీల జేబుల్లోకి ఎంత పోయిందన్నది ప్రతి ఒక్కరూ చంద్రబాబునాయుడుని నిలదీయండి .
అధికారంలోకి వచ్చేదాకా అబద్దాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు ఎలా ఉండాయి అంటే.. 2014లో ఈ పాంప్లెట్ (టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) చంద్రబాబు నాయుడు మీ ప్రతి ఇంటికి పంపించాడు. గుర్తుందా అన్నా? 2014లో ఇదే ముగ్గురు ఫోటోలతో స్వయంగా చంద్రబాబు నాయుడుగారు సంతకం పెట్టి ఎన్నికల వేళ ముఖ్యమైన హామీలంటూ ప్రతి ఇంటికీ ఈ పాంప్లెట్ పంపించాడు. అంతే కాకుండా అప్పట్లో వారి ఈటీవీ, ఏబీయన్, టీవీ5లోనూ కూడా అడ్వర్జైట్ మెంట్లతో ఊదరగొట్టారు. 2014లో ఎన్నికల వేళ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికీ పంపించాడు. నేను అడుగుతున్నాను. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2014లో ఆయన మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలంటూ పంపించిన పాంప్లెట్ లో ఏ ఒక్కటైనా చేశాడా? లేదా ? అని నేను మిమ్నల్నే అడుగుతున్నాను.
రైతు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా? రెండో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలు, ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా జరిగిందా మాఫీ జరిగిందా? ఈయన చెప్పిన మూడో ముఖ్యమైన హామీ. . ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు.
నేను అడుగుతున్నాను. రూ.25వేలు కథ దేవుడెరుగు కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా రైతు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల రుణాల మాఫీ జరిగిందా? ముఖ్యమైన హామీలు.. రెండోది చదువుతాను. చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా జరిగిందా మాఫీ? ఈయన చెప్పిన హామీలు.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను.. మీ అందరినీ కూడా చంద్రబాబు పరిపాలన చేసిన ఆ 5 సంవత్సరాల్లో మీలో ఏ ఒక్కరిలో అయినా కూడా ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా? దేవుళ్ల పేర్లుతో మహలక్ష్మి పథకం అని పెట్టి దానికీ ఎగనామం పెట్టాడు.
ఇంకా ముందుకు పోతే… ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల, నెలా రూ.2 వేలు నిరుద్యోగభృతి అన్నాడు. 5 సంవత్సరాలు, అంటే 60 నెలలు రూ.2 వేల చొప్పున రూ.1.20 లక్షలు మీ ఇళ్లలో ఏ ఒక్కరికైనా అందిందా? ఇంకా ముందుకు పోతే అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. నేను అడుగుతున్నాను. మూడు సెంట్లు స్ధలం ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా. మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా?
రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? జరిగిందా రైతు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల రుణాల మాఫీ జరిగిందా? ముఖ్యమైన హామీలు.. రెండోది చదువుతాను. చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా జరిగిందా మాఫీ? ఈయన చెప్పిన హామీలు.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను.. మీ అందరినీ కూడా చంద్రబాబు పరిపాలన చేసిన ఆ 5 సంవత్సరాల్లో మీలో ఏ ఒక్కరిలో అయినా కూడా ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా?
ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేలు నిరుద్యోగభృతి అన్నాడు. నెల నెలా ఇస్తానన్నాడు. 5 సంవత్సరాలు, అంటే 60 నెలలు రూ.2 వేల చొప్పున రూ.1.20 లక్షలు మీ ఇళ్లలో ఏ ఒక్కరికైనా అందిందా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. నేను అడుగుతున్నాను. ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా. మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా?
మరో ముఖ్యమైన హామీ.. రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? హిందూపురంలో కనిపిస్తుందా? మరి ఇందులో చెప్పినవి ముఖ్యమైన హామీలంటూ ఏకంగా ఆయన సంతకం పెట్టి… వీళ్ల ముగ్గురు ఫోటోలతో ప్రతి ఇంటికి పంపించిన పాంప్లెట్ లలో ఒక్కటంటే ఒక్కటి జరిగిందా? పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అదీ అమ్మేశాడు. మళ్లీ ఇవాళ ఏమంటున్నారు. ఇలాంటి వారిని నమ్మగలమా? ఇలాంటి వాళ్లంతా మళ్లీ ఏం చేస్తున్నారు.
నేను మీ అందరికీ ఒకటే చెబుతున్నాను. మన బ్రతుకులు మారాలన్నా.. వాలంటీర్లు మరలా ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ మారాలాన్నా.. లంచాలు, వివక్ష లేని వ్యవస్ధ అడుగులు ముందుకు పడాలన్నా.. మన పిల్లల చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మనవ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, ఒక్కటి కూడా తగ్గేందుకు వీల్లేదు. సిద్ధమేనా? అని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: YS Jagan in Palamaneru: 2014లో ఇంటింటికీ పంపిన పాంప్లెట్‌లో ఒక్కటైనా నెరవేర్చారా? పలమనేరులో సీఎం జగన్
YS Jagan in Narasapuram: జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, బాబుకు ఓటేస్తే ముగింపే.. నరసాపురంలో సీఎం జగన్
YS Jagan in Pedakurapadu: ప్రభుత్వ బడులు, పిల్లల చదువులు మారింది ఎప్పుడు? పెదకూరపాడు సభలో సీఎం జగన్
YS Jagan in Kanigiri: పెన్షన్లు అందకుండా చంద్రబాబు దౌర్భాగ్యపు పని చేసి ఆ నెపాన్ని మీ జగన్‌పై నెడుతున్నాడు: కనిగిరిలో సీఎం జగన్
