Modi Youtube Channel: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్సనల్ యూట్యూబ్ ఛానల్ తాజాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ ఛానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2 కోట్ల మందికి చేరుకుంది. ప్రపంచంలో మరే ఇతర నేతకూ ఇలాంటి ఘనత లభించలేదు. ఈ మేరకు అధికార వర్గాలు పేర్కొనడం గమనార్హం. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2007లో ఈ యూట్యూబ్ చానల్‌ను నరేంద్ర మోదీ మొదలు పెట్టారు. (Modi Youtube Channel)
నాటి నుంచి సామాజిక మాధ్యమాలను నరేంద్ర మోదీ విస్తృతంగా వినియోగించుకుంటూ వస్తున్నారు. యూట్యూబ్ చానల్‌లో మోదీ పోస్ట్ చేసిన వీడియోలకు వీక్షణలు 450 కోట్ల పైగానే ఉన్నాయి. చానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య విషయంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. ఆయనకు 64 లక్షల మంది వ్యూయర్స్ ఉన్నారు.
నరేంద్ర మోదీతో పోలిస్తే ఇది మూడోవంతు కంటే తక్కువే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ పోస్ట్ చేసిన వీడియోలకు 22.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆ విషయంలో మోదీ తర్వాత స్థానం ఆయనదే కావడం విశేషం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 7.89 లక్షల మంది, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌కు 3.16 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు కలిగి ఉన్నారు.
ప్రధాని మోదీతో ముడిపడిన యూట్యూబ్ ఛానల్- ‘యోగా విత్ మోదీ’కి 73,000 మంది, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ యూట్యూబ్ చానల్‌కు 35 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ చానెల్ ప్రజాదరణ పొందింది. భారతదేశ ప్రధానమంత్రి నుంచి నేరుగా వార్తలు, సమాచారాన్ని అందించడానికి ఒక ప్రముఖ మార్గంగా ఉంది. యూట్యూబ్ చానల్‌లో ప్రధాన మంత్రి ప్రసంగాలు, కార్యక్రమాలు, ఇతర విషయాలపై వీడియోలు ఉన్నాయి.
ముఖ్యమైన వీడియోలు
* 2014 లో పార్లమెంట్‌లో మోదీ ప్రసంగం
* 2019 లో స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగం
* 2019 లో స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగం
* 2020 లో కరోనావైరస్ పరిస్థితిపై మోదీ ప్రసంగం
ఇదీ చదవండి: G20 Summit: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని మోదీ సమావేశం
Palnadu Review: పల్నాడులో గణనీయంగా తగ్గిన నేరాలు.. సమీక్షలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
