Child labor: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2025 వ సంవత్సరానికి బాల కార్మిక రహిత రాష్ట్రంగా గుర్తించేందుకు ప్రభుత్వ/ప్రభుత్వేతర సంస్థలు, బాలకార్మిక వ్యవస్థపై వ్యతిరేకంగా పని చేస్తున్న ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమీషన్ చైర్ పర్సన్ డాక్టర్. కేసలి అప్పారావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాలకార్మిక వ్యతిరేక వ్యవస్థకు వ్యతిరేకంగా కార్యక్రమాలను నిర్వహించడంలో మిగతా రాష్ట్రాలకంటే ఆదర్శంగా నిలిచిందని మరిన్ని కార్యక్రమాలు చేపట్టి బాలకార్మికులకు వ్యతిరేకంగా సమాజంలో చైతన్యాన్ని తీసుకురావాలని ఆయన కోరారు. (Child labor)
ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) డిపార్టుమెంటు వారి సహకారంతో CRAF, NACG EVAC India (SAIEVAC) వారి సహకారంతో రాష్ట్ర స్థాయిలో చేపట్టి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అనే అంశంపై చేపట్టిన ఒకరోజు కార్యశాలలో డాక్టర్. కేసలి అప్పారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రోజు రోజుకూ బడి మానేసిన పిల్లల సంఖ్య పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, రాష్ట్రంలో బాలలను పని నుండి మిముక్తి చేయడం, పునరావాసం, వారి కుటుంబాలతో మళ్ళీ మమేకం చేయడం, కాపాడిన పిల్లను మళ్ళీ బడిలో చేర్చేంచే విషయంలో ఆంధ్రరాష్ట్రం ముందున్నదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పనిలో ఉన్న పిల్లలు రకరకాల చెడు వ్యాసనాలకు బానిసలై వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని. బాలకార్మికులను చేర్చుకునే సంస్థల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే పిల్లలు పనులలో చేరడానికి గల కారణాలను లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు.
పేదరికం పిల్లలపై పర్యవేక్షణ సరిగా లేకపోవడం కొంతమంది నిర్లక్ష్యం బాలకార్మిక వ్యవస్థకు మూలాలుగా ఉంటున్నాయని, సచివాలయ సిబ్బంది గ్రామ గ్రామాన ప్రభుత్వం నియమించిందని, వారి సేవలను పిల్లలు బడిని మానివేయకుండా, బాల్యవివాహాలు, బాలలు పనులకు వెళ్ళకుండా అలాగే చెడుమార్గం పట్టకుండా ఉపయోగించుకోవాలని కమీషన్ చైర్ పర్సన్ అన్నారు.
CID (WPC) సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ KGV సరిత మాట్లాడుతూ, ఒక్క 2023వ సంవత్సరంలో CID, విద్యాశాఖ, కార్మిక, రెవిన్యూ, AHTU ఆధ్వర్యంలో CRAF, BBA ఇతర స్వచ్చంద సంస్థల సహకారంతో నాలుగు విడతలుగా “ఆపరేషన్ స్వేచ్చ” కార్యక్రమాన్ని నిర్వహించి 1506 మంది బాలకార్మికులను గుర్తించడం జరిగిందని తెలిపారు. CID, Police వారు కాపాడిన బాలల కుటుంబాలు, తల్లిదండ్రుల వృత్తి, ఆర్దిక వ్యవస్థ, పిల్లల చదువులు, వారి మానసికస్థితి ఇతరత్రా వివరాలకై అధ్యయనం చేసిందన్నారు.
గుర్తించిన పిల్లలలో ఆడపిల్లలు 10, 8 సంవత్సరాలలోపు పిల్లలు వివిధ పరిశ్రమలో ప్రమాదకరమైన ప్రదేశాలలో పనిచేస్తున్నట్లు గమనించామని అలాగే సుమారు 250 మంది పిల్లలు 16 రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఆంధ్రరాష్ట్రంలో బాలకార్మికులుగా దయనీయమైన జీవితం గడుపుతున్నారని సరిత ఆంధోళన వ్యక్తం చేశారు. “ఆపరేషన్ స్వేచ్చ” కు సహకరించిన ప్రతీశాఖకు, స్వచ్చంద సంస్థలకు ధన్యవాదాలు తెల్పుతూ రానున్నకాలంలో CID మరిన్ని కార్యక్రమాలను రూపొందించాలనుకొంటుందని వాటికి పూర్తి సహకారం కోరారు.
read also: ID cards for Artists: కళాకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
