HomeAndhra PradeshONGC help: ఓఎన్జీసీ పైప్ లైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు పరిహారం చెల్లింపు

ONGC help: ఓఎన్జీసీ పైప్ లైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు పరిహారం చెల్లింపు

ONGC help: ఓఎన్జీసీ పైపులైను పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ఐదో విడతగా రూ.161.86 కోట్లు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి సీఎం జగన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. (ONGC help) ఆయనేమన్నారంటే..

* దేవుని దయ వల్ల ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది.
* కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా.. ఈ రెండు జిల్లాల్లో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు ఈరోజు మంచి జరిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఓఎన్జీసీ కూడా మంచి మనసుతో కారణాలు, సాకులు చూపకుండా ప్రొయాక్టివ్ గా కలిసి వచ్చి భాగస్వాములయ్యారు.

* 5వ విడతగా ఈరోజు ఈసాయాన్ని అందిస్తున్నాం.
* ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి నెలకు రూ.11500 చొప్పున ప్రతి ఆరు నెలలకోసారి ఎక్కడా ఆలస్యం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటూ ఆ కుటుంబాలకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తూ వస్తున్నాం.

* ఇందులో మరీముఖ్యంగా మీకు మంచి ఎమ్మెల్యే సతీష్ ఉన్నాడు. సతీష్ ను నిజంగా అప్రిషియేట్ చేయాలి.
* మామీద కూడా సతీష్ ప్రజర్ పెడుతూ వస్తున్నాడు కాబట్టి కలెక్టర్లు కూడా ఆటోమేటికలీ ప్రొయాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యి వారు కూడా అడుగులు వేగంగా ముందుకు వేయిస్తున్నాడు.

* సతీష్ నాకు బాగా కావాల్సిన వాడు కాబట్టి అధికార యంత్రాంగాన్ని కూడా ఆ దిశగా అడుగులు వేయించాం.
* ఈసారి 5వ విడతగా రూ.161.86 కోట్లు 23458 మంది మత్స్యకార కుటుంబాలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా వారి ఖాతాల్లోకి ఈ డబ్బు జమ అయ్యేలా బటన్ నొక్కబోతున్నాం.

* ఇప్పటి వరకు రూ.647 కోట్లు ఈ 5విడతల్లో కలిపి ఇచ్చినట్లవుతోంది.
* అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 16408 కుటుంబాలు, కాకినాడ జిల్లాలో మరో 7050 కుటుంబాలు.. ఉపాధి కోల్పోయిన వీళ్లందరికీ మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం వేగంగా అడుగులు పడుతోంది.

* మనం అధికారంలోకి రాక మునుపు ఇదే రకమైన పరిస్థితి జీఎస్పీసీ వాళ్లు అప్పట్లో క్రియేట్ చేశారు.
* 2012కు సంబంధించిన పరిస్థితిలో 78 కోట్లు వారికి రావాల్సిన.. ఇదేరకంగా నష్టపరిహారం వాళ్లకు రావల్సింది 16554 కుటుంబాలకు రాని పరిస్థితిలో ఉన్నప్పుడు గత చంద్రబాబు ప్రభుత్వంలో కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. అడిగే పరిస్థితి, ఇచ్చే పరిస్థితి లేదు.

* అలాంటిది దేవుడి దయతో మనం అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే ఈ కార్యక్రమానికి మంచి జరిగిస్తూ మొదటగా మనమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ 78 కోట్లు రిలీజ్ చేసి 16554 కుటుంబాలకు మంచి జరిగిస్తూ ఆ కుటుంబాలకు తోడుగా ఉండే అడుగులు పడ్డాయి.

* ఆ తర్వాత ఓఎస్జీసీతో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు చర్చించి, ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లీ ఎప్పుడో రెండేళ్ల తర్వాతో, మూడేళ్ల తర్వాతో డబ్బులు వచ్చాయి.

* ఈలోపు మంచి జరిగించాల్సిన కార్యక్రమం ఎక్కడా డిలే జరగకుండా మత్స్యకారులకు ఏ విషయంలోనైనా తోడుగా ఉండే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఏ సమస్య వచ్చినా తోడుగా ఉంటుందన్న భరోసా కల్పించేలా అడుగులు ఆరోజు నుంచి పడటం మొదలు పడ్డాయి.

* చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఇంత పారదర్శకంగా, తాపత్రయపడి అడుగులు వేయడం 1.07 లక్షల మత్స్యకార కుటుంబాలకు ఈ 5 సంవత్సరాల్లో వైయస్సార్ మత్స్యకార భరోసా సాయం రూ.538 కోట్లు అందించాం.
* ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 మధ్య కాలంలో మత్స్యకారులకు అండగా, తోడుగా ఉంటూ వేటకు పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి మత్స్యకార భరోసా కింద తోడుగా ఉండే అడుగులు పడ్డాయి.

* గత చంద్రబాబు ప్రభుత్వంలో గమనిస్తే కేవలం ఆ 5 సంవత్సరాలకు కలిపి మత్స్యకార సోదరులకు ఇచ్చిన సాయం కేవలం రూ.104 కోట్లు.
* మనమేమో ఏకంగా 1.07 లక్షల కుటుంబాలకు పారదర్శకంగా ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే ఉద్దేశంతో రూ.4 వేలు ఇస్తున్న కార్యక్రమాన్ని మనం రూ.10 వేలకు పెంచి దేశ చరిత్రలో ఎక్కడా ఇవ్వని అమౌంట్ ఇస్తూ తోడుగా ఉండే కార్యక్రమం చేస్తున్నాం.

* గతంలో డీజిల్ సబ్సిడీ విషయంలో రూ.6 మాత్రమే ఇస్తున్న పరిస్థితి నుంచి మనం అధికారంలోకి రాగానే ఏకంగా రూ.9కి పెంచడమే కాకుండా.. ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి నుంచి డీజిల్ పోయించుకునే సమయంలోనే సెలెక్టివ్ బంకులు ఏర్పాటు చేసి ప్రతి మత్స్యకారుడికీ ఐడీ కార్డు ఇచ్చి, రిజిస్ట్రేషన్ ద్వారా నోట్ చేసుకుని డీజిల్ కొట్టేటప్పుడే రూ.9 తగ్గించి డీజిల్ కొట్టించే కార్యక్రమం చేశాం.
* ఇది కూడా గొప్ప విప్లవాత్మక మార్పు.

* 20,812 బోట్లకు రూ.135 కోట్లు మనం ఈ రకంగా డీజిల్ సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరిగింది.
* వేటకు వెళ్లి మత్స్యకారులకు జరగరానిది జరిగి ఎవరైనా చనిపోతే ఇచ్చే ఎక్స్ గ్రేషియా ఎప్పుడొస్తుందో తెలియదు.

* అందరికీ అందుబాటులో ఉంటుందో లేదో తెలియని పరిస్థితి నుంచి ఈరోజు ఆ పరిస్థితిని మార్చి ఎక్స్ గ్రేషియా ఏకంగా రూ.10 లక్షలకు పెంచడమే కాకుండా, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే రూ.5 లక్షలు వెంటనే సాయం అందేట్టుగా, తర్వాత మిగిలిన అమౌంట్ కూడా ఆరు నెలల్లోనే వారికి అందజేసే గొప్ప సంప్రదాయం కూడా తీసుకురావడం జరిగింది.

* దీని వల్ల దాదాపు 175 కుటుంబాలకు మంచి జరిగిస్తూ మరో 17 కోట్లు వారికి తోడుగా అండగా నిలుస్తూ చేయడం జరిగింది.
* ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద రూ.1.50కే యూనిట్ అందుబాటులోకి తీసుకొచ్చి దాదాపు 40,850 మంది లబ్ధిదారులకు మంచి జరిగిస్తూ రూ.3500 కోట్లు వెచ్చించాం.
* కేవలం ఈ 6 పథకాలకు మాత్రమే రూ.4,913 కోట్లు.. మంచి జరిగింది.

* అందరూ కూడా తమ కాళ్ల మీద తామునిలబడే పరిస్థితి రావాలి, జీవనోపాధికి ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా, ప్రతి 50 కిలోమీటర్లకు సీ పోర్టు, ఫిషింగ్ హార్బర్, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ గానీ అందుబాటులోకి తీసుకొచ్చేలా వేగంగా అడుగులు పడ్డాయి.
* మనం వచ్చిన తర్వాతే మొట్ట మొదటి సారిగా 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలోకి తీసుకురావడం జరుగుతోంది.

* 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా వేగంగా నిర్మాణంలోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతోంది.
* 4 పోర్టులు కూడా కట్టే కార్యక్రమం ఈరోజు వాయువేగంతో నిర్మాణం జరుగుతోంది.
* ఇవన్నీ రాబోయే రోజుల్లో సీ కోస్ట్ లైన్ పరిధిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి జరుగుతోంది.

* వీటన్నిటి వల్ల మత్స్యకారులు ఎక్కడికో వెళ్లి ఉపాధి కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే గొప్ప జీవితాలు ఉండేలా అవకాశాలు మెరుగవుతాయి.
* ఈరోజు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవం ఉన్నింది. కానీ వీసీ ద్వారా చేస్తే ప్రజలకు అది కనిపించదు.

* అక్కడ జరిగిన అభివృద్ధి సరిగా తెలుసుకునే అవకాశం రాదని వ్యక్తిగతంగా నేనే పోయి దాన్ని ప్రారంభించే కార్యక్రమం చేస్తే ఏరకంగా ఫిషింగ్ హార్బర్ డెవలప్ అయ్యింది, మత్స్యకారుల జీవితాలు ఎలా మారుతున్నాయి, ఎన్నెన్ని బోట్లు నిల్వ చేసే పరిస్థితి వస్తుంది, చుట్టుపక్కల మౌలిక సదుపాయాలు ఏరకంగా అభివృద్ధి అయ్యాయి, అన్న విషయాలు తెలియకుండా పోతాయన్న ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేశాం.

* 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 4 పోర్టుల నిర్మాణం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
* రాబోయే రోజుల్లో నాలుగు పోర్టులకు పెట్టుబడులు రూ.16 వేల కోట్లు, 10 ఫిషింగ్ హార్బర్లకు పెట్టుబడులు రూ.4 వేల కోట్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు మరో రూ.200 కోట్లు.. దాదాపు 20 వేల పైచిలుకు కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం.

* ఇవన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. అత్యధికంగా మంచి జరిగేది, బాగుపడేది కచ్చితంగా ఎక్కడఎవరు అంటే ఫిషర్ మెన్ కమ్యూనిటీ.
* వీటన్నింటి వల్ల మంచి జరగాలని మనసారా ఆశిస్తూ, దేవుడి దయ వల్ల మంచి చేసే అవకాశం ఇంకా రావాలి అని దేవుడిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు అడుగులు వేయిస్తూ బటన్ నొక్కే కార్యక్రమం చేస్తాం. అని సీఎం జగన్‌ అన్నారు.

ఇవీ చదవండి: CM Jagan relesed ONGC Compensation: 23,458 మంది మత్స్యకారుల కుటుంబాలను ఆదుకున్నాం: సీఎం జగన్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు