HomeInternationalMarriage: మీకు తెలుసా? అక్కడ ప్రతి వ్యక్తీ ఇద్దరిని మనువాడాలట!

Marriage: మీకు తెలుసా? అక్కడ ప్రతి వ్యక్తీ ఇద్దరిని మనువాడాలట!

Marriage: ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో బహుభార్యత్వం, బహు భర్తత్వం ఉంటాయి. అంతెందుకు రెండో పెళ్లి అనివార్యంగా చేసుకోవాల్సిందేనని పురుషులను ఆదేశించే దేశాలు కూడా ఉన్నాయంటే మీరు నమ్ముతారా? కొన్ని దేశాల్లో ఒక పెళ్లి మాత్రమే చేసుకుంటే చట్టరీత్యా నేరమట! ఆ దేశాల్లో పురులందరూ తప్పనిసరిగా ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకోవాల్సిందే.

రెండో భార్యతో మొదటి భార్యకు సమస్య వస్తే.. ఆ ఇద్దరూ జైలుకు పోవాల్సిందేనట. తూర్పు ఆఫ్రికాలోని ఎరిత్రియాలో ఇలాంటి ఆచారమే అమలులో ఉంది. మన దేశంలో రెండో పెళ్లి చేసుకోవటం లేదా రెండో భార్యను కలిగి ఉండటం చట్టం ప్రకారం నేరం అని తెలిసిందే. కానీ ఎరిత్రియాలో అది ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌ అన్నమాట. ఇక్కడ ఒక వ్యక్తి ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోకపోతే, రెండో పెళ్లి చేసుకునేందుకు అంగీకారం తెలపకపోతే కారాగార వాసం తప్పదు. అదికూడా చిన్నా చితక శిక్ష కాదండోయ్.. ఏకంగా జీవిత ఖైదు విధిస్తారట.

కారణం ఏంటంటే..
ఎరిత్రియాలో ఈ తరహా చట్టం అమలులో పెట్టేందుకు ఒక ప్రత్యేక కారణం ఉందట. అక్కడ తరచూ అంతర్యుద్ధాలు సంభవిస్తుంటాయని చరిత్ర చెబుతోంది. అలాంటి యుద్ధ సమయాల్లో ఒంటరిగా ఉన్న మహిళలు ప్రమాదం ఎదుర్కొంటారు. ఇలాంటి సమయాల్లో అలాంటి పరిస్థితుల నుంచి విముక్తి పొందడం మహిళలకు పెద్ద సవాలుగా మారుతోంది.

అందుకే అక్కడి పురుషులు స్త్రీలను రక్షించడానికి రెండు పెళ్లిళ్లు చేసుకోవల్సిందేనని అక్కడ చట్టాలు చేశారు. మరో ఆసక్తికర విషయం ఏమిటో తెలుసా.. ఇక్కడ స్త్రీల కంటే పురుషుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం గమనార్హం. అందుకే మహిళలు ఒంటరిగా తమ జీవితాన్ని గడపలేరని, ప్రతి పురుషుడు ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోవాలని అక్కడి సర్కారు ఆదేశాలు ఇస్తుంది.

ఇలాంటి చట్టాన్ని, పద్ధతుల్ని, ఆచారాలను ఎవరైనా ధిక్కరించినా, తిరస్కరించినా కటకటాల పాలు కావాల్సిందే. అలాగే ఏ మహిళ అయిన తన భర్త రెండో పెళ్లి చేసుకోకుండా నివారించే ప్రయత్నం చేస్తే ఆమెకు కూడా జీవిత ఖైదు తప్పదు. అలా అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇరాక్‌లో కూడా ఈ తరహా ఆచారం అమలులో ఉండటం విశేషం.

ఇవీ చదవండి: Supreme Court: వివాహేతర బంధం నిర్ధారణకు కాల్‌ రికార్డులు తీసుకోవచ్చా? సుప్రీంకోర్టు ఏమందంటే..
Mohammed Shami: షమీపై మాజీ భార్యకు ఎంతకంత పగ.. వివాహేతర సంబంధాలంటూ మళ్లీ తీవ్ర ఆరోపణలు!
Friday Special: శుక్రవారం ప్రత్యేకతలేమిటి? శుక్రుడిని పూజిస్తే ఏం జరుగుతుంది?
Miss World: మిస్‌ వరల్డ్‌ అవ్వాలనుకుంటున్నారా? అర్హతలు ఇవీ..
Aditi Rao Hydari And Siddharth: అదితి రావ్‌ హైదరి, సిద్ధార్థ్.. పెళ్లి చేసుకున్న ప్రేమ పక్షులు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు