HomeAndhra PradeshICDS MDM Commission: ఐసీడీఎస్, ఎండీఎం కమీషన్ రూ.23.71 కోట్లు రిలీజ్

ICDS MDM Commission: ఐసీడీఎస్, ఎండీఎం కమీషన్ రూ.23.71 కోట్లు రిలీజ్

ICDS MDM Commission: దశాబ్ద కాలంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఐసీడీఎస్, ఎండీఎం కమీషన్ రూ.23.71 కోట్లకు మోక్షం లభించింది. రాష్ట్ర ఫౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విడుదల చేశారు. మంత్రి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ముఖ్యంగా ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు డోర్ డెలివరీ వ్యవస్థను ప్రవేశపెట్టామన్నారు. (ICDS MDM Commission)

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 9260 మంది నిరుద్యోగులను ఎండియు ఆపరేటర్లుగా నియమించి వారికి 90 శాతం సబ్సిడీతో 9260 వాహనాలను సమకూర్చి వారికి నెలకు 18 వేల రూపాయలు వంతున చెల్లించడం జరుగుతోందని పేర్కొన్నారు.అయితే ఈఆపరేటర్ల ద్వారా నిత్యావసర సరుకులు కార్డుదారుల ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నప్పటికీ చౌకధరల దుకాణదారుల శ్రేయస్సు దృష్ట్యా మరియు వారిపై ప్రభుత్వానికి ఉన్నటువంటి సానుకూల ధోరణి వల్ల వారిని స్టాకిస్టులుగా కొనసాగించడం జరుగుతోందని మంత్రి నాగేశ్వర రావు స్పష్టం చేశారు. ICDS MDM Commission

గతంలో నాణ్యతలేని రేషన్ సరుకులను ప్రజలకు పంపిణీ చేసే వారని కాని నేడు ఈప్రభుత్వం పూర్తి నాణ్యతతో కూడిన సరుకులను అందించడం జరుగుతోందని మంత్రి తెలిపారు.రాష్ట్రమంతటా సార్టెక్స్ బియ్యాన్ని పంపిణీ చేయడంతో పాటు రైతుల నుండి నేరుగా కొనుగోలు చేసి కంది పప్పును పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు.రాయలసీమ ప్రాంతంలో రాగులు ఇస్తుండగా ఉత్తరాంధ్రలో రాగి పిండిని పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు.త్వరలో రాష్ట్ర మంతటా వీటిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ రీసైక్లింగ్ చేసినా లేదా రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడినా అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యల తీసుకుంకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రేషన్ సరుకుల పంపిణీకై ఈఐదేళ్ళలో ప్రభుత్వం 12వేల 438 కోట్ల రూ.లను వెచ్చించడం జరిగిందని ఫౌరసరఫరాల శాఖామాత్యులు కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు.కేవలం 1950 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించదని మీడియాలో వచ్చిన వార్త వాస్తవం కాదని ఆయన ఖండించారు.

2012 నుండి పెండింగ్ లో వున్ ఐసిడిఎస్ మరియు ఎండియం కమీషను 25 కోట్ల రూ.లకు గాను ఇప్పటికే 2కోట్ల రూ.లు చెల్లించగా మిగతా 23 కోట్ల 71 లక్షల రూ.లను కూడా విడుదల చేశామని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం చౌకధరల దుకాణాల కమీషను కింద మార్చి 2022 వరుకు కిలోకి 70 పైసలు,ఏప్రిల్ 2022 నుండి కిలోకి 90 పైసలు ఇస్తుండగా మన ప్రభుత్వం కిలోకి రూపాయి వంతున ఇస్తోందని పేర్కొన్నారు.రేషన్ డీలర్లు కమీషన్ పెంచాలని విజ్ణప్తి చేశారని పెంపుదల గురించి ప్రభుత్వముతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మంత్రి నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

అదే విధంగా కరోనా సమయములో చనిపోయిన 53 మంది చౌకధరల దుకాణదారులకు 50 వేల రూ.లు వంతున పరిహారంగా చెల్లించేందుకు ముఖ్యమంత్రి వర్యులు ఆమోదం తెలిపారని త్వరలో ఆపరిహారం చెల్లిండం జరుగుతుందని మంత్రి నాగేశ్వరరావు వెల్లడించారు.
గతంలో చౌకధరల దుకాణ ఆథరైజేషన్ రెన్యువల్ కై సంబంధిత రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయానికి స్వయంగా వెళ్ళి ఈప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి వచ్చేదని ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకై ఇకపై ఆన్‌లైన్ ద్వారా చేసే విధముగా సంబంధిత సచివాలయంలో ఎపి సేవా పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించడ మైనదని స్పష్టం చేశారు.ఇంకను చౌకధరల దుకాణ ఆథరైజేషన్ రెన్యువల్ పత్రమును కూడా సంబంధిత సచివాలయం నుండే పొందవచ్చని చెప్పారు.

రేషన్ డీలర్ల శ్రేయస్సును సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేరళ రాష్ట్రం తరహాలో చౌకధరల దుకాణ డీలర్ల సంక్షేమ నిధి ఏర్పాటుకై కమిటిని ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు.ఇందుకు సంబంధించి ఇప్పటికే డీలర్లతో కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ప్రతి డీలర్ నుండి ఏడాదికి 1000 రూపాయలు సంక్షేమ నిధి కోసం సేకరించాలని నిర్ణయించడ మైనదని తెలిపారు.ఇందుకుగాను రేషన్ డీలర్ల సంఘం నుంచి ఆమోదం వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అలాగే 2021 లో రేషన్ డీలర్ల నుండి తీసుకొన్నఖాళీ గొనె సంచులు ఒక్కింటికి రూ. 20 ఇచ్చే అంశం ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఉన్నందున కోర్టు ఆదేశాల అనంతరం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగు తుందని మంత్రి పేర్కొన్నారు.డీలర్లకు సంబంధించిన ఇతర సమస్యలపై కూడా ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం రేషన్ డీలర్ల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు.రాష్ట్రంలోని రేషన్ డీలర్లందరూ భవిష్యత్తులో కూడా వారు అందిస్తున్న సహకారాన్ని కొనసాగించాలని తద్వారా దేశంలో మన రాష్ట్రం ప్రజా పంపిణీ వ్యవస్థ అగ్రస్థానంలో ఉండేలా సహకరించాలని మంత్రి కోరారు.

read also: Anganwadi protest: రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలపై సానుకూలంగా ఉంది

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు