Times Now Latest Survey: 2024.. జగన్ నవన్స్ మోర్ అంటున్నాయి సర్వేలు. ఏ సర్వే తీసుకున్నా.. ఫ్యాన్ ప్రభంజనం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా టైమ్స్ నౌ సర్వేలోనూ ఇదే తేటతెల్లమైంది. 47.6 శాతం ఓటు షేర్‌తో ఏపీలో మరోసారి అధికారంలోకి జగనే వస్తారని ఆ సర్వేలో వెల్లడైంది. మరో రెండు నెలల్లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ సీట్లు, 25కు 25 ఎంపీ సీట్లు గెలవడం లక్ష్యంగా ముందుకెళ్తున్న వైయస్సార్ సీపీకి తాజా సర్వేలు తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాయి. Times Now Latest Survey
టైమ్స్ నౌ సర్వేలో ఏం తేలిందంటే..
ఓటు షేర్ ఏ పార్టీకి ఎంత?
* వైయస్సార్ సీపీ 47.6 శాతం
* టీడీపీ-జనసేన 44.4 శాతం
* కాంగ్రెస్ 1.5 శాతం
* బీజేపీ 2.1 శాతం
* ఇతరులు 4.4 శాతం
ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు?
* వైయస్సార్ సీపీ 19
* టీడీపీ-జనసేన 6
* కాంగ్రెస్ 0
* బీజేపీ 0
టీడీపీ-జనసేనకు సింగిల్ డిజిట్
రాష్ట్రంలో ఎన్ని కూటములు జతకట్టినా వైయస్ జగన్ ప్రభుత్వానికి తిరుగు లేదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వై నాట్ 175తో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్.. కేడర్‌లో నూతనోత్తేజం నింపుతున్నారు. ఇటీవల భీమిలి, దెందులూరులో సిద్ధం సభలు నిర్వహించడంతో వార్ వన్ సైడ్ అయిపోయిందనే విశ్లేషణలు వస్తున్నాయి. టైమ్స్ నౌ సర్వేలో టీడీపీ-జనసేన కూటమి సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని, ఆ రెండు పార్టీలకు కలిపి 6 సీట్లకు మించవని తేలింది.
వై నాట్ 175
2019 లోక్‌సభ ఎన్నికల్లో వైయస్సార్ సీపీ 22 ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈసారి ఆ రికార్డును తిరగరాసి 25కు 25 ఎంపీలూ గెలవాలని సీఎం జగన్ పట్టుదలగా ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చరిత్రలో కనీవినీ ఎరుగని కార్యక్రమాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చామని, అలాంటప్పుడు 175కు 175 అసెంబ్లీ సీట్లు, 25కు 25 ఎంపీలూ ఎందుకు గెలవకూడదని జగన్ ప్రశ్నిస్తున్నారు.
జాతీయ పార్టీలకు చోటు లేదు
టైమ్స్ నౌ తాజా సర్వేలో జాతీయ పార్టీలైన బీజేపీకి 2.1 శాతం, కాంగ్రెస్‌కు 1.5 శాతం మాత్రమే ఓటు షేర్ దక్కుతుందని తేలింది. ఆ రెండు పార్టీలు ఎంపీ స్థానాలేవీ గెలవలేవని వెల్లడైంది. టైమ్స్ నౌ సర్వేను వైయస్సార్ సీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ పెద్దగా తేడా ఉండదని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఏపీలో వైయస్ జగన్‌దే విజయమని కుండబద్ధలు కొడుతున్నారు. ఈ సర్వేలు వైయస్సార్ సీపీ శ్రేణుల్లో మరింత జోష్ నింపుతున్నాయి.
ఇదీ చదవండి: Times now survey YSRCP Clean sweep: టైమ్స్ నౌ తాజా సర్వే.. ఏపీలో మరోమారు వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయం!
