Times now survey YSRCP Clean sweep: ప్రఖ్యాత టైమ్స్ నౌ సంస్థ తాజాగా ఓ సర్వే చేసింది. సెప్టెంబర్‌లో నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఏపీలో 2024 ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతోందని సర్వేలో వెల్లడైంంది. (Times now survey YSRCP Clean sweep)
* ఏపీ లోక్ సభ సీట్లలో వైఎస్సార్‌సీపీ 24 నుంచి 25 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందని తేలింది.
* టీడీపీ 0-1 సీట్లు వచ్చే చాన్స్ ఉంది. ఏపీలో వైఎస్సార్‌సీపీ 51.10 శాతం ఓట్ షేర్ ఖాయమని సర్వే కుండబద్ధలు కొట్టింది.
* టీడీపీ 36.40, జనసేన 10.10% ఓట్ షేర్ ఉండొచ్చని తేలింది.
* తెలంగాణ లోక్ సభ బీఆర్ఎస్ 9 -11 సీట్లు గెలుపొందే వీలుందని సర్వేలో తేలింది.
* బీజేపీ 2- 3, కాంగ్రెస్ 3-4 , తదితరులు 0 -1 సీట్లు సాధించే అవకాశం ఉంది.
* అధికార పార్టీ బీఆర్ఎస్ 38.40 శాతం, బీజేపీ 24.30 శాతం ఓట్ షేర్, కాంగ్రెస్ 29.90 శాతం, ఇతరులు 7.40 శాతం ఓట్ షేర్ సాధించే చాన్స్ ఉందని తేలింది.
* ఈ సర్వే సెప్టెంబర్ లో నిర్వహించినట్లు టైమ్స్ నౌ సంస్థ వెల్లడించింది.
ఇక ఏపీలో లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని టైమ్స్ నౌ సర్వేలో పేర్కొంది. వైఎస్సార్‌సీపీ విజయం ఏకపక్షమని వెల్లడైంది. సీఎం జగన్ ఇప్పటికే వై నాట్ 175 అంటూ జోరుమీదున్నారు. ఓవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టుతో టీడీపీ కకావికలమైంది. ఈ క్రమంలో ఆ పార్టీపై ఎన్నికల ప్రభావం తీవ్రంగా చూపే అవకాశాలు లేకపోలేదు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విధానాలకు ప్రజల్లో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. నిరుపేదలకు నిరంతరాయంగా అందిస్తున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి టీబీటీ ద్వారా లంచాలు, వివక్షకు తావు లేకుండా నేరుగా నగదు సాయం అందుతోంది. పారదర్శక పాలన వైఎస్సార్‌సీపీకి జనాదరణను పెంచాయని విశ్లేషకులు స్పష్టీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం అసాధ్యం కాదనే విశ్లేషణలు వస్తున్నాయి.
మరోవైపు తెలంగాణలో కేసీఆర్ సర్కార్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేస్తోంది. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 9 నుంచి 11 సీట్లు గెలిచే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. బీజేపీ 2 నుంచి మూడు సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది. ఇక కాంగ్రెస్ 3 నుంచి 4 సీట్లు గెలిచే అవకాశం ఉందని, ఇతరులు కూడా ఒక సీట్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలో తేలడం గమనార్హం. ఈ సర్వేతో అటు తెలంగాణలో, ఇటు ఏపీలో అధికార పార్టీ నేతల్లో సరికొత్త జోష్ వచ్చింది.
ఇదీ చదవండి: Why not 175: 175 స్థానాల్లో గెలుపు ఎందుకు సాధ్యం కాదు? గేర్ మార్చాల్సిందేనన్న సీఎం జగన్