Vizianagaram TDP: ఏపీలో కూటమిగా ఏర్పడ్డ టీడీపీ, బీజేపీ, జనసేనలో కుమ్ములాటలు, అసంతృప్త జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. దాదాపు 30-40 సీట్లలో కూటమి పరిస్థితి గందరగోళంగా ఏర్పడింది. అధికారికంగా ప్రకటించిన లిస్టులో ఎమ్మెల్యే, ఎంపీ కేండేట్లకు అసమ్మతి వర్గాలు సహకరించడం లేదు. పిఠాపురం, అనంతపురంలో అయితే టీడీపీ శ్రేణులు తీవ్రంగా భగ్గుమన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మలు, ఫొటోలు, పార్టీ కార్యాలయాల్లో ఫర్నిచర్స్, జెండాలు, ఇతర సామాగ్రిని నేతల అనుచరులు తగులబెట్టారు. తాజాగా విజయనగరం జిల్లాలో టీడీపీ ఎంపీ అభ్యర్థికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. Vizianagaram TDP
విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడును చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఒక్కొక్కరినీ కలుపుకొని వెళ్లి విజయానికి కృషి చేయాలని కోరుతున్నారు. అయితే, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు ఆయనకు ఝలక్ ఇచ్చారు. విజయనగరం ఎంపీ స్థానం టీడీపీ అభ్యర్ధికి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు షాక్ ఇచ్చారు.
ఇందులో భాగంగా కలిశెట్టి అప్పలనాయుడు పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా ఎమ్మెల్యే అభ్యర్థులను కోరారు. ఈ నేఫథ్యంలోనే పరిచయ కార్యక్రమానికి 5గురు ఎమ్మెల్యే అభ్యర్థులు డుమ్మా కొట్టారు. ఇంటింటికీ వెళ్లి పిలిచినా ఆయా అభ్యర్థులు మొహం చాటేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
పరిచయ కార్యక్రమానికి డుమ్మా కొట్టిన వారిలో కిమిడి కళావెంకటరావు, కోండ్రుమురళీ మోహన్, ఎన్.ఈశ్వరరావు, కొండపల్లి శ్రీనివాసరావు, బేబినాయిన ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం కలిశెట్టి అప్పలనాయుడును ప్రకటించడంపై మొదటి నుంచే నిరసన వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు ఈయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కూటమి టికెట్లపై సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నిర్ణయాలు తెలుగుదేశం పార్టీని సర్వ నాశనం చేస్తున్నాయంటూ అశోక్ గజపతిరాజు ఆఫ్ ద రికార్డ్‌లోర్డ్ తీవ్రంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించారట. పార్టీ కోరుకుంటే ఉచిత సలహాలు ఇస్తుంటానంటూ అశోక్ గజపతిరాజు సెటైర్లు వేశారని తెలుస్తోంది.
ఇవీ చదవండి: Dwakra Bazar: విజయనగరంలో అఖిల భారత డ్వాక్రా బజార్
AP BJP News: ఏపీ బీజేపీలో టీడీపీ ముద్ర.. కేండేట్ల ఎంపికలో అన్యాయంపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదుల వెల్లువ!
YS Jagan vs All: పిక్చర్ క్లియర్.. ఒక్క జగన్ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్..!
