YSR Kalyanamasthu: పెళ్లిళ్లు చేసుకోవాలంటే సతమతం అవుతున్న పేరెంట్స్‌కు, యువతకు అండగా నిలుస్తున్నారు ఏపీ సీఎం జగన్. వైయస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకం కింద మూడు నెలలకోసారి లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి చేయూతనందిస్తున్నారు. ఇందులో భాగంగా రేపు ఈ పథకం నిధులను వధువుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయనున్నారు. YSR Kalyanamasthu
అక్టోబర్- డిసెంబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా కింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేయనున్నారు.
పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవ ప్రదంగా జరిపించే తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తోంది ఏపీ సర్కార్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైయస్సార్ కళ్యాణమస్తు ద్వారా, మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైయస్సార్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయం అందజేస్తోంది జగన్ సర్కార్.
* కళ్యాణమస్తు, షాదీ తోఫాలకు పదో తరగతి ఉత్తీర్ణత, వధువుకు కనీస వయోపరిమితి 18 ఏళ్లుగా, వరునికి 21 ఏళ్ళుగా నిర్ధేశించారు.
* పదో తరగతికి వచ్చే సరికి వారికి 15 ఏళ్ల వయసు వస్తుంది. 1 వ తరగతి నుంచి అప్పటికే ఏటా అందిస్తున్న రూ. 15,000 జగనన్న అమ్మ ఒడి సాయం ఇంటర్ వరకూ కూడా ఇస్తుండటంతో వారికి 17 ఏళ్ల వయసు వచ్చే సరికి వారి ఇంటర్ చదువు పూర్తవుతుంది.
* ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్, వసతి దీవెన ద్వారా ఏటా రూ. 20,000 వరకు ఆర్ధిక సాయం అందిస్తోంది. కళ్యాణమస్తు, షాదీ తోఫా ప్రోత్సాహకాలు కూడా ఉండడంతో వారు గ్రాడ్యుయేషన్‌లో చేరుతారని, పూర్తి చేస్తారన్నది సీఎం జగన్ నమ్మకం.
* బాల్య వివాహాలకు కూడా అడ్డుకట్ట వేయడం జరుగుతుందన్నది ప్రభుత్వం యోచన.
* ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే చెల్లిస్తూ ఈ పథకం కింద నిధులు చెల్లిస్తున్న జగన్ ప్రభుత్వం.
* ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి క్రింద ఇప్పటి వరకు 56,194 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 427.27 కోట్లు లబ్ధి చేకూర్చింది.
* గత పాలనలో 17,709 మంది అర్హులకు రూ. 68.68 కోట్ల లబ్ధి ఇవ్వకుండా వదిలేశారు.
* ప్రస్తుత ప్రభుత్వం వివిధ కేటగిరీలలో ఆర్థిక సాయాన్ని దాదాపు రెండింతలు పెంచి అందిస్తోంది.
పెంచి ఇస్తున్న సాయం ఇదీ..
* ఎస్సీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 40,000, జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000
* ఎస్సీ (కులాంతర వివాహం) గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 75,000, ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,20,000
* ఎస్టీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000, ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000
* ఎస్టీ (కులాంతర వివాహం) గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 75,000, ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,20,000
* బీసీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 35,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 50,000
* బీసీ (కులాంతర వివాహం) గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000, ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 75,000
* మైనార్టీలు, దూదేకులు, నూర్ బాషా గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000, ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000
* విభిన్న ప్రతిభావంతులు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 1,00,000, ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,50,000
* భవన, ఇతర నిర్మాణ కార్మికులు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 20,000, ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 40,000.
