HomeAndhra PradeshAP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గ్రేట్‌ న్యూస్‌.. 6,100 పోస్టుల భర్తీకి కేబినెట్‌...

AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గ్రేట్‌ న్యూస్‌.. 6,100 పోస్టుల భర్తీకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌

AP DSC 2024: ఆంధ్రప్రదేశ్‌లో టీచర్‌ ఉద్యోగార్థులకు జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్‌ భేటీలో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆమోదముద్ర పడింది. ఇన్నాళ్లూ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన ఉద్యోగార్థులకు ఇది నిజంగా శుభవార్తగానే పరిగణించాలి. వాస్తవానికి జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు. అయితే, 1998 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయడం, చంద్రబాబు హయాంలో వేసిన డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వడం పూర్తి చేశారు ముఖ్యమంత్రి జగన్‌. గతేడాది టీచర్‌ ఎలిజబులిటీ టెస్ట్‌ మాత్రమే నిర్వహించారు.

ఇన్నాళ్లూ టెట్‌ నిర్వహిస్తారని, లేదు లేదు.. టెట్‌ కమ్‌ టీఆర్టీ నిర్వహిస్తారంటూ వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఇదిగో డీఎస్సీ, అదిగో టెట్‌.. అంటూ కాలం వెళ్లదీసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎన్నికలు వచ్చేస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో డీఎస్సీ నిర్వహణకు సన్నద్ధమైంది. వాస్తవానికి ఇదే పని ఒక ఏడాది కిందట చేసి ఉంటే నిరుద్యోగుల్లో ప్రస్తుతం ఉన్నంత వ్యతిరేకత ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మెగా డీఎస్సీ నిర్వహణ కాకపోయినా 6,100 పోస్టులంటే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సాహసమైన నిర్ణయమేనంటూ నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ నిర్ణయం ప్రభావం చూపే ఆస్కారం లేకపోలేదు. జగన్‌ హయాంలో డీఎస్సీ నిర్వహించి పోస్టింగులు కూడా ఇచ్చేస్తే.. వీరంతా, వీరి కుటుంబ సభ్యులంతా జగన్‌కే ఓటేసే అవకాశం కూడా ఉంది. అయితే జగన్‌ సర్కార్‌ ఇప్పటికే 2 లక్షలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. గ్రామ సచివాలయ ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులుగా ఉన్నారు. అలాగే 2.50 లక్షల మంది వాలంటీర్లకు ఉపాధి కల్పించింది. వారికి ప్రతి నెలా రూ.5750 గౌరవ భృతి అందిస్తోంది జగన్‌ సర్కార్. మరోవైపు వైద్య రంగంలోనూ సుమారు 60 వేల మందికిపైగా సిబ్బందిని నియమించింది జగన్‌ సర్కార్‌.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం..
* రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్న కీలక నిర్ణయానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
* డీఎస్సీ–2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమం, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని స్కూళ్లలో 6,100 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
* 2019 నుంచి ఒక్క విద్యారంగంలోనే 14,219 టీచర్‌ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది.
* సబ్జెక్ట్‌ టీచర్ల కాన్సెప్ట్‌ దృష్ట్యా ఏర్పడిన 7,761 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది.

* డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు 42 ఏళ్ల వయో పరిమితి విధించింది.
* ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వయోపరిమితిని సడలింపు.
* రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లలో 15 రోజుల పాటు పరీక్షల నిర్వహణ.
* 8 రోజుల పాటు టెట్‌ నిర్వహణ.
* మరోవైపు అటవీశాఖలో కూడా 689 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
* ఫారెస్ట్‌ రేంజర్‌ ఆఫీసర్లు సహా వివిధ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
* ఇప్పటికే 2.13 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రస్తుత ప్రభుత్వం.
* తాజా నోటిఫికేషన్‌ల ద్వారా మరో 7 వేల పోస్టుల భర్తీ.
* మొత్తం 2.20 లక్షల పోస్టుల భర్తీ.

ఇదీ చదవండి: AP DSC News : ఆగస్టులో డీఎస్సీ నోటిఫికేషన్‌? తప్పని పరిస్థితిలో జగన్‌ సర్కార్‌.. టీచర్‌ ఉద్యోగార్థులకు గ్రేట్‌ న్యూస్‌!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు