PM Modi at Chilakaluripeta: చిలకలూరిపేట కూటమి బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై మోదీ ఎలా రియాక్ట్ అవుతారని చాలా మంది ఆసక్తి కనబరిచారు. తీరా ప్రధాని ప్రసంగంలో రెండు మూడు ఆరోపణలు తప్ప.. జగన్‌పై హాట్ కామెంట్స్ ఏవీ చేయకపోవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రతిపక్షనేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం జగన్‌పై తమకున్న పగ అంతా ప్రసంగాల్లో వెళ్లగక్కారు. ప్రధాని ఏం మాట్లాడారంటే..
చిలకలూరిపేట సభలో ప్రధాని తెలుగులో ప్రసంగం మొదలు పెట్టారు. ఆంధ్ర కుటుంబ సభ్యులకు నమస్కారాలు అంటూ మోదీ ప్రసంగం స్టార్ట్ చేశారు. అయితే, పవన్ కల్యాణ్, చంద్రబాబు ప్రసంగాల సందర్భంగా పలుమార్లు మైకు మొరాయించింది. ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనూ ఇదే పరిస్థితి దాదాపు మూడునాలుగు సార్లు ఆడియో సిస్టమ్ మొరాయించింది.
ప్రధాని మాట్లాడుతూ..
నిన్ననే దేశంలో ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ఇది నా తొలి సభ. ఎన్డీయే కూటమి 400 కి పైగా స్థానాలు గెలవాలి. ఇక్కడే కోటప్ప కొండపై ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం మనకు ఉంది. మరోసారి మనం అధికారంలోకి రాబోతున్నాం. ఏపీ అభివృద్ధి చెందాలంటే ఎన్డీయే కూటమికి 400కి పైగా స్థానాలు రావాలి. జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఎన్డీయే కూటమిదే గెలుపు.
చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఏపీ వికాసానికి కృషి చేశారు. ఎన్డీయే కూటమి బలం పెరుగుతోంది. ఏపీలో ఎన్డీయే డబుల్ ఇంజిన్ సర్కార్ ఆవశ్యకత ఉంది. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి ఎన్డీయే సమన్వయం చేస్తుంది. దేశంలోని ఎన్డీయే ప్రభుత్వం పేదల గురించి ఆలోచిస్తుంది. మా పదేళ్ల పాలనతో పేదరికం తగ్గింది. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారు.
వికసిత భారత్ తోపాటు వికసిత ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం. మా పదేళ్ల పాలనతో పేదరికం తగ్గింది. ఏపీ అభివృద్ధి కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారు. పేదల అభివృద్ధితోపాటు ఏపీ అభివృద్ధి మా లక్ష్యం. ఏపీని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తా. ఇది మోదీ గ్యారంటీ.
ఏపీ ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది. మా హయాంలో ఏపీ ఎడ్యుకేషన్ హబ్ గా మారింది. అనేక జాతీయ విద్యాసంస్థలను ఏపీకి తీసుకొచ్చాం. ఎన్డీఏలో అన్ని పార్టీలను కలుపుకుని ముందుకెళతాం. కాంగ్రెస్ మాత్రం మిత్ర పక్షాలను వాడుకుని వదిలేస్తుంది. ఇండియా కూటమిలో ఎవరికి వారే అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందే విభేదాలు బయటపడ్డాయి. ఎన్నికల తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆలోచించండి ఎన్టీఆర్ రాముడి పాత్రలో జీవించారు.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేళ ఆ దృశ్యమే గుర్తొచ్చింది. పేదలు, రైతుల కోసం ఎన్టీఆర్ పోరాడారు. ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల వేళ ఆయన స్మారక నాణెం విడుదల చేశాం. తెలుగు బిడ్డ పీవీకి భారత రత్న ఇచ్చి గౌరవించాం. అప్పట్లో కాంగ్రెస్ ఎన్టీఆర్ ను ఎంతగానో ఇబ్బంది పెట్టింది.
ఏపీకి 10 లక్షల ఇళ్లు ఇచ్చాం. ఎన్డీఏ పున:కలయిక 5 కోట్ల ప్రజలకు ఆనందాన్ని ఇచ్చింది. ఏపీ ప్రజలు ఈ ఎన్నికల్లో రెండు సంకల్పాలతో ముందుకు వెళ్లాలి. ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే. ఒకే కుటుంబానికి చెందిన వారు నడిపిస్తున్నారు.
ఏపీ ప్రజలు ఈ ఎన్నికల్లో రెండు సంకల్పాలు తీసుకోవాలి. ఢిల్లీలో, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలను అధికారంలోకి తేవాలి. అవినీతి విషయంలో ఏపీ మంత్రులు పోటీ పడుతున్నారు. ప్రభుత్వ అవినీతి వల్లే ఐదేళ్లుగా ఏపీ అభివృద్ధి చెందలేదు. అవినీతి ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు పెకలించాలి. రాబోయే ఐదేళ్లు ఏపీ అభివృద్ధికి ఎంతో కీలకం. ఏపీలో ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ను అభివృద్ధి చేస్తాం. ఓట్లు చీలకుండా ఎన్డీఏను గెలిపించాలి. అని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: Kalki 2898AD: ప్రభాస్ కల్కి వాయిదా? మే 13న ఎన్నికల నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
CM Jagan Ready to Elections: ఎన్నికల సమరానికి సీఎం జగన్ సిద్ధం.. 18 నుంచి ప్రచార సమర భేరి!
YS Jagan vs All: పిక్చర్ క్లియర్.. ఒక్క జగన్ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్..!
