చాలా మంది ఇతరుల వస్తువులను (Others Things) అప్పుడప్పుడూ వాడేస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరులకు ఇవ్వకూడని వస్తువులు కూడా ఉన్నాయి. అలాగే ఇతరుల నుంచి మనం తీసుకోనివి కూడా ఉన్నాయి. అలా ఇతరులు వాడిన వస్తువులను (Others Things) మనం వాడితే అనర్థాలు చాలా ఉన్నాయట. వాస్తు శాస్త్ర టిప్స్ ప్రకారం కొన్ని టిప్స్ పాటిస్తే మీ జీవితం ఆనందమయం అవుతుంది.
1. వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరుల నుంచి వాడకూడని వస్తువులు చాలా ఉన్నాయి.
2. ఇతరులు వాడిన బట్టలు ఎప్పుడూ మనం తీసుకోరాదు.
3. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూడా కొందరు తమ బట్టలు షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
4. ఇతరుల దుస్తులు మనం వేసుకోవడం వల్ల అనేక అనర్థాలు వస్తాయి.
5. ఇందులో సైన్స్ కూడా ఉంది. ఇతరుల శరీరంలోని వ్యాధులు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి అనేక రోగాలకు కారణమవుతాయి.
6. ఇక ఇతరుల ఉంగరాలు కూడా మనం వాడరాదు.
7. అది బంగారం, వెండి, రత్నం, లోహం.. ఇలా ఏ ఉంగరమూ ఇతరులది మనం వాడరాదు.
8. ఇలా చేయడం ఏ పరిస్థితుల్లోనూ మంచిది కాదు. ఇలా ధరించడం వల్ల ఆ వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం పడుతుందట.
9. ఇతరుల పెన్నులు లేదా పెన్సిళ్లు కూడా వాడకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
10. ఇతరుల పెన్నులు, పెన్సిళ్లు తీసుకోవడం వల్ల మీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు అధికమవుతాయని చెబుతున్నారు.
11. అందుకే ఒక వేళ విధి లేని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తే వీలైనంత త్వరగా వాటిని వారికే అందజేయాలి.
12. అలాగే ఇతరుల వాచీలు కూడా మనం ధరించరాదట.
13. వీటితోపాటు ఇతరుల బూట్లు, చెప్పులు మనం వేసుకోరాదు.
14. ఇలా చేస్తే వారి శని మనకు పట్టుకుంటుందని చెబుతారు.
Also Read : Bedroom Vastu: పడక గదిలో ఎలాంటి వాస్తు ఉండాలి?