HomeAndhra PradeshJagan in Eluru sabha: సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్‌ను గెలిపించుకుందామని చెప్పండి.. శ్రేణులకు సీఎం...

Jagan in Eluru sabha: సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్‌ను గెలిపించుకుందామని చెప్పండి.. శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం

Jagan in Eluru sabha: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్‌ను గెలిపించుకుందామని రాష్ట్రంలో ప్రతి గడపకూ చెప్పాలని సీఎం జగన్ వైయస్సార్ సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏలూరు సిద్ధం సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కచెల్లెమ్మలకు అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం కొనాగాసాలన్నా, సున్నా వడ్డీ రావాలన్నా, ఆసరా తు.చ.తప్పకుండా చెల్లించిన మీ అన్న ప్రభుత్వమే ఇవన్నీ చేయగలదు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.. అని వ్యాఖ్యానించారు. (Jagan in Eluru sabha) ఇంకా ఆయన ఏమన్నారంటే..

* ఆ అక్కచెల్లెమ్మలే మన స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని చెప్పండి. కనీసం 100 మందికి అయినా చెప్పి ఓటు వేయించాలి, మళ్లీ జగనన్న ప్రభుత్వమే రావాలని చెప్పండి.
* 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి మనం ప్రారంభించిన 22 లక్షల ఇళ్ల నిర్మాణంతోపాటు పేద అక్కచెల్లెమ్మలకు సొంతింటి కల నెరవేరాలన్నా, మహిళా సాధికారతకు ఏ మంచిజరగాలన్నా మీ అన్న ప్రభుత్వమే చేయగలదు, మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
* స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని చెప్పండి.

* గవర్నమెంట్ బడులు మారాలన్నా, ఇంగ్లీషు మీడియం చదువులు రావాలన్నా, ప్రతి క్లాస్ రూములో డిజిటల్ బోధనతో మొదలు,ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబులు రావాలన్నా, పెద్ద చదువులు 100 శాతం ఫీజు రీయింబర్ష్ మెంట్ ఇచ్చే విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వాలన్నా, అంతర్జాతీయ చదువులు అందాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని చెప్పండి.
* పిల్లల తల్లిదండ్రులంతా మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి అండగా ఉండాలని, 100 మందికి చెప్పాలని, మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రతి తల్లిదండ్రులకూ చెప్పండి.

* గ్రామాల్లో ప్రతి రైతన్నకూ చెప్పండి. రైతు భరోసా కొనసాగాలన్నా, ప్రతి రైతన్నకూ మెరుగైన ఆర్బీకే సేవలు అందాలన్నా, ఉచితంగా ఇన్సూరెన్స్ రావాలన్నా, సీజన్ ముగిసేలోపే ఆ రైతన్నకు ఇన్ పుట్ సబ్సిడీ దొరకాలన్నా, పగటిపూటే ఉచిత విద్యుత్, దళారీ వ్యవస్థ పోయి రైతన్నకు మద్దతు ధర అందాలన్నా కేవలం జగనన్న మాత్రమే చేయగలడు అని ప్రతి రైతన్నకూ వెళ్లి చెప్పండి.
* ప్రతి రైతన్న స్టార్ క్యాంపెయినర్ కావాలని, మరో 100 మందికి జరిగిన మంచి చెప్పాలని అడగండి.

* ఈ 57 నెలల్లో ఏకంగా మీ బిడ్డ 124 సార్లు ప్రజల కోసం మీ బిడ్డ బటన్ నొక్కాడు.
* ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లిపోవడం, లంచాలు లేవు, వివక్ష లేదు.
* చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మనందరి ప్రభుత్వం 2.55 లక్షల కోట్లు పేద కుటుంబాలకు పంపింది. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి వారే అండగా నిలబడాలని, ఆ కుటుంబాలే స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని, మరో 100 మందికి జరిగిన మంచి చెప్పాలని, గడపగడపకూ వెళ్లి కోరండి.

* ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో ఆ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ జగనన్న 124 సార్లు మనకోసం బటన్ నొక్కాడు, జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి.. రెండు బటన్లు నొక్కలేమా అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
* జగనన్నకు ఓటు వేయకపోవడం అంటే ప్రతిపక్షాలకు ఓటు వేయడం అంటే దాని అర్థం, ఈ స్కీముల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్లవుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.

* ఈరోజు నెల 1వ తేదీన పొద్దున్నే చిరునవ్వుతో ప్రతి అవ్వాతాత, ప్రతి అన్న తమ్ముడు, చెల్లెమ్మకూ ఇంటి వద్దకే వచ్చి సేవలు అందుతున్నాయి.
* ప్రతిపక్షానికి ఓటు వేయడం అంటే దాని అర్థం మళ్లీ లంచాలు, మళ్లీ వివక్ష చూపించే జన్మభూమి కమిటీలను మళ్లీ బతికించినట్లవుతుందని ప్రతి ఇంట్లోకి వెళ్లి చెప్పండి.
* మన గ్రామంలో లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ మనకు మంచి జరగాలి అంటే జగనన్నను మర్చిపోకూడదు, 124 సార్లు బటన్ నొక్కాడు, ఆయన కోసం రెండు బటన్లు ఒక్కసారి నొక్కలేమా అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.

* ఆ ఇంటికే పెన్షన్ రావాలన్నా, డీబీటీ స్కీములు రావాలన్నా జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుంది, అందుకే మీ జగనే సీఎంగా ఉండాలి, మన వైయస్సార్ సీపీ కొనసాగాలి. ఈరోజు జగనన్న దేవుడిని, మనల్నే నమ్ముకున్నాడు. జగనన్నకు తోడేళ్ల మద్దతు లేదు, నక్కజిత్తులు చేసే అలవాటు లేదు, మోసం చేసే అలవాటు లేదు, అబద్ధాలు చెప్పే అలవాటు జగనన్నకు లేదని ప్రతి ఇంట్లోనూ చెప్పండి.

read also: YS Jagan about Develepment: అసాధ్యమనుకున్నవి సుసాధ్యం చేసిన చరిత్ర మనది.. సిద్ధం సభలో సీఎం జగన్
YS Jagan in Eluru Sabha: సంక్షేమ విప్లవం సృష్టించాం.. ఏలూరు సిద్ధం సభలో సీఎం జగన్
Justice for Geethanjali: గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు