టీమిండియా (Team India) పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami)పై ఆయన మాజీ భార్య హసీన్ జహాన్ (Hasin Jahan) మళ్లీ సంచలన ఆరోపణలు గుప్పించింది. మహమ్మద్ షమీ (Mohammed Shami) ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలతో వివాహేతర బంధం పెట్టుకున్నాడంటూ ఆరోపణలు చేసింది. షమీ కట్నం కోసం తరచూ తనను వేధించేవాడని కీలక వ్యాఖ్యలు చేసింది. మహమ్మద్ షమీ (Mohammed Shami) అరెస్ట్ వారెంట్‌పై ఉన్న స్టేను ఎత్తివేయాలంటూ తాజాగా ఆమె కోర్టును కోరింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది జహాన్. మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
అసలేం జరిగిందంటే..
2014లో మహమ్మద్ షమీ, హసీన్‌ల మ్యారేజ్ జరిగింది. వీరిద్దరికీ ఒక కుమార్తె జన్మించింది. అయితే, ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగిపోవడంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే క్రమంలో 2018లో షమీపై హసీన్ గృహహింస, దాడి తదితర అభియోగాలపై కేసు నమోదైంది. అంతేకాదు వరకట్న వేధింపుల ఆరోపణలు కూడా చేసింది హసీన్. ఈ నేపథ్యంలోనే 2019 ఆగస్టులో కోల్‌కతాలోని అలిపోర్ కోర్టు.. షమీపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. అయితే, దీన్ని షమీ సెషన్స్ కోర్టులో సవాల్ చేయగా.. అరెస్టు వారెంట్, క్రిమినల్ విచారణ ప్రక్రియపై స్టే విధిస్తూ 2019 సెప్టెంబర్‌లో సెషన్స్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, హసీన్ ఈ ఏడాది మార్చిలో కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది.
మహమ్మద్ షమీపై అరెస్టు వారెంట్‌పై ఉన్న స్టేను ఎత్తివేయాలని కోరింది. ఈ మేరకు పిటిషన్ వేయగా.. అందుకు కోర్టు నిరాకరించింది. అయితే, అంతటితో హసీన్ వదల్లేదు. ఈ విషయాన్ని అంత తేలికగా వదిలేది లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్లి తేల్చుకుంటానని సవాల్ చేసింది. తాజాగా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. షమీపై కేసు నమోదైందని, ఉద్దేశపూర్వకంగానే నాలుగేళ్లుగా విచారణపై స్టేను కొనసాగిస్తున్నారని ఆరోపణలు చేసింది. షమీ అరెస్టు వారెంట్‌పై ఉన్న స్టేను తక్షణమే ఎత్తివేయాలని న్యాయస్థానాన్ని కోరింది.
భరణం ఇవ్వాలని షమీకి కోర్టు ఆదేశం..
షమీపై గృహహింస కేసు నమోదు చేసిన సందర్భంలో తనకు భరణం కింద నెలకు రూ.10 లక్షలు ఇవ్వాలని హసీన్ కోర్టులో కేసు వేసింది. దీంతో అప్పట్లో షమీ మాజీ వైఫ్ హసీన్ జహాన్‌కు ప్రతి నెలా లక్షా 30 వేల రూపాయలు భరణంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆ మేరకు కోల్‌కతా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో హసీన్ ఖర్చుల కోసం నెలకు 50 వేల రూపాయలు, కుమార్తె ఖర్చులకోసం 80 వేలు ఉపయోగించాలని కోర్టు సూచించింది. అయితే, అప్పట్లోనే దీనిపై షమీ భార్య భిన్నంగా స్పందించింది.. తనకు న్యాయం జరగలేదని పేర్కొంది. తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన షమీ భార్య.. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో పోరాడతానని స్పష్టం చేసింది.
కుమార్తె ప్రస్తుతం హసీన్ వద్దే ఉంటోంది. దీంతో తనకు భరణం రూపంలో ప్రతి నెలా డబ్బు చెల్లించాలని షమీ భార్య కోర్టుకెక్కింది. అప్పటి నుంచి వివాదం కొలిక్కి రాలేదు. కోర్టు నిర్ణయంతోనూ ఈ వ్యవహారం తేలలేదు. తనకు ఇంకా న్యాయం జరగాల్సి ఉందని, ఈ మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం. ఇంతకీ షమీపై ఎందుకంత పగ అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. షమీ నిజంగానే ఆమెను వేధించాడా? కట్నం కోసం టార్చర్ పెట్టాడా అనేది తెలియాల్సిన అంశం. లేకపోతే షమీ క్రికెటర్‌లో మంచి పేరు గడిస్తున్నాడని, సెలబ్రిటీ అనే హోదాను దక్కకుండా చేసి ఉన్నదంతా తనకే దక్కించుకోవాలని హసీన్ ఇలా కుట్రపూరితంగా వ్యవహరిస్తోందా? అనేది తెలియాల్సి ఉంది.
Read Also : Virat Kohli : డోంట్ మెస్ విత్ కింగ్ కోహ్లీ.. ఎవరిది వాళ్లకిచ్చేయడం విరాట్ స్పెషల్!