HomeDevotionalVaraha Swamy Mantram: వడ్డీకాసుల వాడిని ఇలా వేడుకోండి.. మీ కష్టం తొలగిస్తాడు!!

Varaha Swamy Mantram: వడ్డీకాసుల వాడిని ఇలా వేడుకోండి.. మీ కష్టం తొలగిస్తాడు!!

Varaha Swamy Mantram: కలియుగ ప్రతక్ష్యదైవం శ్రీవేంకటేశ్వర స్వామి చెంత నిత్యకల్యాణం.. పచ్చతోరణంలా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో ఉన్న ఇల వైకుంఠపురాన్ని భక్తులందరూ దర్శించి పుణీతులవుతుంటారు. స్వామి వారిని దర్శించుకోవడం ఒక ఎత్తయితే ఆయన కరుణాకటాక్షాలు పొందడం మరో ఎత్తు. ఇంతకీ స్వామిని ఎలా పూజిస్తే మన కోర్కెలు నెరవేరుతాయనేది చాలా మందికి ఉండే అనుమానం. అందుకోసమే ఈ కథనంలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. (Varaha Swamy Mantram)

వరాహ స్వామి వారిని దర్శించకున్న తర్వాత శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సంపూర్ణ ఫలితం కలుగుతుందని సాక్షాత్తూ స్వామివారే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంటి స్థలాల విషయంలో, అపార్ట్‌మెంట్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు వరాహ స్వామిని ప్రత్యేక పద్ధతిలో పూజించాలని నిపుణులు చెబుతున్నారు. వరాహ స్వామి తిరుమలలో కోనేరు పక్కనే కొలువై ఉంటారు. ఆ స్వామి ఫొటోను తీసుకోవాలి. దీన్ని ఫ్రేమ్‌ చేసి ఇంట్లో పెట్టుకోవాలి. తిరుమల వెంకన్నకే స్థలం ఇచ్చిన వాడివి.. మాకు చిన్న స్థలం కావాలి స్వామీ… అంటూ వరాహ స్వామి ఫొటో ముందు మొక్కుకోవాలి.

ఇలా స్వామి వారిని వేడుకోవడం వల్ల అందరికీ మేలు కలుగుతుందని, దీన్ని ఎవరైనా పాటించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనికి ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ డేటాఫ్‌ బర్త్‌ అయినా, ఏ రాశిలో పుట్టిన వారైనా చేయొచ్చని చెబుతున్నారు. వారికి స్థలం గురించి వచ్చే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందంటున్నారు. ఇంట్లో ఏదీ లేకపోయినా, సైట్‌ తీసుకోవాలి అనుకున్నవారైనా సరే ఈ విధానం పాటిస్తే శుభం కలుగుతుందట.

మరో విధానం ఏంటంటే.. బుధవారం రోజు తిరుమల వచ్చి దర్శనం చేసుకుంటామని, వరాహస్వామిని దర్శనం చేసుకొన్న తర్వాతే వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటానని మొక్కుకోవాలి. బుధ గ్రహం అంటే నారాయణుడి కారకత్వం ఉంటుంది. బుధవారం దర్శించుకోవడం వల్ల లక్ష్మీనారాయణుడి కారకం వాళ్లకు కలుగుతుంది. దీని వల్ల బుధవారం దర్శించుకుంటామని మొక్కుబడి పెట్టుకొని ఇలా చేస్తే మంచి జరుగుతుంది. ఇలా ఐదు బుధవారాలు వరాహ స్వామిని, శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటానని మొక్కుకోవాలి. మొక్కు తీరిన తర్వాత దర్శనం చేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల 12 రోజుల్లోనే కోరిక నెరవేరుతుందట. లేదా కొన్నిసార్లు 27 రోజుల్లో, లేదంటే మండలం అంటే 48 రోజుల్లో సదరు కోరిక తీరుతుంది. ఇందుకు ఒక మంత్రం కూడా ఉంది.

ఓం నమో భగవతే
వరాహ రూపాయ
భూర్భువః స్వః పతయే
భూపతీతం మేధేహి
గదాపయే స్వాహా

ఈ మంత్రాన్ని పఠనం చేసుకోవాలి. రోజూ కనీసం 12 సార్లు లేదా 27 సార్లు లేదా 48 సార్లు లేదా అల్టిమేట్‌ నంబర్ 108 సార్లు చదువుకోవాలి. నెయ్యి దీపం వెలిగించి ప్రార్థన సంకల్పం చేసుకొని ఈ మంత్రం చదివితే వంద శాతం మీ కోరిక నెరవేరుతుందట. ఉదయం 5 లేదా 6 గంటలు లేదా 7 గంటల్లోపు, అలాగే మధ్యాహ్నం 11 గంటలు, 12 గంటలు, ఒంటి గంట లోపు అలాగే సాయంత్రం 5, 6, 7 గంటల్లోపు ఇలా చేయాలి. వేగవంతంగా రిజల్ట్‌ వచ్చేస్తుందని పెద్దలు చెబుతున్నారు.

ఇదీ చదవండి: Devotional Tip: శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం.. ఎన్ని అప్పులున్నా ఈ మంత్రాన్ని పుస్తకంలో రాసుకొని చదవండి.. సకల శుభప్రదం!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు