YSRCP 6th List: వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల గెలుపే లక్ష్యంగా వైయస్సార్‌సీపీ దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ప్రకటనలో ముందడుగు వేస్తోంది. ఇప్పటి వరకు ఐదు లిస్టులు ప్రకటించిన అధిష్టానం.. తాజాగా ఆరో లిస్టు ప్రకటించింది. ఆరో జాబితాను మంత్రి మేరుగ నాగార్జున విడుదల చేశారు. రాజమండ్రి, నర్సాపురం, గుంటూరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. (YSRCP 6th List)
* గిద్దలూరు-నాగార్జున రెడ్డి
* ఎమ్మిగనూరు అసెంబ్లీ -బుట్టా రేణుక
* జీడీ నెల్లూరు-నారాయణస్వామి
* మైలవరం-తిరుపతిరావు
* రాజమండ్రి ఎంపి-గూడురు శ్రీనివాస్
* గుంటూరు ఎంపీ- ఉమ్మారెడ్డి రమణ
* నెల్లూరు సిటి-ఎండీ ఖలీల్,
* నర్సాపురం (ఎంపీ) – గూడూరి ఉమాబాల
* చిత్తూరు ఎంపీ-ఎన్.రెడ్డప్ప
* మార్కాపురం అసెంబ్లీ -అన్నా రాంబాబు
* గిద్దలూరు అసెంబ్లీ -కె.నాగార్జున రెడ్డి
* నెల్లూరు సిటీ అసెంబ్లీ ఎండీ ఖలీల్
మొత్తం ఆరు లిస్టుల్లో 78 స్థానాల్లో ఇన్‌ఛార్జుల మార్పు జరిగింది. 15 ఎంపీ, 63 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్‌ఛార్జులను ప్రకటించారు. 31 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 4 ఎంపీలను పక్కన పెట్టారు. ఇక అసెంబ్లీ ఇన్‌చార్జుల మార్పు దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. అయితే 7 పార్లమెంట్ స్థానాల ఇన్ ఛార్జ్ ల పై కసరత్తు ఇంకా తేలాల్సి ఉంది. కడప, రాజంపేట, తిరుపతి స్థానాల్లో సిట్టింగ్‌లను కొనసాగించే అవకాశం ఉంది.
ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల టెన్షన్ టెన్షన్
ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది. కొందరు వైయస్సార్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తుండడంతో తమ పరిస్థితి ఏంటని తలలు పట్టుకుంటున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారథి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరిక ఖాయమంటున్నారు. తిరువూరు నియోజకవర్గంలో తెరపైకి కొలికలపూడి శ్రీనివాసరావు వచ్చారు. ప్రస్తుత తిరువూరు ఇంచార్జ్ శావల దేవదత్ ఆందోళనలో పడ్డారు. పార్ధసారథిని నూజివీడుకి టీడీపీ హైకమాండ్ ఒప్పించింది. మైలవరం, పెనమలూరు టీడీపీ నేతల్లో టెన్షన్ పట్టుకుంది.

దేవినేని ఉమా వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్ చాలా కాలంగా నడుస్తోంది. ఒకరికి పెనమలూరు, మరొకరికి మైలవరం కేటాయించేలా అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల్లో వివిధ ఏజెన్సీల ద్వారా హైకమాండ్ సర్వేలు చేయించిందట. విజయవాడ పశ్చిమ టీడీపీలో గందరగోళం ఏర్పడింది. బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ పోటాపోటీ బల ప్రదర్శనలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేన కు ఇచ్చే సీట్లపై క్లారిటీ ఇంకా రాలేదు. విజయవాడ పశ్చిమ, అవనిగడ్డలు జనసేనకు ఇస్తారంటూ ప్రచారం జోరందుకుంది. నూజివీడులో ప్రస్తుతం ఇంచార్జ్ గా ఉన్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు.. తనని విస్మరిస్తే ఇండిపెండెంట్ గా బరిలో దిగుతానంటూ హెచ్చరిస్తున్నారు.
