HomeAstrologyMagha Masam Marriages: మాఘమాసం పెళ్లిళ్ల సీజన్‌ షురూ.. మాఘమాసం విశిష్టతలు ఇవీ..

Magha Masam Marriages: మాఘమాసం పెళ్లిళ్ల సీజన్‌ షురూ.. మాఘమాసం విశిష్టతలు ఇవీ..

Magha Masam Marriages: మాఘమాసం వచ్చేస్తోంది. ఈనెల 11వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభం అవుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల కోలాహలం మొదలు కానుంది. ఈ నేపథ్యంలో పెళ్లిళ్లు చేసుకోవాల్సిన జంటలు మంచి ముహూర్తాల కోసం వేచి చూస్తున్న పరిస్థితుల్లో వారికి ఇది గుడ్‌ న్యూస్‌. Magha Masam Marriages

మాఘమాసం ప్రారంభం కానుండటంతో పెళ్లి సందడి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లో సన్నాయి మేళాలు మోగేందుకు సిద్ధంగా ఉన్నాయి. యువ జంటలు పెళ్లి పీటలు ఎక్కనున్నాయి. ఈనెల 11 నుంచి మాఘమాసం ప్రారంభం అవుతోంది. వివాహ ముహుర్తాల వివ‌రాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి..

మాఘమాసం: ఫిబ్రవరి 13,14,17,18,24,28,29 తేదీల‌తో పాటు మార్చి 2,3 తేదీలు

ఫాల్గుణం: మార్చి 15,17,20,22,24,25,27,28,30, ఏప్రిల్‌ 3,4 తేదీలు

ఛైత్రం: ఏప్రిల్‌ 9, 18,19,20,21,22,24,26

ఏప్రిల్‌ 28 నుంచి మూఢం ప్రారంభం.

మాఘమాసం విశిష్టత ఏమిటంటే..
చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం అని పెద్దలు చెబుతున్నారు. ‘మఘం’ అంటే యజ్ఞం అని అర్థం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని విశిష్టమైనదిగా చెబుతారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కాబట్టి మాఘమాసమైందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.

మాఘ స్నానం పవిత్రస్నానంగా చెబుతారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయంగా వస్తోంది. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసంగా ఉంది. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణాలు చెబుతాయి. మఘం అంటే యజ్ఞం. కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా పరిగణిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.

మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందని చెబుతారు.దంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతాయి. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయంగా వస్తోంది. స్నాన సమయంలో ‘ప్రయాగ’ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.

మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ప్రత్యేక కోణంలో భూమిని చేరుకుంటాయి. ఈ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో ప్రత్యేక మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30వ తేదీ వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చేయడం చాలా ఆరోగ్యవంతం అని చెబుతారు.

వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్టమైనవని చెబుతారు. ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘ పూర్ణిమను ‘మహామాఘం’ అని పిలుస్తారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమగా చెబతారు. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకం అని చెబుతారు.

ఇదీ చదవండి: China President: చైనాలో ముందెన్నడూ లేని వింత పరిస్థితి.. యువతులు పెళ్లిళ్లు చేసుకోవాలంటూ అధ్యక్షుడి వేడుకోలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు