HomeAndhra PradeshYSR Kalyanamasthu Funds: 56,194 జంటలకు మంచి జరిగిస్తూ రూ.427 కోట్లు అందజేశాం: సీఎం జగన్

YSR Kalyanamasthu Funds: 56,194 జంటలకు మంచి జరిగిస్తూ రూ.427 కోట్లు అందజేశాం: సీఎం జగన్

YSR Kalyanamasthu Funds: పిల్లల పెళ్లిళ్లకు తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో వైయస్సార్ కల్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫాకు శ్రీకారం చుట్టామని సీఎం జగన్ తెలిపారు. వైయస్సార్ కల్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా నిధులను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. YSR Kalyanamasthu Funds

* దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది.
* దాదాపు 10,132 మంది జంటలకు, పిల్లలకు ఈరోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతోంది.
* వైయస్సార్ కల్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా కార్యక్రమం ప్రతి పేదవాడికీ పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ కచ్చితంగా పదో తరగతి సర్టిఫికెట్ ఇద్దరికీ ఉండాలని పెట్టాం.

* దీని వల్ల కచ్చితంగా ఈ స్కీమ్‌లో ఎలిజబులిటీ రావాలంటే కచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ఉపయోగపడుతుంది.
* 18 సంవత్సరాలు వధువుకు, 21 సంవత్సరాలు వరుడికి ఉండాలన్న నిబంధన ఉండటం వల్ల పదో తరగతి ముందే 15 ఏళ్లు, 16 సంవత్సరాలకే అయిపోయినా 18 సంవత్సరాల ముందే పెళ్లి జరిగితే ఈ స్కీమ్ కు అనర్హులు కాబట్టి, ఇంటర్ మీడియట్‌కు పంపితే అమ్మ ఒడి అనే పథకం ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం తల్లికి అమ్మ ఒడి ద్వారా మంచి జరుగుతుంది.
* కచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు.

* ఇంటర్ అయిపోయిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్సుమెంట్ ఇచ్చే విద్యాదీవెన ఉంది.
* అదేమాదిరిగా వసతి దీవెన కూడా బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.20 వేల దాకా విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్‌లో ఇస్తున్నాం.
* ఈ రెండు స్కీములు ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాపా, ప్రతి పిల్లాడూ గ్రాడ్యుయేట్స్ అయ్యేలా అడుగులు వేయించగలుగుతున్నాం.

* కచ్చితంగా తల్లి చదివి ఉంటే వచ్చే జనరేషన్ లో పిల్లలు కూడా చదువుల బాట పడతారు.
* మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా, మన తలరాతలు మారాలన్నా, మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలన్నా, మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే, అదొక ఆస్తిగా మనకు వస్తే, మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది.

* గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో ఇది నామ్ కే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కాకుండా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్ ఇచ్చి వెంటనే ఇచ్చేట్టుగా, గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజీ సర్టిఫికెట్లు ఇచ్చేట్టుగా మార్పులు చేశాం.
* ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందుబాటులోకి తీసుకొస్తూ ఈ పథకాన్ని సచివాలయం దాకా తీసుకుపోయాం.

* గతంలో 40 వేలకు పరిమితమైన ఎస్సీలకు రూ.లక్ష దాకా తీసుకుపోయాం. కులాంతా పెళ్లి అయితే రూ.1.20 లక్షల వరకు తీసుకుపోయాం.
* ఎస్టీలకు రూ.50 వేలకు పరిమితమైతే రూ.లక్ష దాకా తీసుకుపోయాం. కులాంతర వివాహం అయితే రూ.1.20 లక్షల దాకా తీసుకుపోయాం.
* గతంలో బీసీలకు కేవలం రూ.35 వేలు మాత్రమే ఇస్తుంటే దాన్ని రూ.50 వేల వరకు తీసుకుని పోవడం, కులాంతర వివాహం అయితే దాన్ని రూ.75 వేల దాకా తీసుకుపోయాం.

* వికలాంగులు, దివ్యాంగులకు ఏకంగా రూ.1.50 లక్షల దాకా తీసుకుపోయాం.
* వాళ్ల కుటుంబాల్లో ఏ ఒక్కరూ, తల్లిదండ్రులు అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకూడదని సబ్‌స్టాన్సియల్ అమౌంట్ పెంచి ఇస్తున్నాం.
* చదువులను ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులను అడుగులు వేయిస్తాయన్న నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం.

* గతంలో అరకొరగా ఇస్తున్న పరిస్థితులు.. దాదాపు 17,709 మంది పిల్లలకు ఇచ్చే అరకొర కూడా దాదాపు రూ.70 కోట్లు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు ఏ ఒక్కరూ మిస్ కాకూడదని ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

* దాదాపుగా ఇది 5వ విడత. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వార్టర్‌కు సంబంధించినది ఈరోజు ఇస్తున్నాం. దాదాపు రూ.78 కోట్లు ఇస్తున్నాం.
* ఇంత వరకు 56,194 జంటలకు మంచి జరిగిస్తూ, వారి కుటుంబాలకు, తల్లిదండ్రులకు మంచి జరిగిస్తూ రూ.427 కోట్లు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువులు ప్రోత్సహించేందుకుమరో ముందడుగు వేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది.

* దీని వల్ల అందరికీ మంచి జరగాలని, ఈ క్వార్టర్ లో ఏకమైన ఈ పిల్లలకు, తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని వాళ్లందరికీ ఇంకా మంచి జరగాలని వాళ్లందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా.
* రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా ఇంకా మంచి జరగాలని, మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

Read also: YSR Kalyanamasthu: రేపు వైయస్సార్‌ కల్యాణమస్తు-షాదీ తోఫా నిధులు విడుదల.. ఇప్పటి వరకు రూ.427.27 కోట్ల సాయం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు