YSRCP Rajyasabha Candidates: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ఏపీలో అధికార పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఖాళీ అయిన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక చేశారు. ఈ మేరకు మీడియాకు కొంత కాలంగా లీకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కన్ఫమ్ అయ్యింది. (YSRCP Rajyasabha Candidates)
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌తో గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి కలిశారు. అసెంబ్లీలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను సీఎం జగన్ అభినందించారు.
ప్రస్తుతం ఏపీ శాసనసభలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగా మూడు సీట్లు అధికార పార్టీనే గెలుచుకొనే అవకాశం పుష్కలంగా ఉంది. అయితే, టీడీపీ, జనసేన తాజాగా బీజేపీతో పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ తమ కూటమి నుంచి అభ్యర్థిని బరిలోకి దించాలని చూస్తున్నారు. అధికార పార్టీలో సీట్లు రాక టీడీపీ, జనసేనతో టచ్ లోకి వచ్చిన వారు పోలింగ్ వేళ తమకు కలిసి వస్తారనే లెక్కలేసుకుంటున్నారు. అదే సమయంలో సీట్లు రాక ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న వారిని తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు ఆమోదం లభించింది. దీంతో.. ఓటింగ్ లో పాల్గొనే సభ్యుల సంఖ్య 165కి చేరుతోంది. ఇదే జరిగితే రాజ్యసభ ఎన్నికల్లో నంబర్ గేమ్ ఖాయమనే విశ్లేషణలు వస్తున్నాయి. టీడీపీ ఎన్డీఏలో చేరేది కన్ఫం అయితే మూడు పార్టీల కూటమి నుంచి అభ్యర్థి పోటీలో ఉంటారని చెబుతున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఒకరిని ఈ రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దింపే అవకాశాలున్నాయి. పొత్తులపై స్పష్టత వచ్చిన తరువాత దీనిపై మరింత క్లారిటీ వచ్చే వీలుంది.
ఇదీ చదవండి: Rajyasabha Elections AP: అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఏపీలో రసవత్తరంగా రాజ్యసభ ఎన్నికలు.. ట్విస్టులు తప్పవా!
