HomeAndhra PradeshTOEFL Exam: టోఫెల్‌ పరీక్ష రాసిన 4,53,265 మంది 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు

TOEFL Exam: టోఫెల్‌ పరీక్ష రాసిన 4,53,265 మంది 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు

TOEFL Exam: రాష్ట్రంలో మూడో తరగతి నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా టోఫెల్ పరీక్ష విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ బుధవారం వెల్లడించారు. 13,104 పాఠశాలల్లో 4,53,265 మంది విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. ప్రధానంగా గ్రామీణ, మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరవడం ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు.

అదే విధంగా 5,907 పాఠశాలల్లో 6-9 తరగతులు చదువుతున్న 16,52,142 మంది విద్యార్థులకు ఏప్రిల్ 12 (శుక్రవారం)వ తేదీన టోఫెల్ జూనియర్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టోఫెల్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రిన్స్ టన్ లోని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్(ఈటీఎస్) నుండి టోఫెల్ సర్టిఫికేట్ అందిస్తామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా టోఫెల్ పరీక్షకు హాజరైన విద్యార్థులు మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుండే స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం దొరకడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. టోఫెల్ పరీక్షలు రాయడం గొప్ప అనుభూతిని కలగజేసిందన్నారు. టోఫెల్ సర్టిఫికేట్ అందుకునేందుకు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నామన్నారు.

ఇవీ చదవండి: Kerala Schools: స్కూలు విద్యార్థులకు నీళ్ల విరామం.. కేరళ సర్కారు వినూత్న ఆలోచన!
Water Bell: పాఠశాలల పునః ప్రారంభం తర్వాత కూడా “వాటర్ బెల్”!
100 percent GER: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం జీఈఆర్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు