YS Jagan about Develepment: రాష్ట్రంలో అసాధ్యమనుకున్నవి, లంచాలు, వివక్షకు తావులేని సంక్షేమ పాలన సాధ్యమేనా అనుకున్నవి కూడా సుసాధ్యం చేసిన చరిత్ర మనదని సీఎం జగన్ అన్నారు. ఏలూరు సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. (YS Jagan about Develepment) సీఎం ఇంకా ఏమన్నారంటే..
* గ్రామానికి ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నాడంటే కారణం, ప్రతి ఇంట్లోనూ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేస్తూ,వైద్యం ఇంటికొచ్చి మందులిచ్చే పరిస్థితి ఉందంటే కారణం.. మీ బిడ్డ. జరుగుతున్నది మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.
* 108, 104, ఆరోగ్యశ్రీ, రైతన్నలకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ తీసుకొచ్చింది మహానేత దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి అయితే, వాటిని మరో నాలుగు అడుగులు ముందుకు వేయిస్తున్నది, కదులుతున్నది, అమలు జరుగుతున్నది మీ బిడ్డ హయాంలో, వైయస్సార్ సీపీ పాలనలో.
* కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. 4 సీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, కొత్త ఎయిర్ పోర్టులు వస్తున్నాయి. ఉన్నవి విస్తరణ జరుగుతోంది. పారిశ్రామిక కారిడార్లు ఉరుకులు పరుగులు చేస్తున్నాయి. పారిశ్రామిక వ్యక్తులు, సంస్థలు లైను కడుతున్నాయి. జరుగుతున్నది మీ బిడ్డ పాలనలో, మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.
* నేను చెప్పిన ప్రతి విషయం వాస్తవం అవునా కాదా అని ఆలోచన చేయాలి.
* ప్రతి ఇంటికీ వాస్తవాలను తీసుకొని పోవాలి.
* 2019లో మనం అధికారంలోకి రాక ముందు ఏ ప్రభుత్వం అయినా ఇది సాధ్యపడుతుందా? అసాధ్యం అనుకున్న పనులన్నీ సాధ్యం చేయగలిగాం.
* ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయినీ కూడా ఎలాంటి లంచాలు, వివక్షకు తావు లేకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయ పార్టీ చూడకుండా నేరుగా పేదలకు వారి చేతికి అందించడం సాధ్యం కాదు అని ఎవరైనా అంటే.. కాదు.. అది సాధ్యమే ఒక్క జగనన్న పాలనలో అది సాధ్యమే అని దేశానికే చూపించగలిగాం.
* ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని పెద్ద పెద్ద మాటలు చెబుతారు. మేనిఫెస్టోలు రిలీజ్ చేయడం, తర్వాత మోసం చేయడం, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం జరుగుతోంది. మొదటిసారి ఎన్నికలమేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే.
* మీ బిడ్డ హయాంలో చెప్పింది ప్రతిదీ చేశాం. మొదటిసారి మేనిఫెస్టోను చూపించి 99 శాతం వాగ్దానాలను అమలు చేసి ప్రతి ఒక్కరికీ చూపించి వాళ్ల ఆశీస్సులు తీసుకుంటున్నది మన వైయస్సార్ సీపీ పార్టీ.
* మరి ఇవన్నీ కనిపిస్తున్నా కూడా కళ్లుండి ఈర్ష్యతో చూడలేని కబోదులు, ఇటువంటి వారంతా ఏమంటున్నారో మీరంతా వింటున్నారు కదా..
* వాళ్లకు ఎక్కువ టీవీ చానళ్లు, పేపర్లు ఉన్నారు. మనల్ని తిట్టేవారి సంఖ్య కూడా ఎక్కువ ఉంది. అంటూనే ఉంటారు.
* అబద్ధాల పునాదుల మీద వారి ఎన్నికల ప్రచారాల్ని మొదలు పెట్టారు.
* ఈ ఎన్నికలు ఎందుకింత ముఖ్యమో, అవసరమో ప్రతి పేద ఇంట్లో కూడా ఉన్న ఆ ప్రతి అవ్వాతాతకు, అక్కచెల్లెమ్మకు, అన్నదమ్ముడికి చెప్పాలి.
* ఇవి కేవలం ఒక ఎమ్మెల్యోనో, ఎంపీనో ఎన్నుకొనే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఈ 57 నెలలుగా పేదలకు అందుతున్న సంక్షేమాన్ని, వారి పిల్లల భవిష్యత్‌ను నిర్ణయించనున్న ఎన్నికలు ఈ ఎన్నికలని ప్రతి ఇంట్లోనూ చెప్పండి.
* ప్రతి కుటుంబం, ప్రతి సామాజికవర్గం, ప్రతి ప్రాంతం భవిష్యత్, ప్రతి రైతన్న భవిష్యత్, అక్కచెల్లెమ్మలసంక్షేమం, ఇంటింటిలో జరుగుతున్న అభివృద్ధి, పిల్లల భవిష్యత్ అన్నీ కూడా ఈ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయని ప్రతి ఒక్కరూ గమనించండి.
* ఇప్పటికే 3 వేలు చేసిన పెన్షన్, 1వ తేదీ ఉదయాన్నే ఈ 3 వేల పెన్షన్ అందాలన్నా, భవిష్యత్ లో ఇది పెరగాలన్నా, ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా.. భవిష్యత్ లో పెరగాలన్నా, ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా, మీ ఊరికే మీ ఇంటికే వైద్యం అందాలన్నా, వైద్యం కోసం ఏ పేదవాడూ అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకూడదన్నా, అది మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని ఇంటింటి వెళ్లి చెప్పండి.
* ఇదిజరగాలి అంటే ఇందుకోసం మన అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, వైద్య సేవలు అందుకుంటున్న వారు ప్రతి ఇంట్లో నుంచి ఒకరు స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి అని చెప్పండి.
* బయటకొచ్చి ప్రతి ఒక్కరూ కనీసం వంద మందితో జరుగుతున్న మంచి గురించి చెప్పాలి. మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యం అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి.
read also: YS Jagan in Eluru Sabha: సంక్షేమ విప్లవం సృష్టించాం.. ఏలూరు సిద్ధం సభలో సీఎం జగన్
Justice for Geethanjali: గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
Justice for Geethanjali: గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

Judah Houston