AP DSC 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన DSC 2024 నోటిఫికేషన్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన జీఓలు 11,12 లను కూడా ఆయన విడుదల చేశారు. అదే విధంగా డీఎస్సీ 2024 సంబంధించిన వెబ్ సైట్ https//cse.gov.in కూడా మంత్రి ప్రారంభించారు. AP DSC 2024
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏడు యాజమాన్యాలు కింద ఉన్న అనగా జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ (గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్),ఎపి సోషల్ వెల్పేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసేటీ,మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సొసైటీల కింద పనిచేస్తున్న విద్యాసంస్థల్లోని ఖాళీలన్నిటి భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు.
వచ్చే ఏప్రిల్ నాటికి ఖాళీ అయ్యే ఉపాధ్యాయ ఖాళీలన్నిటినీ రానున్న డిఎస్సి ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని మీడియాకు స్పష్టం చేశారు.అంతే గాక జీరో వేకెన్సీ అనే విధానంతో ఏడాదికి సంబంధించి ఖాళీలను ఆఏడాదే భర్తీ చేయడం జరుగుతుందని మంత్రి బొత్స తెలిపారు. డీఎస్సీ నిర్వహణకు మొత్తం 122 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగు తుందని మంత్రి బొత్స వివరించారు. మార్చి 15 నుంచి 30 వరకూ కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు జరుగుతాయని, పండుగలు, ప్రభుత్వ సెలవు దినాలను మినహాయించి మిగతా రోజుల్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
డీఎస్సీ 2024 కు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణ,మరియు పరిష్కారానికి వీలుగు కమీషనర్ పాఠశాల విద్యాశాఖ వారి కార్యాలయంలో ఇప్పటికే ప్రత్యేక హెల్ప డెస్క్ పనిచేస్తోందని ఆహెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు 9505619127 మరియు 9705655349 అని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ ప్రకాశ్ మాట్లాడుతూ డీఎస్సీ 2024 కు సంబంధించి రెండు జిఓలు 11, 12 మంత్రి చేతుల మీద విడుదల చేయడం జరిగిందని చెప్పారు. జీఓ 11లో ఉపాధ్యాయ నియామకం వంటి పూర్తి వివరాలు దానిలో ఉంటాయని తెలిపారు. అలాగే జిఓ సంఖ్య 12లో వివిధ అర్హతలు వాటికి సంబంధించి వివరాలు పొందుపర్చబడ్డాయని చెప్పారు.
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సురేశ్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 12 నుండి 21 వరకూ అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించవచ్చని,ఈనెల 22 వరకూ అన్లైన్ లో ధరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు. మార్చి 5వ తేదీ నుండి హాల్ టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. మార్చి 15 నుండి 30 వరకూ డీఎస్సీ 2024 వరీక్షలు జరుగుతాయని, వచ్చిన ధరఖాస్తులు ఆధారంగా మొత్తం పరీక్షా కేంద్రాలు ఎన్ని అనేది నిర్ణయించడం జరుగుతుందని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సరాసరిన 35 వేల నుండి 40 వేల మంది అభ్యర్ధులు ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు రాసేందుకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి సందేహాలు నివృత్తి, ఫిర్యాదుల పరిష్కారానికై ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ కమీషనర్ కార్యాలయంలో ప్రత్యేక హెల్పు డెస్కు ప్రతి రోజు ఉదయం 10 గం.ల నుండి సా.5గం.ల వరకూ పనిచేస్తోందని దీనిని అభ్యర్ధులు వినియోగించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి AP DSC Notification: ఏపీలో టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్.. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులంటే..
Kerala Schools: స్కూలు విద్యార్థులకు నీళ్ల విరామం.. కేరళ సర్కారు వినూత్న ఆలోచన!
Foreign Education: విద్యా విధానం టఫ్‌గా ఉండే దేశాలు ఇవీ.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండోయ్!
