HomeNationalRahul Gandhi: మా మేనిఫెస్టో ప్రజల హృదయాల నుంచి పుట్టింది: తుక్కుగూడ సభలో రాహుల్‌ గాంధీ

Rahul Gandhi: మా మేనిఫెస్టో ప్రజల హృదయాల నుంచి పుట్టింది: తుక్కుగూడ సభలో రాహుల్‌ గాంధీ

Rahul Gandhi: కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో దేశ ప్రజల హృదయాల నుంచి పుట్టిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణలోని తుక్కుగూడలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఇందులో రాహుల్‌ గాంధీ చీఫ్‌ గెస్ట్‌గా వచ్చి ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ మేనిఫెస్టోను రాహుల్‌ రిలీజ్‌ చేశారు. న్యాయ పత్రం పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు చేశామని రాహుల్‌ చెప్పారు. రాహుల్‌ గాంధీ ఇంకా ఏమన్నారంటే..

“తెలంగాణలో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో కాదు…దేశ ప్రజల గుండెచప్పుడు. దేశంలో నిరుద్యోగం తీవ్రంగా ఉంది. తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. జాతీయ మేనిఫెస్టోలో 5 గ్యారంటీలు ఉన్నాయి. ప్రజల హృదయాల నుంచి పుట్టిందే మా మేనిఫెస్టో. మోదీ బడాబాబులకు రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు.

9 ఏళ్ల క్రితం ఇక్కడే మా గ్యారంటీలు ఆవిష్కరించాం. పార్లమెంటు ఎన్నికలకు హామీలు ఇక్కడే ఆవిష్కరణ. అమలు చేయగలిగిన గ్యారంటీలనే ఇచ్చాం. రూ.500 గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, మహిళలకు ఉచిత బస్సు గ్యారంటీలు ఇచ్చాం. దేశంలో నిరుద్యోగులందరికీ రూ.లక్ష జీతం వచ్చేలా ఉపాధి. గ్యారంటీలు అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం.

విద్యావంతులైన యువతకు ఏడాదిపాటు నెలకు రూ.8,500. యువతకు నెలకు రూ.8,500తో ఏడాదిపాటు శిక్షణ. మహిళలకు ఏటా రూ. లక్ష ఇస్తాం. మహిళలకు ఏటా రూ.లక్ష విప్లవాత్మక పథకం. మహిళలకు నేరుగా బ్యాంకులో వేస్తాం. ఇకపై దేశంలో ఏ కుటుంబానికీ ఏటా రూ.లక్ష ఆదాయం కంటే తక్కువ ఉండదు. మోదీ ప్రభుత్వం ధనవంతులకే రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేసింది.

రైతులకు ఒక్క రూపాయి కూడా మోదీ ప్రభుత్వం మాఫీ చేయలేదు. స్వామినాథన్ సిఫారసులను అనుసరించి పంటలకు మద్దతు ధర. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం. జాతీయ స్థాయిలో కనీస వేతనం రూ.400కు పెంపు. ఉపాధి హామీ కూలీలకు వేతనం పెంపు. దేశంలో 50 శాతం జనాభా బీసీలున్నారు. 8 శాతం ఎస్టీలు, 15 శాతం మైనార్టీలున్నారు. దేశంలో 90 శాతం పేదలే ఉన్నారు. దేశంలోని 90 మంది ఐఏఎస్ అధికారుల్లో ముగ్గురే బీసీలు. జనాభాలో ఓబీసీలు 50 శాతం….ఐఏఎస్ లలో ఓబీసీల వాటా 3 శాతమే.” అని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: Congress Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. హైలైట్స్ ఇవీ..
PM Modi at Chilakaluripeta: ప్రధాని మోదీ సుతిమెత్తని విమర్శలు.. ఏపీలో జగన్‌ పార్టీ, కాంగ్రెస్‌ వేర్వేరు కాదని కామెంట్స్‌
Congress Guarantees: మహిళా న్యాయ గ్యారంటీ కింద కాంగ్రెస్‌ 5 హామీలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు