HomeAndhra PradeshCM Jagan Kakinada Sabha: ఇళ్లు కట్టించే కార్యక్రమాలను ఆపించాలనే దిక్కుమాలిన ఆలోచన.. పవన్‌పై జగన్...

CM Jagan Kakinada Sabha: ఇళ్లు కట్టించే కార్యక్రమాలను ఆపించాలనే దిక్కుమాలిన ఆలోచన.. పవన్‌పై జగన్ ఫైర్

CM Jagan Kakinada Sabha: తమది నిరుపేదల ప్రభుత్వం అని గర్వంగా చెబుతున్నానని సీఎం జగన్ అన్నారు. కాకినాడలో వైయస్సార్ పెన్షన్ల పెంపు సభలో జగన్ మాట్లాడారు. పేదల మీద ప్రేమ, పేదలకు తోడుగా ఉండాలనే తపన, ఈరోజు అర్థం చేసుకున్న ప్రభుత్వంగా అడుగులు పడ్డాయన్నారు. ప్రతి అడుగులోనూ మార్పు కనిపిస్తుందని, పేదల పట్ల ప్రేమ కనిపిస్తుందన్నారు. అక్కచెల్లెమ్మల పట్ల మంచి అన్న అప్యాయత కనిపిస్తుందన్నారు. (CM Jagan about his rooling) జగన్ ఇంకా ఏమన్నారంటే..

* గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు అక్షరాలా సున్నా.
* పేదలు ఎలా బతుకుతున్నారు, వారికి మంచి ఎలా చేయాలనే ఆలోచన చేయలేదు.
* మనందరి ప్రభుత్వంలో ఈరోజు నా అక్కచెల్లెమ్మల కోసం మీ జగనన్న పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు 31 లక్షలు.

* ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి మరీ లక్షాధికారులను చేయాలని గూడు ఉండాలని ప్రయత్నం జరుగుతోంది.
* 22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి.
* ఒకాయన ఉన్నాడు. ఆయనకొక దత్తపుత్రుడూ ఉన్నాడు. ఆ దత్తపుత్రుడు, ఆ దత్తతండ్రి ఇద్దరూ కలిసి 2014లో ఎన్నికలప్పుడు వాళ్ల ఎన్నికల మేనిఫెస్టోలో వారు చెప్పిన మాట ప్రతి పేదవాడికీ 3 సెంట్ల స్థలం, ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేసి చివరికి ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు.
* ఆనాడు మాత్రం ఆ దత్తతండ్రి అక్కచెల్లెమ్మలను, పేదవాళ్లను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు కనీసం ఏ ఒక్కరోజూ ప్రశ్నించకపోగా, కేంద్రానికి ఒక లేఖ కూడా రాయలేదు.
* ఇవాళ మీ బిడ్డ 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చి 22 లక్షల ఇళ్లు కడుతుంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు.
* పేదలకు కట్టే ఇళ్లలో, ఇంటి స్థలాల్లో అవినీతి జరిగిందట అని రాస్తాడు.

* ఆ ఇళ్లు కట్టే కార్యక్రమం ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేసిన వారు వీళ్లే.
* అవినీతి పరుడు చంద్రబాబు అని సాక్షాత్తూ కేంద్రానికి సంబంధించిన ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్, ఈడీ కూడా బాబుకు సమన్లు ఇస్తే, కోర్టులు కూడా నిర్ధారించి పరిగణనలోకి తీసుకొని చంద్రబాబును జైల్లో పెడితే, జైలు దగ్గరికి వెళ్లి ఈ దత్తపుత్రుడు ఈ దత్తతండ్రిని పరామర్శిస్తాడు.
* ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా ఈ పెద్దమనిషి చాలా మంచోడని ఈయన సర్టిఫికెట్ ఇస్తాడు.
* అక్కడేమో అవినీతి జరిగినా మాట్లాడడు. మన ప్రభుత్వం విషయానికొస్తే అవినీతి జరగక పోయినా అభాండాలు వేస్తాడు.
* చంద్రబాబు అవినీతి చేసినా ఈ పెద్దమనిషి నోరు ఎందుకు మెదపడంటే ఆ అవినీతిలో ఈయన కూడా పార్టనర్ కాబట్టి.
* ఎవడూ నోరుమెదపడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు ప్రశ్నించడు, మాట్లాడరు.

* గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని? సున్నా. పేదలకు ఇచ్చింది అరకొర.
* అదే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికీ పెన్షన్ గానీ, ఇతర పథకాలుగానీ నేరుగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2.46 లక్షలు నేరుగా పోతోంది.
* ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు.
* ప్రతి పేదవాడికీ మంచి జరగాలని ఎందుకుమీ బిడ్డ చేయగలిగాడు. ఎందుకు చంద్రబాబు చేయలేకపోయాడు ఆలోచించాలి.
* అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు తక్కువ.
* కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి మారాడు.

* అప్పట్లో ఎందుకు ఈ బటన్లు నొక్కే కార్యక్రమం జరగలేదు? ఎందుకు 2.46 లక్షల కోట్లు ఇవ్వలేకపోయారు?
* అప్పట్లో పాలన కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకున్నది తప్ప వేరే పాలన జరగలేదు.
* గజదొంగల ముఠా రాజ్యాన్ని పాలన చేసేది, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు.
* అప్పట్లో డీపీటీ పాలన జరిగితే, మీ బిడ్డ హయాంలో డీబీటీ పాలన జరుగుతోంది.
* చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు.
* ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఈ ఐదేళ్లలో మీ బిడ్డ 44.49 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ 26 వేల కోట్లు ఖాతాల్లోకి పంపించడం జరిగింది.

Read also: YSR Pension Kanuka Sabha: మాట నిలబెట్టుకొని మీ బిడ్డ మీ మధ్యన ఉన్నాడు.. వైయస్సార్ పెన్షన్ పెంపు సభలో సీఎం జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు