AP Assembly: ఈనెల 5వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలు 5న ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఉదయం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం తొలిరోజు సభ వాయిదా పడుతుంది. (AP Assembly)
అదేరోజు బీఏసీ సమావేశం నిర్వహించి ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. 3 లేదా నాలుగు రోజులపాటు ఈసారి సభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో తక్కువ రోజులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ఆమోదించే అవకాశం ఉంది.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రచించాల్సిన వ్యూహంపై ప్రతిపక్షం ఇంకా సిద్ధం కాలేదు. ఇప్పటికే చంద్రబాబు అసెంబ్లీకి రానని చెప్పిన సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎలాంటి వైఖరి అవలంభించాలనేది పార్టీ నిర్ణయం ప్రకారం జరుగుతుందని నేతలు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Rajyasabha Elections AP: అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఏపీలో రసవత్తరంగా రాజ్యసభ ఎన్నికలు.. ట్విస్టులు తప్పవా!
YSRCP Candidates 3rd List: వైయస్సార్‌సీపీ మూడో లిస్టు విడుదల.. సామాజిక సమీకరణాలు క్రోడీకరించి…
CEC Press meet: ఏపీలో ఎన్నికల నిర్వహణపై సిద్ధమవుతున్నాం.. విజయవాడలో సీఈసీ కీలక ప్రెస్‌మీట్
Manthena Satyanarayana Raju: మంతెన సత్యనారాయణరాజు ఆరోగ్యాలయంలో దినచర్య ఎలా ఉంటుందంటే.. ఫీజు ఎంత?
