Kancha ilaiah: వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓడిపోతే ఆయనకు వ్యక్తిగతంగా పోయేది ఏమీ లేదని, నష్టపోయేది పేదలేనని ప్రముఖ రచయిత, దళిత హక్కుల కార్యకర్త కంచె ఐలయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. గత ఎన్నికల ముందు తాను ఓ ఆర్టికల్ ఇంగ్లీషులో రాశానని, ఆ తర్వాత అది తెలుగు ప్రత్రికల్లో ప్రచురితమైందన్నారు. పేదరికంపై పోరాటం, పేదలకు ఇంగ్లీషు మీడియం విద్య అందడంపై తాను 35 సంవత్సరాలుగా పోరాడుతున్నానని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే వాటిని ఇంప్లిమెంట్ చేశారని, ఇప్పుడు ఈ సంస్కరణలు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ తరాలకు ఇది మేలు చేస్తుందన్నారు. (Kancha ilaiah)
“అసమానతలు, అంటరాని తనానికి, గుడి, బడి, పొలం, రోడ్ల మీద ఉన్న అంటరాని తనానికి, కుల అసమానతలకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ఒక్కటే పరిష్కారం అని నేను ప్రచారం చేస్తున్నాను. ఇంగ్లీషు మీడియం విద్య గవర్నమెంట్ స్కూళ్లలో ఉండాలని 35 ఏళ్లుగా పిచ్చిపట్టినట్లు ప్రచారం చేస్తున్నాను.
జగన్‌మోహన్‌రెడ్డిని నేను ఎప్పుడూ కలవలేదు. వాళ్ల తండ్రిని కలవలేదు. వాళ్ల కుటుంబంతో నాకు ఎప్పుడూ సంబంధం లేదు. కానీ అకస్మాత్తుగా ఆయన పోయిన ఎన్నికల ముందు గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం పెడతానని మేనిఫెస్టోలో రాశాడు. ఆ తర్వాత రోజు నేను ఇంగ్లీషులో ఓ ఆర్టికల్ రాశాను. అనంతరం కొన్నాళ్లకు సాక్షిలో అదే కథనం తెలుగులో ప్రచురితమైంది. ఈ కార్యక్రమం గనుక సీరియస్‌గా పెట్టి గడప గడపకూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రచారం చేస్తే 100 శాతం జగన్ మోహన్‌రెడ్డి గెలుస్తాడని అందులో నేను రాశాను. మీరు చూసుకోవచ్చు. ఆయన 151 సీట్లతో గెలిచారు.
ఇంగ్లీషు మీడియం సోషల్ జస్టిస్ ఎలా అవుతుంది? బడికి పోని ఒక స్త్రీ పెళ్లయిన తర్వాత పిల్లల్ని కనాలని భర్త రూములోకి తోలితే.. చదువు చెప్పిన భర్త.. దాని కోసమే ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన తండ్రి.. ఆ స్త్రీ ఈ దేశంలో ఇంగ్లీషు మీడియం సొల్యూషన్ అని కనుగొన్నది. ఆ ఇంగ్లీషు మీడియం సొల్యూషన్ మాల, మాదిగ, చాకలి, కమ్మరి, కుమ్మరి, ఆదివాసీ పిల్లలకు గనుక వస్తే ఇక్కడున్న ఇండస్ట్రియలిస్ట్ ఎవడూ సైంటిస్టులు కాలేదు, ఇక్కడున్న బ్రాహ్మణిక్ మేధావులెవడూ ఐన్ స్టీన్ కాలేదు.. వందలాది మంది ఐన్ స్టీన్‌లు ఆ గ్రామాల నుంచి పుడతారు అనేది నా నమ్మకం. దట్ వాస్ మై ట్రస్ట్. అండ్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంప్లిమెంటెడ్ ఇట్.
ఈ ఇంగ్లీషుమీడియం స్కూళ్లు, అమ్మ ఒడి, కాలేజీ పిల్లల తల్లులకు రూ.20 వేలు అకౌంట్లోకి.. ఇవన్నీ కలిపి నేను చెప్పింది ఏంటంటే.. There is a new model of development in Andhra Pradesh.. Which is count to the other model that are there in other states in Center.. And This model could be called shudra model of development అని చెప్పాను. The other models are no use brahman baniya models of development. ఎందుకు? కాంట్రాక్టర్‌కు డబ్బు అక్కడ పోతుంది.. ఇక్కడ తల్లులకు డబ్బులు పోతుంది.
సో సోషల్ జస్టిస్ అనేది.. It is ID of equality, of Ambedkar. ID of liberation, ID of looking God. మీరు ఎక్కడైనా చూశారా? దేవునికి ఒకటే భాష సంస్కృతం వస్తుందని వాళ్లు అంటున్నారు. అందులో మీ తత్వమేముందో గానీ.. మా ఊళ్లో పోచమ్మ దేవతకు అన్ని భాషలూ వచ్చు అని నేనంటాను. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు.. పోచమ్మ దగ్గరికి పోయి.. నాకు ఏమీ రానప్పుడు అమ్మా నాకు ఇంగ్లీషు చదువు చెప్పమని కండక్టర్ ఇంగ్లీషులో Teach me English అంటే నాకు కల్లు పోయి, కోడిని కోయి ఇంగ్లీషు ఇస్తా అని చెప్పిందామె.
నేను ఒక్క ఉదాహరణ చెబుతా.. నేను ఏ పార్టీని గానీ, ఎవరినీ సపోర్ట్ చేయడం లేదు. 1998లో చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఇండియన్ ఇంగ్లీష్ డే అక్టోబర్ 5న జరుపుతున్నాం. ఉస్మానియా విద్యార్థులందరం ఇంగ్లీషు మీడియం కోసం, గ్రామాల కోసం పోరాడుతున్నప్పుడు.. నేను ఒక విద్యార్థి టీమును చంద్రబాబునాయుడు దగ్గరికి పంపాను. ఇంగ్లీషు మీడియం ఇంట్రడ్యూస్ చేయండి.. కనీసం కొన్ని సబ్జెక్టులయినా అని పంపాను. వాళ్లు వెళ్లి అసెంబ్లీలో ఆయన్ను కలిశారు. అప్పుడు చంద్రబాబు ఏం చెప్పారంటే.. మా పార్టీ పేరే తెలుగుదేశం అయ్యా.. తెలుగుదేశం పేరు పెట్టుకొని మేము ఇంగ్లీషు మీడియం ఎలా చదువు చెబుతాం పిల్లలకు? అన్నాడాయన. అంటే మా పిల్లలు ఏం అడిగారో ఎరుకనా?
అవును సార్.. మీ పార్టీ పేరు తెలుగుదేశమే గానీ, నీ కొడుకు లోకేష్‌ను ఇంగ్లీషు మీడియంలో ఎందుకు చదివిస్తున్నావని అడిగారు. దానికి కౌంటర్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చాడు. వెంకయ్యనాయుడు మనమలు ఇంగ్లీషు మీడియంలో చదువుతారు. మాజీ చీఫ్ జస్టిస్ బిడ్డలు ఇంగ్లీషు మీడియంలో చదువుతారు. చంద్రబాబునాయుడు పిల్లలు, మనవలు, వాళ్ల కోడలు ఇంగ్లీషు మీడియం చదువుతుంది. కానీ మాల, మాదిగ, చాకలి, మంగలి, గొల్ల, కురుబ వాళ్లు, ఆదివాసీలు ఇంగ్లీషు మీడియంలో చదవొద్దంటే… ఆ ఇంగ్లీషు మీడియంలు పెట్టి చూపెట్టిన జగన్‌మోహన్‌రెడ్డి ఈ దేశానికే ఒక కొత్తమార్గాన్ని ఇచ్చాడు. ఐ నెవర్ మెట్ హిమ్. నార్ నాట్ ఐ వాంట్ టు మీట్ హిమ్.” అని కంచె ఐలయ్య వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: Poverty in Andhra Pradesh: ఏపీలో పేదరికంపై గెలుస్తున్న పేదలు.. 4.19 శాతానికి తగ్గిన పేదరికం
