PM Modi in Telangana: తెలంగాణ ప్రజలు మార్పుకోరుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలో అవినీతిరహిత పాలన కావాలన్నారు. మహబూబ్‌నగర్‌లో పర్యటించిన ప్రధాని.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. (PM Modi in Telangana)
“అవినీతిరహిత,పారదర్శకత పాలన బీజేపీతోనే సాధ్యం. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాం. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. తెలంగాణ రైతులకు MSP ధరల ద్వారా ఏటా రూ.27,000 కోట్లు ఖర్చు చేశాం. గతంతో పోల్చితే ఈ మొత్తం 8 రెట్లు ఎక్కువ. ఆ డబ్బు కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తోంది. సాగునీటి కాలువలు ఏర్పాటు చేశామని ఇక్కడి ప్రభుత్వం గొప్పగా చెప్తోంది కానీ, ఆ కాలవల్లో నీరు ఉండదు. రైతు పథకాల పేరుతో తెలంగాణలో సర్కార్ అక్రమాలకు పాల్పడుతోంది. అన్నదాతలను మేము గౌరవిస్తున్నాం. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తున్నాం.
పసుపు రైతుల కోసం జాతీయ పసుపు బోర్డు
తెలంగాణలో రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించడం ఆనందంగా ఉంది. తెలంగాణలో రోడ్డు, రైలు కనెక్టీవిటి పెంచాల్సిన అవసరముంది. తెలంగాణలు రైతులు పసుపును ఎక్కువగా పండిస్తారు. పసుపునకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. పసుపు రైతుల కోసం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం. నవరాత్రికి ముందే శక్తీ పూజలు ప్రారంభించాం. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర మధ్య రవాణా సదుపాయాలు మెరుగవుతాయి.
కొత్త ప్రాజెక్టు ల్లో 5 మెగా ఫుడ్ పార్క్స్ , 4 షిప్పింగ్ క్లష్టర్స్. పసుపు రైతుల కోసం నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు. ములుగులో ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు. సమ్మక్క, సారక్క పేరుతో గిరిజన యూనివర్శిటీ. రూ. 900 కోట్లతో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు. ఇన్ స్టిట్యూట్ అఫ్ ఎమినెన్స్ గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ. కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. కరోనా తర్వాత పసుపు పంట పై పరిశోధనలు పెరిగాయి.
https://x.com/BJP4India/status/1708425245550608503?s=20
నవరాత్రికి ముందే శక్తి పూజలు ప్రారంభించాం
నేడు అనేక రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులు ప్రారంభించాం. ఈ ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి మరింత జోరందుకుంటుంది. ఈ రోడ్డు ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీ మధ్య రవాణా సదుపాయాలు మెరుగువుతాయి. ఈ కొత్త ప్రాజెక్టుల్లో 5 మెగా ఫుడ్‌పార్క్స్, 4 ఫిషింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.” అని ప్రధాని మోదీ చెప్పారు.
ఇదీ చదవండి: Bhakti: ఒకరి భక్తిపై మరొకరు జోక్యం చేసుకోవచ్చా? భక్తి మార్గంలో ఏది సరైంది?