Healthy Village: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో భారత పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణపై (LSDGలు) రెండో థీమ్ అయిన ఆరోగ్యకరమైన గ్రామం (హెల్తీ విలేజ్) అంశంపై జాతీయ వర్క్‌షాప్ నిర్వహించారు. (Healthy Village)
పానల్ డిస్కషన్స్ జాతీయ అవార్డులు పొందిన గ్రామపంచాయతీల నుండి మాజీ సెక్రటరీ కేంద్ర పంచాయతీరాజ్ విజయనంద్, అవార్డులు అందుకున్న వివిధ రాష్ట్రాల సర్పంచులు తమ తమ ప్రతిభను సభ వేదికగా వివరించారు.
రోల్ ఆఫ్ గ్రామపంచాయతీ, ఆరోగ్య రక్షణ, రక్తహీనత, వయసు పైబడ్డ సీనియర్ సిటిజెన్ల అవసరాలు, గ్రామపంచాయతీలలో నివసిస్తున్న ప్రజల సంస్కృతి, డ్రగ్స్ బారిన పడిన వారికి అందించాల్సిన వైద్యం, హెల్త్ సర్వీసులు ఫ్యామిలీ ప్లానింగ్ వంటి గ్రూప్ డిస్కషన్స్ జరిపి గుర్తించిన అవసరమైన ప్రధాన అంశాలను మినిట్స్ రూపంలో రికార్డు చేయడం.
వివిధ రాష్ట్రాల సాంప్రదాయ సంస్కృతిని ఒకరినొకరు పరిచయం చేసుకోవడం వంటి సదస్సులు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, చండీగర్ ఛత్తీస్‌గఢ్, దాద్రా నగర్ హవేలీ, డయ్యు డామన్, న్యూఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, లడక్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి స్థానిక సంస్థల ప్రతినిధులు అధికారులు హాజరయ్యారు.
స్టాల్స్
ఆప్ కో చేనేతలు, చీరలు, టీటీడీ పంచగవ్యాలు, ఐసీడీఎస్ పోషకాహారాలు, డీఆర్డీఏ శ్రీకాళహస్తి కలంకారీ, మాధవ మాల కోయ బొమ్మలు, మహిళ రైతుల ఉత్పత్తులు, ఎర్రమరెడ్డి పాలెం రాగి పాత్రలు విజయనగరం వారి మిల్లెట్స్ ప్రదర్శన , నెల్లూరు జిల్లా ఉదయగిరి వారి చెక్కతో తయారుచేసిన వంట సామాగ్రి (కట్లరీ), ఆయుష్మాన్ భారత్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రదర్శనలు వంటివి సబికులను ఆకట్టుకున్నాయి.
read also: Child labor: 2025 కల్లా బాలకార్మికులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
