HomeAndhra PradeshPalnadu Review: పల్నాడులో గణనీయంగా తగ్గిన నేరాలు.. సమీక్షలో డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి

Palnadu Review: పల్నాడులో గణనీయంగా తగ్గిన నేరాలు.. సమీక్షలో డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి

Palnadu Review: పల్నాడు జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు డీజీపీ కే.వి.రాజేంద్రనాథ్ రెడ్డి. పోలీసులు సమర్థ వంతంగా పని చేయడం వల్లే నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభించడం, పోలీసింగ్ లో విన్నూత్న ఒరపడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైనదని తెలిపారు. రెట్టింపు ఉత్సాహంతో మరింత మెరుగైన పోలీసింగ్ ను అందించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు. (Palnadu Review)

సంవత్సరంతో పోలీస్తే ఈ సంవత్సరం పూర్తిగా తగ్గిపోయింది. జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం నెలకొన్నది. నేరాలను నియంత్రించేందుకు తీసుకున్న అనేక చర్యలు, నిరంతరం పాత నేరస్తులను గుర్తించి వారి కదలికలపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం ద్వారా క్రైమ్ కంట్రోల్ లో ఉంది.

ప్రమాదాల నివారణకు వినూత్న ప్రయోగాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తరచుగా జరిగే బ్లాక్ స్పాట్, ప్రమాదాలు జరిగే సమయంను గుర్తించి, ఆర్టీఓ / సంబధిత రోడ్డు ఇంజనీరింగ్ సిబ్బంది తో పోలీసులు కలిసి నిత్యం జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రతినెలా ప్రమాదలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, స్టాప్ బోర్డులు ఏర్పాటుచేయటం, తీసుకోవాల్సిన చర్యలపైనా సంబంధిత సిబ్బందికి సూచనలు ఇవ్వడం, నిరంతర వాహనాల తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్, ప్రత్యేక అవగాహన సదస్సులు, ట్రాఫిక్ ఎన్ ఫోర్స్ మెంట్ ను పెద్ద ఎత్తున పెంచడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం జరిగింది. దీని ద్వారా ఈ సంవత్సరం జిల్లాలో 24.7% ప్రమాదాలు తగ్గగా, మరణాల సంఖ్య 6.9% మరియు క్షతగాత్రుల సంఖ్య 30% తగ్గినది.

ప్రాపర్టీ కేసులు: 2021లో 558 కేసులు, 2022లో 603 కేసులు, 2023లో మొత్తం 319 కేసులు నమోదు. 2022, 2023తో పోలిచితే 23.99% ప్రాపర్టీ రికవరీ శాతం పెరిగింది. అదే విధంగా కేసులు చేదించడంలో 2.53% శాతం పెరుగుదల ఉంది. పోక్సో చట్టం కేసులు: 2021లో 86 కేసులు, 2022లో 81 కేసులు, 2023లో 26 కేసులు నమోదయ్యాయి. 2022తో పోల్చుకుంటే 67.9% కేసుల సంఖ్య తగ్గింది.

సైబర్ క్రైమ్ మరియు ఐటీ చట్టం కేసులు: 2021లో 59కేసులు, 2022లో 27కేసులు, 2023లో 19 కేసుల నమోదు.2022తో పోల్చుకుంటే 29.62% కేసుల సంఖ్య తగ్గింది. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా నమోదైన బైకు దొంగతనాలకు సంబంధించిన కేసుల్లో 90% కేసుల్లో రికవరీ చేయడం ద్వారా చిన్నచిన్న నేరాలకు సంబంధించిన కేసులన్నీ కూడా పూర్తిస్థాయిలో తగ్గుముఖం. అత్యధిక స్థాయిలో లోక్ అదాలత్ కేసుల పరిష్కారం: 2021లో 1417కేసులు, 2022లో 2960కేసులు, 2023లో 5683కేసులు పరిష్కరించబడ్డాయి. 2023లో కేసుల పరిష్కారం లో 91.99% పెరుగుదల ఉంది.

ఫాక్షన్: పల్నాడు జిల్లాలో మొత్తం 11 మండలాలలోని గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉంది. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆ గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారి కదలికల పైన నిరంతరం నిఘా ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇప్పటికే 18 మంది రౌడీలను కన్వీక్ట్ చేయడం

ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 9 అంతరాష్ట్ర, ఇంటర్ స్టేట్ ప్రత్యేక చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గంజాయి మరియు డ్రగ్స్ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. నిరంతరం గంజాయి రవాణా, వినియోగం పైన తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. రానున్న రోజుల్లో జిల్లాలో 20 ఎకరాల విస్తీర్ణంలో నూతన పోలీస్ భావన సముదాయాన్ని నిర్మించేందుకు అన్ని ప్రణాళికలను రూపొందిస్తామని డీజీపీ వెల్లడించారు.

ఇదీ చదవండి: Advanced Software Tools: అడ్వాన్సుడు సాఫ్ట్ వేర్ టూల్స్ ఫర్ ఈ-పబ్లిషింగ్ కోర్సుపై శిక్షణ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు