HomeAndhra PradeshKesineni Nani: వైయస్సార్‌సీపీలోకి కేసినేని నాని.. ఎన్నికల వేళ ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయాలు!

Kesineni Nani: వైయస్సార్‌సీపీలోకి కేసినేని నాని.. ఎన్నికల వేళ ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయాలు!

Kesineni Nani: ఏపీలో ఎన్నికల ముంగిట రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అధికార వైయస్సార్‌సీపీ నుంచి టీడీపీ, జనసేనలోకి, అలాగే టీడీపీ నుంచి వైయస్సార్‌సీపీలోకి వలసలు వేగం పుంజుకున్నాయి. తాజాగా నిన్న విజయవాడ ఎంపీ కేసినేని నాని సీఎం జగన్‌ను కలిశారు. టీడీపీకి, ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో వైయస్సార్‌సీపీలో చేరుతానని స్పష్టం చేశారు. (Kesineni Nani)

కేసినేని నాని ఏమన్నారంటే..
* 2013 జనవరి 16 నుంచి టీడీపీ కోసం కష్టపడుతున్నా. బాబు పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ నా భుజం పై మోశా.
* నా సొంత వ్యాపార సంస్థల కంటే పార్టీ ముఖ్యం అనుకున్నా. టీడీపీ కోసం డబ్బు, సమయం వృదా చేసుకోవద్దని చాలా మంది చెప్పారు.
* అయినా కూడా ఒక లక్ష్యంతో టీడీపీలోకి దిగాను, పనిచేశాను. ఫలితంగానే జిల్లాలో స్థానిక సంస్థలన్నీ గెలిచాం.
* అందుకు పెట్టిన ప్రతిరూపాయి నా జేబులో రూపాయే. విజయవాడ మేయర్ అభ్యర్థిగా శ్వేతను చంద్రబాబే సూచించారు.

* ఆయన మూడురోజుల పాటు అడిగితేనే శ్వేత ముందుకొచ్చింది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టించి నన్ను చంద్రబాబు తిట్టించారు.
* నన్ను, ఎవరు ఎన్ని మాటలన్నా పార్టీ నుంచి కనీస మద్దతు లేదు. ఇలా అనేక రకాలుగా నన్ను అవమానిస్తూ వచ్చారు.
* ఇష్టం లేకపోతే వెళ్లిపోతాను అని నేరుగా చంద్రబాబుతో చెప్పాను. వద్దు, నువ్వు ఉండాల్సిందే అని చెప్పారు.
* కమ్మ వర్గీయులు పోటీ చెయ్యడానికి చాలా సీట్లు ఉన్నాయి. అలాంటిది నా నియోజకవర్గం మాత్రమే దొరికిందా?

* నేను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ. 2 వేల కోట్లు. చాలా మంది చెప్పినా కూడా నేను టీడీపీ లోనే కొనసాగాను.
* నేను ఎప్పుడు చంద్రబాబు దగ్గర రూపాయి తీసుకోలేదు. నన్ను ఎన్నో సార్లు అవమానించారు.
* ఒక వ్యక్తితో ప్రెస్ మీట్ పెట్టించి నన్ను తిట్టించారు. పార్టీ ఎంపీని చెప్పు తీసుకుని కొడతానని ఒకరు తిట్టినా పార్టీ స్పందించలేదు.

* పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా నన్ను తిట్టినా పార్టీ స్పందించలేదు. నేను కూడా కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం నిర్వహించాను.
* సొంత పార్టీ నేతలే నన్ను అవమానించినా పార్టీ చర్యలు తీసుకోలేదు. ఇష్టం లేకపోతే చెప్పండి వెళ్లిపోతా అని కూడా అడిగా.
* నన్ను అవమానించిన వారితో కలిసి పనిచేయలేనని చెప్పా. ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి.
* రౌడీలా చేత కొట్టించాలని చూశారు, నా కుటుంబంలో చిచ్చు పెట్టి కొట్టించాలని చూశారు.

* నా విషయంలో టీడీపీ ప్రోటోకాల్ విస్మరించింది. నా సెగ్మెంట్ లో సభలు పెట్టి పార్టీపరంగా నన్ను వద్దంటారా?
* చంద్రబాబు మోసగాడని అందరికీ తెలుసు. ఇంత పచ్చిమోసగాడు అని మాత్రం నాకు ఇప్పుడే తెలిసింది.
* చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఉపయోగం లేని వ్యక్తి. జగన్ మోహన్ రెడ్డి.. నిరుపేదల పక్షపాతి.
* జగన్ తో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకన్నా. ఎంపీగా రాజీనామా ఆమోదం తర్వాత వైసీపీలో చేరతాను
* చంద్రబాబుకు కనీసం విజయవాడ పట్ల కూడా చిత్తశుద్ది లేదు.

ఇదీ చదవండి: CRT training program: APSSDC-Excel R-Inorganization of the CRT training program and placement program for the final year engineering students

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు