HomeNationalAyodhya Ramalayam: రేపే అయోధ్యలో శ్రీరామ చంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపన.. రామ నామంతో మార్మోగుతున్న అయోధ్య

Ayodhya Ramalayam: రేపే అయోధ్యలో శ్రీరామ చంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపన.. రామ నామంతో మార్మోగుతున్న అయోధ్య

Ayodhya Ramalayam: యావత్‌ దేశం ఎదురు చూస్తున్న ఆనంద క్షణాలు వచ్చేశాయి. రేపటి రోజు ఎంతో చారిత్రాత్మకమైనది. ఉత్తరభారతాన అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతోంది. రేపటి రోజుకు చారిత్రాత్మక నేపథ్యం ఉంది. హిందూ క్యాలండర్ ప్రకారం రేపు పుష్యమాసం…శుక్లపక్షం ద్వాదశి. శుక్లపక్ష ద్వాదశే కూర్మ ద్వాదశిగా పిలుస్తారు. విష్ణుమూర్తి రెండో అవతారం కూర్మావతారాన్ని ధరించిన రోజుగా చరిత్ర చెబుతోంది.

క్షీర సాగర మథనంలో కూర్మావతారంతో భూమాతను మోసిన సందర్భం కూడా ఇదే. మంచి పనిచేయడానికి అనువైన రోజుగా తరాల నుంచి నమ్మకంగా చెబుతున్నారు. రేపు మధ్యాహ్నం 84 సెకన్ల పాటు దివ్యమైన ముహూర్తం ఉందని పండితులు తెలిపారు. 12:29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12:30 నిమిషాల 32 సెకన్ల వరకు ముహూర్తం నిర్ణయించారు వేద పండితులు. అయోధ్య రాముడి కోసం వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి కానుకలు పంపుతున్నారు.

కశ్మీర్, తమిళనాడు, అఫ్ఘనిస్థాన్ నుంచి అయోధ్యకు కానుకలు చేరుతున్నాయి. కశ్మీరీ యువతులు స్వచ్ఛమైన కుంకుమ పువ్వు అందజేశారు. తమిళనాడు భక్తులు రామాలయం బొమ్మను వేసిన పట్టు బెడ్ షీట్ అందించారు. రాముడి అభిషేకం కోసం కాబూల్ లోని కూబా నదీజలాలు అందించారు. ఛత్తీస్‌గఢ్ భక్తులు రాముల వారికి రేగుపండ్లు సమర్పించారు. చంపా జిల్లాలోని శివ్రి నారాయణ ప్రాంతం నుంచి రేగుపండ్లు తెచ్చారు. వనవాసంలో రాముడికి శబరి ఇక్కడే రేగుపండ్లు ఇచ్చినట్లు చరిత్రకారులు చెబుతారు. శివ్రినారాయణ నుంచి తెచ్చిన ప్రత్యేక మొక్కను భక్తులు అందించారు.

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠకు ముందు ముగుస్తున్న మోదీ 11 రోజుల దీక్ష

11 రోజులుగా నేల పై పడుకోవడం, కొబ్బరి నీరు సేవిస్తూ ప్రధాని మోదీ ఉపవాస దీక్ష చేస్తున్నారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠకు ముందు పలు దేవాలయాలను ప్రధాని మోదీ సందర్శిస్తున్నారు. నేడు ధనుష్కోడిలోని కోదండరామస్వామి ఆలయాన్ని మోదీ సందర్శించనున్నారు. రామసేతు నిర్మించిన ప్రదేశంగా భావించే అరిచల్ మునైనిలో మోదీ పర్యటన చేస్తున్నారు.

అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రత

బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భద్రతకట్టుదిట్టం చేశారు. 12 వేల మంది పోలీసులతో నిఘా ఉంచారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పర్యవేక్షణ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల కదలికలపై నిఘా పెట్టారు. అయోధ్య నగరం మొత్తం 10వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రామమందిరం ఆవరణలో 400 సీసీ కెమెరాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో పోస్టులపై ఏజెన్సీల నిఘా కట్టుదిట్టమైంది. అయోధ్యకు వీఐపీల తాకిడి ఎక్కువైంది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 7 వేల మందికి ఆహ్వానాలు అందించారు. ఎయిర్ పోర్టుకు 100కి పైగా చార్టర్డ్ విమానాలు వస్తున్నాయి. కట్టుదిట్టమైన భద్రతా వలయంలో అయోధ్య ఉంది. ఏటీఎస్ కమాండోలు, పోలీసులు, సీఆర్ పీఎఫ్ పహారా ఉంది.

రామనామస్మరణతో మార్మోగుతున్న అయోధ్య

రేపు పవత్రోత్సవం తర్వాత దేదీప్యమానంగా అయోధ్య కనిపించనుంది. సాయంత్రం 10 లక్షల దీపాలతో రామజ్యోతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇళ్లు, దుకాణాల్లో దీపాలు వెలిగించాలని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి పిలుపునిచ్చారు.

తెలంగాణలోని సిరిసిల్ల నుంచి సీతమ్మకు బంగారు చీరను కానుక అందించారు. సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్ 8 గ్రాముల బంగారం, 210 గ్రాముల వెండితో ఈ చీరను తయారు చేశారు.

రేపు ఉదయం 11 గంటలకు అయోధ్య ఆలయాన్ని ప్రధాని మోదీ పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలలోపు అథిథుల రాక ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ తర్వాత హెలికాఫ్టర్ తో పూలవర్షం కురిపించనున్నారు. ప్రధాని మోదీ, యోగి, మోహన్ భగవత్ ప్రసంగాలు ఉంటాయి.

ఇదీ చదవండి: Adipurush First Talk: గ్రేట్‌ న్యూస్‌.. ఆదిపురుష్‌ ఫస్ట్‌ టాక్ సూపర్‌ హిట్‌.. జై శ్రీరామ్‌!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు