CM Jagan about his ruling:: రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామాన్నయినా తీసుకోండి.. ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా మీ ఇష్టం.. ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ఈరోజు ప్రతి గ్రామంలో మార్పు కనిపిస్తుంది.. అని సీఎం జగన్ అన్నారు. కాకినాడలో వైయస్సార్ పెన్షన్ల పెంపు బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. CM Jagan about his ruling)
* గ్రామాల్లో అడుగు పెడుతూనే గతంలో లేని విధంగా మార్పు కనిపిస్తూ గ్రామ సచివాలయం కనిపిస్తుంది.
* మన పిల్లలు 10 మంది శాశ్వత ఉద్యోగులు కనిపిస్తారు. వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది.
* ఇప్పటికే అందుతున్న పెన్షన్ ఇంటికే వచ్చి అందిస్తున్నారు, ఇంటి వద్దకే అందుతున్న రేషన్, గ్రామంలో ఆర్బీకే, విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష కనిపిస్తుంది.
* గ్రామంలో మారిన స్కూళ్లు, మారిన ఆస్పత్రులు, నాడునేడుతో మన కళ్ల ఎదుటే మార్పు కనిపిస్తున్న పరిస్థితులు, మన పిల్లల చేతుల్లో ట్యాబులు, స్కూళ్లలో ఐఎఫ్‌పీ క్లాసు రూములు కనిపిస్తాయి.
* ఆలోచన చేయమని అడుగుతున్నా. ప్రతి గ్రామంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయి.
* వైయస్సార్ రైతు భరోసా, మెరుగులు దిద్దిన 108, 104, కనిపిస్తాయి.
* 1050 రోగాలకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీని మారుస్తూ 3250 రోగాలకుతీసుకుపోయి పేదవాడికి అండగా నిలబడ్డాం.
* రైతులకు పగటిపూటే ఉచిత కరెంటు 9 గంటలు ఇస్తున్న పరిస్థితులు, చదువుకుంటున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, పిల్లలకు వసతి దీవెనతో అండగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
* కేవలం ఈ 55 నెలల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతున్నమార్పులు గమనించాలి.
* ఇంగ్లీషు మీడియం అంటే మీ జగన్
* ట్యాబులంటే మీ జగన్
* గవర్నమెంట్ బడుల్లో ఐఎఫ్ పీలు అంటే దానికి కారణం మీ జగన్
* గత ప్రభుత్వం కంటే 3 రెట్లు పెన్షన్ పెంచింది ఎవరంటే మీ జగన్
* ఇవన్నీ కూడా కేవలం ఈ 55 నెలల కాలంలోనే జరుగుతున్నాయి.
* ఇవన్నీ మీరు ఆలోచన చేయమని కోరడానికి చెప్పాల్సి వస్తోంది.
Read Also : CM Jagan Kakinada Sabha: ఇళ్లు కట్టించే కార్యక్రమాలను ఆపించాలనే దిక్కుమాలిన ఆలోచన.. పవన్‌పై జగన్ ఫైర్
