CBN Comments on Modi: కూటమి కలయికతో ఏపీలో కొత్త రాజకీయం కనిపిస్తోంది. శత్రువులు అనుకున్న వారు కలిసిపోయారు. తిట్టిపోసుకున్న నోటితోనే పొగడ్తల వర్షి కురిపిస్తున్నారు. ఇందుకు ఏమాత్రం సందేహించడం లేదు. భేషజాలు మరిచి.. గతంలో ఏ నోటితో అయితే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారో ఆ స్థానంలో ఊహకు కూడా అందనన్ని పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇదంతా చేస్తున్నది గల్లీ స్థాయి లీడర్లు కాదు.. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణే. చిలకలూరిపేట సభలో ఇది చూసిన ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
భార్యనే చూసుకోలేని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు?, కుటుంబాన్నే చూసుకోని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు.. అంటూ చంద్రబాబు గతంలో తీవ్ర పదజాలంతో దూషించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగానూ మోదీపై అనేక విమర్శలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం తన అవసరాలు, స్వార్థం, అధికారం కోసం మోదీపై పొగడ్తల వర్షం కురిపించడం గమనార్హం.
ప్రజాగళంలో చంద్రబాబు ఏమన్నారో చూడండి..
* వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏదే. ఎవరికీ అనుమానం లేదు
* మోదీకి అండగా ఉంటామని చెప్పేందుకే మీరంతా తరలివచ్చారు
* ప్రగతివాది… మోదీకి స్వాగతం… సుస్వాగతం..
* మోదీ ఒక వ్యక్తి కాదు… భారత్ ను విశ్వగురుగా మారుస్తున్న శక్తి
* మోదీ అంటే భవిష్యత్తు… మోదీ అంటే ఆత్మవిశ్వాసం
* సంక్షేమ పథకాలకు కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి… మోదీ : చంద్రబాబు
* మన కూటమికి మోదీ అండ ఉంది
* ఏపీలో గెలుపు ఎన్డీఏదే
* 5 కోట్ల ఏపీ ప్రజల తరపున ప్రధాని మోదీకి స్వాగతం
* ప్రపంచం మెచ్చిన నేత మోదీ
* మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, గతి శక్తితో దేశాన్ని అభివృద్ధి చేశారు
* వంద దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత మోదీదే
* మోదీ నాయకత్వంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారుతుంది
* సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో దేశ ప్రజలకు సేవ చేశారు
* మోదీ ఒక వ్యక్తి కాదు.. దేశాన్ని విశ్వగురుగా మారుస్తున్న ఒక శక్తి
* మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి
* జెండాలు వైరైనా, మా అజెండాలు ఒక్కటే
* మోదీ చేతులమీదుగా అమరావతికి శంకుస్థాపన జరిగింది
* అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి… మోదీ
* సబ్ కా సాథ్… సబ్ కా వికాస్… సబ్ కా విశ్వాస్… మోదీ నినాదాలు
* పేదరికం లేని దేశం అనేది మోదీ కల
* మోదీ ఆశయాలతో మనమంతా అనుసంధానం కావాలి
* సరైన సమయంలో దేశానికి మోదీ లాంటి నేత వచ్చారు
* ప్రపంచంలో భారత్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.. మోదీ
* భారత్ ను శక్తిమంతమైన జాతిగా తయారు చేయడమే మోదీ లక్ష్యం
* ఎన్డీఏకు 400కు పైగా లోక్ సభ స్థానాలు వస్తాయి….
ఇవీ చంద్రబాబు కామెంట్స్. అధికారం కోసం తిట్టిన నోటితోనే పొగడ్తల వర్షం కురిపించడం ఒక్క చంద్రబాబుకే చెల్లిందంటూ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవీ చదవండి:PM Modi at Chilakaluripeta: ప్రధాని మోదీ సుతిమెత్తని విమర్శలు.. ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ వేర్వేరు కాదని కామెంట్స్
YS Jagan fires on Chandrababu: ఇచ్చేది లేదు.. సచ్చేది లేదు.. చంద్రబాబుపై సీఎం జగన్ పంచ్‌లు..
Chandrababu Alliance: ఎన్నికల్లో పొత్తులేకుండా పోటీకి ఊహించలేని చంద్రబాబు.. తిట్టిన నోటితోనే పొగుడుతూ.. కడాన అలా ముందుకెళ్తూ..
