Minister meeting on Employees: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లు ఇతర సర్వీసు అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందం నిన్న సమావేశమైంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ డిమాండ్లతో పాటు నూతన పీఆర్సీకి సంబంధించి ఫిట్మెంట్,ఐఆర్ మంజూరు, గత పిఆర్సీ బకాయిలు చెల్లింపు, డిఏ, జిపిఎఫ్, ఎస్ఎల్ఎస్ బిల్లులు చెల్లింపు తదితర అంశాలపై చర్చించింది. Minister meeting on Employees
ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి,సర్వీసెస్ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.ఆదినారాయణ,డిప్యూటీ సెక్రటరీ చేతన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
అదే విధంగా ఉద్యోగ సంఘాల నుండి ఎపిఎన్జీఓ సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాస రావు, ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామిరెడ్డి, ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ మరియు ఎపిజెఎసి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.సూర్య నారాయణ, ఎపిఎస్టియు అధ్యక్షులు సాయి శ్రీనివాస్, పిఆర్టియు అధ్యక్షులు ఎం.కృష్ణయ్య, యూటీఎఫ్ అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఏపీటీఎఫ్ అధ్యక్షులు ఎన్.హృదయరాజు, ఏపీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఎస్.బాలాజీ, ఎపి ప్రభుత్వ డ్రైవర్ల సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు ఎస్ శ్రీనివాస్, ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ల అధ్యక్షులు చంద్రశేఖర్, మల్లేశ్వరరావు, ఎపి వెటర్నరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాఘవ రావు, తదితర ఉద్యోగ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.
Read also: Jagan Siddam: మీ జగన్ 57 నెలల పరిపాలనలో 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు..
Ministers on Employees: ఉద్యోగుల అంశాలపై రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందం సమావేశం
AP DSC Notification: ఏపీలో టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్.. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులంటే..
AP Assembly news: ఉద్యోగికి మోదం.. జీపీఎస్‌కు ఆమోదం
Good News for employees: విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీపికబురు.. జీతం ఎంత పెంచారంటే..
