Botcha Satyanarayana: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలతో వైఎస్సార్ సీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమోషనల్ అయ్యారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈరోజు సీఎం జగన్ విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పర్యటించారు. వేలాది మంది ప్రజలు జగన్‌ను చూసేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా విశాఖలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన సీఎం జగన్.. అనంతరం బస్సు యాత్ర కొనసాగించారు.
విజయనగరం జిల్లాకు చేరుకోగానే అక్కడ చెల్లూరు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అభ్యర్థులను పరిచయం చేశారు. బస్సు యాత్రలో పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఒక ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలను పరిచయం చేస్తూ వస్తున్నారు సీఎం జగన్. అలాగే ఇవాళ కూడా విజయనగరం జిల్లాకు సంబంధించిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఓటర్లకు పరిచయం చేసే క్రమంలో ఆసక్తికర సంఘటన జరిగింది.
విజయనగరం ఎంపీగా చంద్రశేఖర్ అన్నను పరిచయం చేస్తున్నాను.. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడు. చంద్రశేఖర్ అన్నను గొప్ప మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరితో సవినయంగా ప్రార్థిస్తున్నాను.. అని సీఎం జగన్ అన్నారు. ఆ తర్వాత విజయనగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్రస్వామి అన్నను పరిచయం చేస్తున్నాను.. సౌమ్యుడు, మనసు మాత్రం వెన్న. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాను. అని కోరారు.
అనంతరం బొబ్బిలి నుంచి చిన్న అప్పలనాయుడును, నెల్లిమర్ల నుంచి అప్పలనాయుడును, రాజాం నుంచి రాజేష్ ను పరిచయం చేశారు. అనంతరం గజపతినగరం నుంచి అప్పలనర్సయ్యను పరిచయం చేశారు. ఎచ్చెర్ల నుంచి కిరణ్ ను పరిచయం చేశారు. ఇక చీపురుపల్లి విషయానికి వచ్చే సరికి.. సీనియర్ మంత్రి బొత్స జగన్ దగ్గరకు వచ్చారు.
చీపురుపల్లి నుంచి నాకు తండ్రిలాంటి వాడు.. కానీ అన్న అంటుంటాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు. గొప్ప మెజార్టీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందర్నీ కూడా కోరుతున్నాను… అని సీఎం జగన్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స భావోద్వేగానికి గురయ్యారు.
సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంతటి బాండింగ్ లేదని, జగన్‌ను తన కుమారుడితో సమానంగా చూస్తూ వస్తున్నారని, సీఎం జగన్ సైతం తండ్రి సమానుడిగా బొత్సను గౌరవిస్తూ వస్తున్నారని ఈ సంఘటన రుజువు చేస్తోంది. అనంతరం బొత్స సోషల్ మీడియా వేదికగా.. ఈ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు. జననేతను మరోసారి ముఖ్యమంత్రి చేసుకునేందుకు విజయనగరం జిల్లా సిద్ధం.. అంటూ ట్వీట్ చేశారు మంత్రి బొత్స.
https://x.com/YSRCParty/status/1782818466526855182
ఇవీ చదవండి: YS Jagan in Vizianagaram: డ్రీమ్స్ మీవి, స్కీమ్స్ మీ జగన్‌వి.. విజయనగరం సభలో సీఎం జగన్
YS Jagan with YSRCP Social Media: వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా సైనికులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!
Kancha Ilaiah: ఏపీలో చదువుల విప్లవం మరో ఐదేళ్లు కొనసాగాలి.. జగన్ రాజకీయాలను మార్చేశారు: కంచ ఐలయ్య
