Jaundice: పచ్చకామెర్లు ఎందుకు వస్తాయన్నది చాలా మందికి సందేహం ఉంటుంది. పచ్చకామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తోందనిక సామెత కూడా ఉంది. ఇప్పుడు పచ్చకామెర్ల వల్ల ఏటా చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికే ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఎంతోమంది పచ్చ కామెర్లతో మృత్యువాతపడ్డారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటి అమన్దీప్ సోహి.. ఈ వ్యాధితో అసువులు బాశారు. సౌత్ డైరెక్టర్ సూర్య కిరణ్ కూడా పచ్చ కామెర్లతోనే మృతి చెందారని ఆయన కుటుంబం ప్రకటించింది. పచ్చకామెర్ల లక్షణాలు ఎలా ఉంటాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
నవజాత శిశువులకు..
లివర్ ఆరోగ్యంగా లేకపోవడం వల్ల పచ్చ కామెర్లు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ముందుగా చర్మం, గోళ్లు, కళ్లతో పాటు ఇతర శరీర భాగాలు ఎల్లో కలర్‌లోకి వస్తాయి. రక్తంలో ఎర్ర రక్తకణాలు చనిపోతూ ఆ స్థానంలోకి బిలిరుబిన్ అనే ఎల్లో పిగ్మెంట్ వచ్చి చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల శరీర భాగాలు పచ్చగా అవ్వడం ప్రారంభం అవుతుంది.
సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలకు పచ్చ కామెర్లు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కానీ పసికందులకు వీటి వల్ల ఎక్కువగా సమస్య ఉండదని సూచిస్తున్నారు. వాటంతట అవే తగ్గిపోతాయని స్పష్టం చేస్తున్నారు. కానీ కొన్ని అరుదైన సందర్భాల్లో అలా జరగదంటున్నారు. 1,000 మంది అప్పుడే పుట్టిన పిల్లల్లో 2.4 శాతం మందికి తల్లిగర్భంలో ఉన్నప్పుడే పచ్చ కామెర్లు దాడి చేస్తాయి. అందులో 187.1 మరణాలు కూడా సంభవిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
తొలి నుంచి పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు మాత్రమే కాకుండా.. ఏ సమస్య లేనివారికి కూడా ఈ పచ్చ కామెర్లు వచ్చే ప్రమాదం ఉందట. ఇది మద్యపానం వల్ల కూడా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ మద్యం అలవాటు ఉన్నవారికి మాత్రమే కాకుండా.. ఉన్నట్టుండి మానేసిన వారికీ పచ్చ కామెర్లు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. పచ్చ కామెర్లు సోకినవారి కళ్లు ఎల్లో కలర్‌లోకి మారుతాయి. మూత్రం కూడా పచ్చగా మారి వాసన వచ్చేస్తుంది. అలాంటప్పుడు వెంటనే బాధితులు వైద్యులను కన్సల్ట్ కావాలి.
ఇలాంటి లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే వారు వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. చాలావరకు కేసుల్లో మందుల వల్ల పచ్చ కామెర్లు తగ్గిపోతాయి. ఆటో ఇమ్యూన్ లివర్ వ్యాధుల్లో ఉపయోగించే మందులను పచ్చ కామెర్ల కోసం ఉపయోగించాలని వైద్యులు చెబుతారు. మందులు ఉపయోగిస్తున్నా కూడా అదే సమయంలో పేషెంట్ ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెబుతున్నారు. ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండడం, జ్యూస్ అధికంగా ఉన్న పండ్లను తినడం, తాగడం చేయాలి. లివర్‌పై ఎక్కువగా ఒత్తిడి లేని ఆహారాలను తీసుకోవాలి. మద్యంపై కంట్రోల్ ఉండాలి. పచ్చ కామెర్లను ఎంత త్వరగా గుర్తిస్తే.. పేషెంట్లకు అంత కోలుకునే అవకాశం ఎక్కువమని నిపుణులు స్పష్టీకరిస్తున్నారు.
ఇవీ చదవండి: Jaundice: పచ్చకామెర్లు ఎందుకు వస్తాయి? నివారణ ఎలా?
Sleep: మనిషికి నిద్ర ఎలా ఉపయోగపడుతుంది? ఆరోగ్యంపై ప్రభావం ఎలా ఉంటుందంటే..
Wax gourd: బూడిద గుమ్మడికాయతో మీ ఆరోగ్యం పదిలం.. ప్రయోజనాలు ఇవీ..!
Sitting on Chair: రోజూ ఎక్కువ సమయం కుర్చీలోనే కూర్చుంటున్నారా? శారీరక ఆరోగ్య ప్రమాదాలు!
Daily Egg: రోజుకో గుడ్డు.. ఆరోగ్యానికి వెరీ గుడ్డు.. ఉడికించిన గుడ్డులో పోషకాలెన్నో తెలుసా?
