HomeAndhra PradeshPostal Ballot AP: సెంట్రల్ ఎక్స్‌ఛేంజ్‌ ద్వారా 80,111 ఫాం-12 మార్పిడి

Postal Ballot AP: సెంట్రల్ ఎక్స్‌ఛేంజ్‌ ద్వారా 80,111 ఫాం-12 మార్పిడి

Postal Ballot AP: పోస్టల్ బ్యాలెట్ సెంట్రల్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో 80,111 ఫారం -12 లు, 10,123 ఫారం-12డి లు మార్పిడి చేసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల విధుల్లో ఉన్న రెగ్యులర్ (ఫారం -12) మరియు అత్యవసర సేవల (ఫారం -12డి) ఉద్యోగులకు పనిచేసే జిల్లా లోనే పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో సచివాలయంలో పోస్టల్ బ్యాలెట్ల తొలి ఎక్స్చేంజి కార్యక్రమం జరిగింది.

అదనపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఏం.ఎన్.హరింద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెంట్రల్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో 26 జిల్లాలకు చెందిన పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులు పాల్గొన్నారు. 26 జిల్లాలకు చెందిన పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్లు వారి జిల్లాలో సేకరించిన ఫారం -12 లు, ఫారం-12డి లతో హాజరయ్యారు. ఏ ఏ జిల్లాలకు చెందిన పోస్టల్ బ్యాలెట్ లను ఆయా జిల్లాల పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులకు అందజేసుకున్నారు.

ఈ ఎక్సేంజ్ కార్యక్రమంలో అందిన దరఖాస్తులకు అనుగుణంగా ఆయా జిల్లాల పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులు ఖాళీ పోస్టల్ బ్యాలెట్ లతో మే 3 వ తారీఖున తిరిగి ఈ సెంట్రల్ ఎక్స్చేంజ్ కార్యక్రమానికి హాజరై ఏ జిల్లాలకు చెందిన పోస్టల్ బ్యాలెట్ లను ఆ జిల్లాల పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులకు అందజేస్తారు. ఈ విధంగా అందిన ఖాళీ పోస్టల్ బ్యాలెట్ లను సంబధిత ఉద్యోగులకు అందజేసి, ఆయా ఉద్యోగులు ఓటు వేసిన తదుపరి మళ్లీ ఆ పోస్టల్ బ్యాలెట్ లను మే 10 వ తేదీన తిరిగి ఈ సెంట్రల్ ఎక్సైజ్ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాలకు పంపించడం జరుగుతుంది.

తొలిసారిగా జరిగిన ఈ సెంట్రల్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో ఫారం – 12 లకు సంబంధించి అత్యధిక మొత్తంలో విశాఖపట్నం జిల్లా నుండి 5,625 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా 969 దరఖాస్తులు అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి వచ్చాయి. ఫారం -12 డి లకు సంబంధించి అత్యధిక మొత్తంలో 999 దరఖాస్తులు పల్నాడు జిల్లా నుండి రాగా, అత్యల్పంగా 25 దరఖాస్తులు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాయి.

ఇవీ చదవండి: SAMARTH APP: క్విక్‌ పోలీసింగ్‌ కోసం సమర్థ్‌ మొబైల్ యాప్‌ తీసుకొచ్చిన ఈసీ
EC Serious: పేరులేని రాజకీయ హోర్డింగ్‌లపై ఈసీఐ కొరడా
ECI: ఓటర్లకు అవగాహన పెంచేలా ఈసీఐ ప్రత్యేక చర్యలు ఇవీ..
CEC: ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయకూడదు: ఈసీ కీలక సూచనలు
CEC Press Meet: జూన్ 16తో ముగియనున్న లోక్‌సభ గడువు.. ఈలోగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి: ఈసీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు